స్కూళ్లను స్మార్ట్‌గా మారుస్తున్న నలుగురు హైదరాబాద్ ఐఐటియన్స్

స్కూళ్లను స్మార్ట్‌గా మారుస్తున్న నలుగురు హైదరాబాద్ ఐఐటియన్స్

Friday November 13, 2015,

3 min Read

స్కూళ్లలో సౌకర్యాల దగ్గరి నుంచి ఆర్భాటాల దాకా... సేవ ఎలాంటిదైనా ? ఏ పనైనా స్కూల్‌లోని క్లాస్ రూం దగ్గరకే టెక్నాలజీని తీసుకొస్తామంటోంది హైదరాబాదీ ఎడ్యుటెక్ స్టార్టప్ ‘స్కూల్ మానిటర్’. విద్యాప్రమాణాలనూ, నాణ్యతను పెంచడం వీరి ప్రధాన లక్ష్యం. స్కూల్ స్థాయి నుంచే మంచి ఎడ్యుకేషన్ అందిస్తే .. భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. దీన్నే అమలు చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని చాలా స్కూళ్లలో ఈ 'స్కూల్ మానిటర్' సేవలను ప్రారంభించింది.

“ స్కూళ్ల నుంచి డేటాను సేకరించి దాన్ని విశ్లేషిస్తాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే రిపోర్టును స్కూల్‌కి అందిస్తాం” - నవీన్ చింతమనేని

స్కూల్ మానిటర్‌కు నవీన్ కో ఫౌండర్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. క్యాడీ (kaddy.co) పేరుతో ఎడ్యుకేషన్ అనలిటిక్ కంపెనీ గతేడాది ప్రారంభమైంది. ఆ కంపెనీ బ్రెయిన్ చైల్డ్ ఈ స్కూల్ మానిటర్. ఇదొక క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్ సొల్యూషన్స్ సంస్థ. స్కూల్ డేటాను సేకరించి దీనిలో అప్ లోడ్ చేస్తే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ , అడ్మినిస్ట్రేషన్ వారు చేయాల్సిన యాక్షనబుల్ ఇన్ సైట్స్‌ని జనరేట్ చేస్తుంది.

image


స్కూల్ మానిటరింగ్

పాఠశాల విద్యావ్యవస్థలో మార్పులను చేయడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచడం దీని ప్రధానలక్ష్యం. ఇందులో భాగంగా స్కూల్ కమ్యూనిటీకి సంబంధించిన డేటాను సేకరించడం ఇందులో మొదటి ఫ్రేజ్. ఈ డేటాలో చిన్నారి ఇష్టాయిష్టాలు, వారి సామర్థ్యం, బోధన ఎంత చక్కగా చేస్తున్నారే విషయం, చెప్పే పద్దతి(స్టైల్), స్కూల్ వాతావరణ పరిస్థితి, అక్కడుండే భద్రత లాంటివాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఈ డేటాను సేకరిస్తారు. మానసిక అవగాహనా పద్ధతి (psychometric instruments) ద్వారా దీన్ని లెక్కిస్తారు.

image


డేటా కలక్షన్‌కి సంబంధించిన ప్రశ్నావళిని స్కూల్ వారికి ఇచ్చి, వారిచ్చిన సమాధానాల బట్టి ఇన్ సైట్స్ జనరేట్ అవుతాయి. సమస్య ఉన్నట్లైతే దానికి పరిష్కార మార్గాన్ని కూడా అందిస్తారు. దాన్ని విజువలైజ్ చేసిన డిజైన్‌లో చూపిస్తారు. దీని ద్వారా మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు వీలు కలగుతుంది. తద్వారా మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కొన్ని స్కూళ్లలో ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని టీం సభ్యులు చెబ్తున్నారు.

స్కూల్ మానిటర్ టీం

స్కూల్ మానిటర్‌ను నలుగురు ఐఐటి హైదరాబాద్ గ్రాడ్యుయేట్లు ప్రారంభించారు. ఇందులో నవీన్ చింతమనేని కో ఫౌండర్ సిఈఓగా ఉన్నారు. గోవింద్ బాలచంద్రన్, చిరాగ్ చౌదరి, అశ్విన్ కొలప్పన్‌- ఇతర కో ఫౌండర్లు. వీరంతా కాలేజీ చదివే రోజుల నుంచే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నారు. క్లాస్ రూం నుంచే ఈ స్టార్టప్‌కు బీజం పడింది. విద్యావ్యవస్థకు టెక్నాలజీని జోడిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వీరంతా నమ్ముతున్నారు. అదే విజన్‌తో ముందుకు దూసుకుపోతున్నారు. 2013 మే నెలలో కాలేజీ నుంచి పాసవుట్ అయిన ఈ నలుగురు తమ స్టార్టప్ కోసం పనిచేయడం ఆరంభించారు. ఈ స్టార్టప్‌కు ఓ రూపు వచ్చింది 2014లో. ఈ ఏడాది ‘స్కూల్ మానిటర్’ ప్రోడక్టు బయటకు వచ్చింది.

రెవెన్యూ సోర్స్

వెబ్ సైట్‌లో స్కూల్ లాగిన్ అయితే మొదట ఫ్రీ ఆఫ్ కాస్ట్ సేవలను అందిస్తారు. సేవలను నచ్చితే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రత్యేక మైన సేవలు కావాలంటే ఇతర ప్లాన్స్ కూడా ఉన్నాయి. స్కూల్ పొజిషన్‌తోపాటు స్టూడెంట్ల సంఖ్య బట్టి సబ్‌స్క్రిఫ్షన్ చార్జీలు వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ బెంగళూరు, హైదరాబాద్ కలిపి 20 స్కూళ్లకు సేవలు అందిస్తున్నారు. మరో 75 స్కూళ్లు ఈ సేవల వినియోగానికి సంసిద్ధత వ్యక్తం చేశాయని 'స్కూల్ మానిటర్' టీం సభ్యులు చెబ్తున్నారు.

ఫండింగ్

స్కూల్ మానిటర్ ప్రోడక్టుకు సీడ్ ఫండింగ్ అందింది. వివిధ రంగాల్లో విశేష అనుభవం ఉన్న సల్మాన్ బాబూఖాన్, సుభాష్ బోడా, ప్రవీణ్ రాజు అనే ఈ ముగ్గురు ఈ స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేశారు. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో ఈ స్టార్టప్ విస్తరించడానికి వీరి సీడ్ ఫండింగ్ ఎంతగానో ఉపయోగపడింది. మొదటి రౌండ్ ఏంజిల్ ఫండింగ్ కోసం చూస్తోన్న ఈ ఎడ్యుటెక్ స్టార్టప్, ఫండింగ్ వస్తే ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక లో మరిన్ని స్కూళ్లకు సేవలను విస్తరించాలని చూస్తోంది.

image


పోటీ దారులు, లక్ష్యాలు

స్థానికంగా ఈ సెగ్మెంట్ లో ఇతర ప్లేయర్స్ ఎవరూ లేరని స్కూల్ మానిటర్ టీం చెబ్తోంది. కొన్ని కన్సల్టెంట్‌లు ఈ పనిని చేస్తున్నా... వాళ్లు అంతా వ్యవస్థీకృతంగా లేరని అంటున్నారు నవీన్. ప్రోడక్ట్ ఓరియెంటెడ్‌గా ఉండే తమ కంపెనీకి ఈ సెగ్మెంట్లో ఎవరూ పోటీ లేరంటున్నారాయన. వచ్చే ఏడాది మార్చి లోపు మరిన్ని నిధుల కోసం చూస్తున్నట్టు వివరించారు. దాన్ని సాధిస్తే హైదరాబాద్, బెంగళూరులో స్మార్ట్ స్కూళ్లను తయారు చేయగలమనే ధీమా వ్యక్తం చేశారాయన.