ఈ కామర్స్‌తో తొక్కుడుబిళ్ల ఆడుకుంటున్న ఇద్ద‌ర‌మ్మాయిలు

భారతీయ కళాకారులతో మమేకమవుతూ వ్యాపార నిర్వహణ--

ఆర్టిస్టుల త్మగౌరవాన్ని పెంచే ప్రాజెక్ట్


0

 చిన్నపుడు తొక్కుడుబిళ్ల ఆట‌ గుర్తుందా? నేలపై కొన్ని బాక్సులు గీసుకుని, ఏదైనా ఒక డబ్బాలోకి బిళ్ల విసిరి, ఒక కాలితో కుంటుతూ బాక్సులను దాటుతూ- ఆ బిళ్లను బయటకు తన్ని, ఏ గీతనూ తాకకుండా- బయటకు రావడం. ఇదీ తొక్కుడు బిళ్ల ఆట స్ట‌యిల్. ఉత్తరాదిలో దీన్ని స్టప్పు అనీ, అడ్డాఖడ్డా అనీ అంటారు. ఇంగ్లీష్‌లో అయితే ఈ గేమ్ పేరు హాప్‌స్కాచ్. చిన్నతనంలో అందరికీ తెలిసిన ఆట ఇది.

పేరుకూ బిజిన‌స్‌కు సంబంధ‌మేంటి?

తొక్కుడుబిళ్ల‌. ఈ పేరే ఒక‌ నోస్టాల్జియా. చిన్ననాటి ఆట‌ల‌ను గుర్తు చేస్తుంది. బాల్యంలోకి ఒక్క‌సారిగా రెక్క‌లు గ‌ట్టుకుని వెళ్లేలా చేస్తుంది. మ‌రి ఈ పేరుకీ బిజినెస్‌కీ సంబంధం ఏంటి? స‌్టార్ట‌ప్ కి ఈ పేరు పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు సూట‌వుతంది. టైటిల్ జ‌స్టిఫికేష‌న్ సంగ‌తి ప‌క్కన పెడితే- అస‌లీ పేరు విన‌గానే సన్నటి చిరునవ్వొకటి పెదాలపై ప్రత్యక్షమవుతుంది. అక్క‌డే స‌గం కాన్సెప్ట్ స‌క్సెస్‌. ఎందుకంటే బిజినెస్ మోడల్ కూడా అనేక కళలకు సంబంధిచింది. అందుకే స్టప్పు అనే పేరుకే ఓటేశారు

స్టప్పు(తొక్కుడుబిళ్ల)
స్టప్పు(తొక్కుడుబిళ్ల)

ఒక వ్యాపారం అని కాదు..

ఫ‌లానా దానికి చెందిన వ్యాపారం అని స్టప్పును చెప్పలేం. ఎందుకంటే అన్ని రంగాలూ స్ట‌ప్పువే. అంద‌రినీ డీల్ చేయడమే దీని ప‌ని. కేవ‌లం ప్రాడ‌క్ట్స్ అమ్మి పెట్ట‌డమే కాదు, పాటు కళాకారులకు, న‌టుల‌కు, ఆర్టిస్టుల‌కు, చివ‌రికి వంట‌వారైనా. త‌గిన‌ చేయూత‌నిస్తుంది. అవ‌స‌ర‌మైతే వారికోసం సంపాదనా మార్గాలు వెతికి పెడుతుంది. ఆర్టిస్టుల‌కు ఎంతోకొంత ప్ర‌చారం క‌ల్పిస్తుంది. వాళ్ల గురించి న‌లుగురికీ తెలిసేలా చేస్తుంది.

అన్ని క‌ళ‌ల‌కూ అడ్డా

మంత్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో ఎవ‌రి టాలెంట్ ఏంటో తెలుస్తుంది. బాగా వంట తెలిసిన‌ వాళ్లు.. న‌టులు,. పెయింట‌ర్లు,. సంగీతం తెలిస‌న‌వాళ్లూ, డిజైన‌ర్లు, ఇలా అనేక ర‌కాల టాలెంటెడ్ పీపుల్ బ‌య‌ట‌కొస్తారు. వాళ్ల‌కు సంబంధించిన‌ ప్రాడ‌క్ట్ ఉంటే అమ్మి పెడ‌తారు. లేదంటే వాళ్ల సేవ‌ల‌ను వేరెవ‌రైనా ఉప‌యోగించుకునేలా చేస్తారు. అంటే -అంద‌రికీ ఇదొక ప్లాట్ ఫాం అన్న‌మాట‌. ఇంకా సూటిగా చెప్పాలంటే క‌ళాకారుల‌కు అడ్డాలాంటిది.

న్యూయార్క్‌లో మొదలైన ప్రయాణం

జీవిక, కనిక. ఇద్దరూ న్యూయార్క్ నుంచి వచ్చినవారే. జీవిక బ్యాంకర్ గా పని చేసింది. క‌నిక‌ ఆర్కిటెక్ట్‌. కానీ ఎందుకో ఈ ఫీల్డ్ ఇద్ద‌రికీ న‌చ్చ‌లేదు. కార్పొరేట్ రంగంనుంచి బయటకు రావాలని ఇద్దరికీ ఉండేది. ఏమాత్రం తృప్తినివ్వ‌ని ల‌క్ష‌ల జీతాలను వ‌దిలేసి స్టార్టప్ వైపు ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టారు.

జీవిక త్యాగి, కనిక ఖోస్లా
జీవిక త్యాగి, కనిక ఖోస్లా

ఎంతో ప‌రిశోధ‌న చేసి మ‌రీ 

ఇక్క‌డిలా కాదు అమెరికాలో. అక్క‌డ క‌ళల‌కు క‌ళాకారుల‌కు స‌మున్న‌తమైన గుర్తింపు ఉంటుంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించి ఆశ్చ‌ర్య‌పోయాం అంటుంది క‌నిక‌. నిజ‌మే.. మ‌న దేశంలో కళలకు, కళాకారులకు ఇక్క‌డ‌ స‌రైన‌ గుర్తింపు లేదు. ఆద‌ర‌ణ లేదు. అందుకే వాళ్ల‌ గురించి, వారుప‌డే కష్టం గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలని అనుకున్నారు. ప్రతీ కళాకారుడిలో దాగిఉన్న ఎంట్ర‌ ప్రెన్యూర్ ని ప్రోత్సహించాలని భావించారు. వారితోపాటే మా వ్యాపారానికీ బాటలు వేసుకోవాలన్నది మా ఆలోచన అంటారు కనిక. కళాకారులకు ఆర్ధికంగా ఆస‌రా ఇచ్చినంత మాత్రాన స‌రిపోదంటారు స్టప్పు నిర్వాహకులు. ప్రస్తుతం మన దేశంలో ఈ కామర్స్ రంగం కేవలం ప్రాడ‌క్ట్ అమ్మ‌డానికో, స‌ర్వీస్ చేయ‌డానికో పరిమితమైంది. కానీ ప్రతీ వ‌స్తువు అమ్మకం వెనుక ఆ వ‌స్త‌వుకున్న ప్రాధాన్య‌త‌ను, దాని సంస్కృతిని, పుట్టుపూర్వోత్త‌రాల‌ను తెలియచెప్పడమనేది కొత్త విషయం.  

అంతా సొంతమే

ప్రస్తుతానికి ఫౌండర్లు సొంత డ‌బ్బుతోనే స్టప్పను నిర్వహిస్తున్నాత్వరలోనే నిధులు సమీకరించబోతున్నారు. టెక్నిక‌ల్ టీం కాకుండా- స్టప్పులో ప్రస్తుతం ఉన్నది ఇద్దరు కో-ఫౌండర్స్, కొందరు ఇంటర్న్స్ ఉన్నారంతే. త్వరలో మరికొందరిని రిక్రూట్ చేసుకోవడం ద్వారా కార్య‌క‌లాపాలు స్పీడ‌ప్ అవుతాయ‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికైతే ముంబై కేంద్రంగా ఆపరేష‌న్స్ నిర్వహిస్తున్నారు. త్వ‌ర‌లో ఢిల్లీ, బెంగళూరులోనూ ప్రారంభించబోతున్నారు. డిసెంబర్‌లో ఫ్యాషన్ వింగ్‌ కూడా లాంఛ్ కానుంది. దేశవ్యాప్తంగా 4 ప్రధాన నగరాల్లో మొత్తం 10 కేటగిరీల్లో సర్వీసులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ విభాగాల్లో దశలవారీగా టీం మెంబర్ల సంఖ్య పెంచుకుంటాం.. ఈ దేశ కళాకారులకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాతులు దక్కేలా చేస్తాం అంటారు కనిక. 

వెళ్తున్న రూట్ స‌రైందే..

ప్లానింగ్ అంతా ప‌క్కాగానే ఉంది. మౌత్ ప‌బ్లిసిటీ కూడా ఫ‌ర‌వాలేదు. ఎంచుకున్న రూట్ సరైందే అంటున్నారు క‌నిక, జీవిక‌. పూర్తిస్థాయి ఈ కామర్స్ పోర్టల్ కోసం టెక్నిక‌ల్ టీం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతోంది. త్వరలోనే ఆర్టిస్టుల ప్ర‌తిభ ప్రపంచానికి తెలిసేలా పూర్తిస్థాయిలో సైట్ రెడీ కాబోతుంది. రివ్యూ, ఫీడ్ బ్యాక్ లు కూడా తీసుకుంటామంటున్నారు. మరోవైపు ఆన్ లైన్ అమ్మకాల కోసం పది విభిన్నమై కేటగిరీల్లోనూ ప్రాడక్టులు సిద్ధంగా ఉంటాయి. వీటితోపాటు ఈవెంట్ల నిర్వహణ కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది”అని చెప్పారు వ్యవస్థాపక ద్వయం.


స్టార్స్ & స్ట్రైప్స్, స్టప్పు మరుసటి ఈవెంట్ ఇదే
స్టార్స్ & స్ట్రైప్స్, స్టప్పు మరుసటి ఈవెంట్ ఇదే


ఇదో ప్రయోగాత్మకమైన వ్యాపార మోడల్. అయినా తమకూ కొందరు పోటీదారులు ఉన్నారనే విషయాన్ని వీరు గుర్తించారు. ప్రత్యేక సర్వీసులు అందిస్తున్న యూఎస్ సంస్థ 'ఎట్సీని త‌మ‌ వ్యాపార శత్రువుగా చెబ్తున్నారు. కాక‌పోతే ఆ సంస్థ ఇండియాలో లేదు. కాబ‌ట్టి అంత టెన్ష‌న్ ప‌డాల్సిన విష‌యం కాదంటున్నారు. క‌ళాకారుల కోసం నిజాయితీగా క‌ష్ట‌ప‌డుతున్నాం.. వారి క‌ష్టాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్తున్నాం కాబ‌ట్టి పోటీదారుల గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేదంటారు క‌నిక‌.

స్టప్పుకి తొలి క్లయింట్‌ ముంబై కలినరి ఆర్టిస్టులు. వీరితోపాటు ఈట్యాది, పొప్పడం, మడ్ బటర్, బేకర్ హర్, సుక్రీ డిలైట్స్ ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే ఈవెంట్ల నిర్వహణ కోసం ఇన్ సైడర్, హిప్ కాస్క్ వంటి ఇతర స్టార్టప్ లతో జట్టుకడుతున్నారు. కుద‌ర‌కుంటే ఇతర ఈవెంట్లతో కలిపి నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. చాలామంది కళాకారులు తమ బ్రాండ్ ప్రమోషన్ ని స్ట‌ప్పుతో ప్రారంభించారు. అంటే వారి వ్యాపారానికి పేరు పెట్టడం, బిజినెస్ మోడల్ ఏర్పాటు చేయడం, మార్కెటింగ్, డెలివరీలు వంటి కార్యకలాపాలను పర్యవేక్షించడం.

స్నేహంతో మొదలై భాగస్వామ్యం వరకూ..

జీవిక, కనికలు మంచి స్నేహితులు. వారి మధ్య ఉన్న స్నేహమే -వెంచర్ ప్రారంభించేలా చేసింది. మొద‌ట్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నారు. కష్టపడి పని చేశారు కాబ‌ట్టి ఓట‌మి తెలియ‌లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా వెనక్కు తగ్గలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా వెంచర్‌ని ముందుకు నడిపించారు. 

అభినంద‌నీయం

కాలం గ్లోబ‌ల్‌ గుర్రం ఎక్కి ప‌రుగులు తీస్తున్న ఈ రోజుల్లో- క‌ళ‌ల కోసం, క‌ళాకారుల కోసం, వారి ఔన్న‌త్యం కోసం పాటుప‌డేవారెందున్నారు చెప్పండి. దేశ సంసృతీ సంప్ర‌దాయాలను ఇనుమ‌డింపజేస్తూ, క‌ళ‌లాకారుల‌ గౌర‌వాన్ని పెంచుతూ, వారు ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేలా చేస్తున్న స్ట‌ప్పు ఆశ‌యం వంద‌శాతం నెర‌వేరాల‌ని ఆశిద్దాం.వారి సంక‌ల్పం అంత‌రించి పోతున్న‌ క‌ళ‌ల‌కు ప్రాణ‌వాయువు అందించాని కోరుకుందాం.  

Website

All about me, family & freinds

Related Stories