ఆటలతో ఆలోచన సరళి మార్చే నేస్తం ’నౌ! లెట్స్ ప్లే’

ఆటలతో ఆలోచన సరళి మార్చే నేస్తం ’నౌ! లెట్స్ ప్లే’

Saturday October 03, 2015,

3 min Read

“ ఒక మంచి ఆంట్రప్రెన్యూర్ లాగే నేను కూడా చాలా రిస్కులు తీసుకుంటాను. ఇప్పటికే చాలా ఎక్కువ తీసుకున్నాను కూడా. మనకి కావల్సినదానిపై అవగాహన ఉంటే రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదని నమ్ముతాను. నేను చాలా పొరపాట్లు చేసాను, కానీ ఏదో కారణం కోసమే ప్రతీదీ జరుగుతుందని, అదే మనల్ని మెరుగుపరచుకోవడానికి అవకాశాన్ని అందిస్తుందని భావిస్తాను” - అంటారు మొదటి తరం ఆంట్రప్రెన్యూర్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ శిక్షకురాలు, లైసెన్స్డ్ మాస్టర్ ప్రాక్టిషనర్ అయిన అన్నిలీస్ పియర్స్.

image


అన్నీలీస్, రాహుల్ జార్జ్‌లు కలసి సంయుక్తంగా 2011 లో ' నౌ ! లెట్స్ ప్లే ’ ను స్థాపించారు. థియేటర్‌ సహా.. కొన్ని ఆటల కలయికతో రూపొందిన ఓ వినూత్న కాన్సెప్ట్‌ను జనాలకు పరిచయం చేశారు. ఈ కార్యకలాపాల ద్వారా టీమ్- బిల్డింగ్ సహా లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్‌ని రన్ చెయ్యడంపై దృష్టి సారించారు. అయితే వచ్చిన ఫలితాల ద్వారా వాళ్లు సంతృప్తి చెందలేదు. దీంతో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్(NLP)తో వాళ్లకున్న జ్ఞానాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి వాళ్లు NLP కో ఫౌండర్ అయిన డాక్టర్ రిచర్డ్ బ్యాండ్లర్‌తో కలసి అమెరికాలో లైసెన్సింగ్ చేస్తున్నారు.

నౌ లెట్స్ ప్లే ప్రారంభం

రాహుల్ అనే వ్యక్తి కార్పొరేట్ ఇంటర్వెన్షన్స్‌లో థియేటర్ ని ఉపయోగిస్తున్నాడనే విషయం, ఏడేళ్ల కాలంలో చాలాసార్లు ఎవరి ద్వారానో విన్న అన్నీలీస్‌ని అతన్ని కలుసుకోమని కూడా సూచించారు. అన్నీలీస్ ఎలాగోలా అతని టెలిఫోన్ నంబరు సంపాదించారు కానీ దాన్ని ఎక్కడో పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రాజెక్టు కోసం ఆమె క్లైంట్ మరొక యాక్టర్ ఫెసిలిటేటర్ కోసం చూస్తుండగా, అనుకోకుండా చేసిన టెలిఫోన్ కాల్ ఇద్దరినీ కలిపింది.

'' మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉండటాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. ముఖ్యంగా మేమిద్దరం నడుపుతున్న ఇంటర్వెన్షన్స్ ద్వారా ’అసలైన మార్పు’ ని తేవాలనే బలమైన కోరికతో ఉన్నాం ” అంటారు అన్నీలీస్. 

ఇప్పుడు లెట్స్ ప్లే నాలుగేళ్లుగా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తోంది. కుంచితంగా ఆలోచించడం, సమస్యల్ని ఎదుర్కునే తత్వాన్ని మెరుగుపర్చడం ద్వారా కార్పొరేట్లకు - ఆంట్రప్రెన్యూర్లకు మైండ్ కోచింగ్ ఇవ్వడంలో వీళ్ల బృందం ఇప్పుడు ప్రత్యేకత కనబరుస్తోంది.

ఇలాంటి శిక్షణ కూడా ఆడియన్స్‌పై ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్లకైతే ఒక ప్రణాళికా బద్దమైన వార్షిక క్యాలెండర్ ఆధారంగా కోచింగ్ ఉంటుంది. అదే వ్యక్తిగత క్లైంట్లు అయితే కొంతమందికి 3 నుంచి 6 నెలల వరకు ప్రైవేట్‌గా శిక్షణ ఇస్తారు. బృందాలకి ఇచ్చే కోచింగ్‌లో ఒకరోజు లేదా రెండు రోజుల వర్క్ షాప్స్, రిట్రీట్స్ మరియు సెమినార్స్‌ని కూడా నిర్వహిస్తారు.

image


చెప్పింది చేసి నిరూపించుకోవడం

ఫిట్‌గా ఉంటూ.. ఆహారాన్ని ఆస్వాదించి.. హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకునేందుకు NLPలో సహజ నివారణ పద్ధతులని ఉపయోగించారు అన్నీలీస్. 2010 లో 94 కేజీల బరువు, 40 అంగుళాల నడుము కలిగిన ఆమె ఇప్పుడు 73 కేజీల బరువు, 32 అంగుళాల నడుముకి తగ్గడం వల్ల ఎంతో తేలికగా ఫీలవుతున్నానని చెప్తారు.

వ్యక్తిగత విజయాన్ని ఆస్వాదించడం వల్ల, ఇప్పుడు ఆమె నౌ ! లెట్స్ ప్లే ను ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ ఎంప్లాయీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ (EAPs) కి నమోదు చేసుకోమని చెప్తున్నారు. తాను ఒక మిషన్‌లో ఉన్నానని, ఇందులో మహిళలు తమ ఆరోగ్యం పట్ల నియంత్రణ కలిగి ఉండేలా తాను ప్రోత్సహిస్తున్నానని, ఇందుకోసమే ప్రత్యేకంగా ఫేస్ బుక్‌లో ఆన్ లైన్ కమ్యునిటీని కూడా ఏర్పాటు చేసానని చెప్తున్నారు.


అన్నీలీస్ ఒక మనసున్న కోచ్

అన్నీలీస్, రాహుల్ ఇద్దరూ నౌ! లెట్స్ ప్లేకి ఆత్మబంధువుల్లాంటి కోచ్ లు. ’రాశి’ కంటే ’వాసి’ గొప్పదని నమ్మే వీళ్లు ఎప్పటికీ నాణ్యతే గెలుస్తుందని ముక్తకంఠంతో చెప్తారు.

వాళ్లు మొదట్లో ఫండింగ్ కోసం విసి లని కలుసుకోవాలని భావించారు కానీ తక్కువ మంది క్లైంట్లని చేర్చుకునే తమ బిజినెస్ మోడల్ విసిలని అంతగా ఆకర్షించకపోవచ్చని మనసు లోతుల్లో అనిపించింది.

క్లైంట్లను పెంచుకోవాలంటే మరింత బాగా ప్రజలకు చేరువకావడానికి వీరి లాగే ఆలోచించే వ్యక్తులను, ఇటువంటి బలమైన అభిరుచి కలిగినవారితో జతకట్టి ముందుకు సాగాలని అనుకుంటున్నారు. అందుకే వాళ్లు ఎప్పుడూ కూడా ’సమస్యలని ఇష్టపడే’ ఆంట్రప్రెన్యూర్లు ఎవరైనా తమ వర్క్ ని ముందుకు తీసుకువెళ్లేవారి కోసం చూస్తున్నారు.


అసలేంటీ NLP

ఇప్పటికీ ప్రజలు NLP కి, కౌన్సెలింగ్‌కి మధ్య తేడాని గుర్తించలేకపోతున్నారు. ఏ వ్యక్తికైనా ఒక ’కష్టమైన’ పరిస్థితి లేదా మనసుకి తగిలిన గాయం గురించి పదే పదే మాట్లాడవలసిన అవసరం లేకపోవడమే ముఖ్యమైన తేడా. మీకు తెలిసీ, తెలియకుండా మీ ఆలోచనలో లేదా ఒక సంఘటనని మీరు చూసే తీరులో మార్పు తీసుకువచ్చేలా తద్వారా సానుకూల దృక్పథం ఏర్పరుచుకునేలా మీకు శిక్షణ ఇవ్వబడుతుంది అంటారు అన్నీలీస్.