స్కూలుకు వెళ్తూనే స్టార్టప్ నడుపుతున్న తొమ్మిదో క్లాస్ పిల్లోడు

బుక్ రివ్యూ పిల్లల కోసం... పిల్లల ద్వారా.. పిల్లల చేత...

స్కూలుకు వెళ్తూనే స్టార్టప్ నడుపుతున్న తొమ్మిదో క్లాస్ పిల్లోడు

Friday March 11, 2016,

4 min Read


స్కూల్ నుంచి వచ్చి రాగానే పుస్తకాల సంచి విసిరికొట్టి గ్రౌండ్ లో పరుగెత్తే పిల్లలు కొందరు. వీడియోగేమ్స్ తో కాలక్షేపం చేసేవారు మరికొందరు. టీవీలో కార్టూన్ షోలకు అతుక్కుపోయేవారు ఇంకొందరు. కానీ స్కూల్ నుంచి రాగానే స్టార్టప్ వ్యవహారాలను చక్కబెట్టుకునేవారు ఎందరుంటారు? ఆ కుర్రాడు అదే చేస్తున్నాడు. 

అర్థవ్ పాటిల్. చదివేది 9వ తరగతి. ఆ క్లాస్ పిల్లలు బేసిగ్గా ఒకరకమైన భయంతో ఉంటారు. ఎందుకంటే, తర్వాత టెన్త్. మార్కులు.. ర్యాంకులు.. ఏదో తెలియని టెన్షన్ పట్టుకుంటుంది. కానీ అర్ధవ్ పాటిల్ భయపడే బాపతు కాదు. చదువు మినహాయిస్తే.. ఆటలు గీటలు పక్కనపెట్టి ఏకంగా స్టార్టప్ కంపెనీయే పెట్టాడు. దానిపేరు ఐహావ్ రీడ్ ద బుక్.కామ్.  

చిన్నపిల్లల పుస్తకాలను సమీక్షించే ఈ స్టార్టప్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. కేవలం చిన్నారులు, టీనేజర్లకు అత్యంత ఆసక్తి కలిగించే పుస్తకాలను పరిచయం చేయడంలోనూ.. సమీక్షించి వివరాలు అందించడంలో ఈ వెబ్ సైట్ దిట్ట. పిల్లలు సులువుగా అర్థం చేసుకునే భాషలోనే ఇందులో రివ్యూలు ఉంటాయి. వీటిని రాసేది కూడా చిన్నారులే. ఫైనల్ గా దీని అవుట్ పుట్ చూసేది కూడా పదమూడేళ్ల అర్థవ్ పాటిలే.

పుస్తకాల పురుగు

పదమూడేళ్ల ఆర్థవ్ పాటిల్.. ఒకటో తరగతి నుంచే పుస్తకాల పురుగు. అయతే రెండో క్లాసులో అడుగుపెట్టిన తర్వాత చదివిందే చదవి బోర్ కొట్టేసేంది పిల్లోడికి. ఇంకా ఏదో చదవాలనిపించేది. పుస్తకాలు చదవడంలో అర్థవ్ పాటిల్ జిజ్ఞాసను అర్థం చేసుకున్న తండ్రి... చిన్న పిల్లల పుస్తకాలు కొనుక్కొచ్చి ఇచ్చాడు. వాటిని చదువుతూ.. తెలియని అర్థాలను తెలుసుకునేందుకు డిక్షనరీలను కూడా ఉపయోగించేవాడు అర్థవ్ పాటిల్. అలా పుస్తకాలు చదివే అలవాటు అంతకంతకూ పెరిగింది. కనీసం రోజుకు ఒక్క పుస్తకం అయినా కంప్లీట్ చేయకపోతే అర్థవ్ పాటిల్ మనసు మనసులో ఉండేది కాదు. తండ్రి కూడా అర్థవ్ అభిరుచిని అర్థం చేసుకుని నాలెడ్జిని పెంచే పుస్తకాలను తెచ్చి ఇచ్చేవారు. చదివిన పుస్తకం తాలూకు దృక్కోణం, వాటిని సమీక్షించిన వారు ఏ యాంగిల్ లో చూశారు..? ఏ విధంగా అర్థమయింది..? ఇలాంటివన్నింటినీ తనకు తాను ఎనలైజ్ చేసుకునేవాడు.

చదవని పుస్తకంతో ఆలోచన మారింది

పుస్తకాలతో ఎంత విజ్ఞానాన్ని పొందినా.. చదవకుండానే ఓ పుస్తకం ఆర్థవ్ పాటిల్ ని కొత్తదారిలో నడిచేలా చేసింది. సమ్మర్ హాలీడేస్ లో ఓరోజు తను చదవబోయే పుస్తకంలో ఏముందో రివ్యూ తెలుసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడు. అందుకు వాళ్ల నాన్న ఇంటర్ నెట్ లో సెర్చ్ చేయమని సలహా ఇచ్చాడు. అయితే ఎంతసేపు ఇంటర్నెట్ లో వెతికినా తనకి కావాల్సిన పుస్తకానికి సంబంధించి సమీక్ష దొరకలేదు. ఒకటి అరా దొరికినా... అది అర్థం కాని భాషలో ఉంది. అప్పుడే అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ పుస్తకం రివ్యూ నేనే ఎందుకు రాయకూడదు..?అని అదే విషయాన్ని తండ్రికి చెప్పాడు. కేవలం చిన్నారులు, టీనేజర్లకు అర్థమయ్యేలా పుస్తకాల రివ్యూలను నేనే రాస్తానని ప్రతిపాదించాడు. ఎప్పటి నుంచో పుస్తకాలు చదువుతున్నాను కాబట్టి చిన్నపిల్లలకు ఆసక్తి కలిగించే పుస్తకాలేమిటో..వారి అభిరుచులేమిటో తెలు సుకాబట్టి.. వారికి ఇష్టమైనట్లు.. అర్థమయ్యేటట్టు రాస్తానని ఒప్పించాడు. నాన్న మొదట ఆశ్చర్యపోయాడు. పిల్లాడి ఆలోచనను, ఆసక్తిని గమనించి నిరుత్సాహపరచకుండా సరేనన్నాడు.

"మా నాన్న, నేను కలిసి చిన్నారులు, టీనేజర్లకు ఆసక్తి కలిగించే పుస్తకాలను రివ్యూ చేసే ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం"- అర్థవ్ పాటిల్

తండ్రి నుంచి ప్రొత్సాహం లభించడంతో వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయలేదు అర్థవ్. ఇంటర్నెట్ లో శోధించి 12 వేల స్కూళ్ల డేటాను సేకరించాడు. అయితే ఆ తర్వాత మళ్లీ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పని పెండింగ్ లో పడిపోయింది. కానీ అర్థవ్ ఆలోచనలు, ఆసక్తి మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. క్రిస్మస్ సెలవులు ప్రారంభమైన రోజే అమ్మానాన్నతో చిన్న సమావేశం ఏర్పాటు చేసి తన ప్లాన్ వివరించాడు. అలా Ihavereadthebook.com కి రూపకల్పన చేశాడు. వెబ్ డెవలపర్ కి ఇచ్చి స్టార్టప్ పని ప్రారంభించాడు.

విద్యార్థులకు భాగస్వామ్యం

ఇంతవరకూ బాగానే ఉన్నా.. తర్వాత రిజిస్ట్రేషన్స్ పొందడమే పెను సవాల్ గా మారింది. తనొక్కడే అన్ని పుస్తకాలకు రివ్యూ రాయడం అసాధ్యం..! తనలాగే చిన్న పిల్లలే రివ్యూలు రాయాలి..! పుస్తకాలి చదవాలి..! తన సైట్ లో చిన్న పిల్లలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి...! ఇవీ అర్థవ్ పటేల్ కు మొదటగా కనిపించిన సమస్యలు. వీటన్నింటికి ఒకటే పరిష్కారం ఆలోచించాడు.. స్కూళ్లకు లేఖలు రాయాలని భావించాడు. వేసవి సెలవుల్లో సిద్ధం చేసుకున్న పన్నెండు వేల స్కూళ్లకు.. తన మిత్రుల సాయంతో లెటర్స్ పంపాడు. తన వెబ్ సైట్ గురించి మొత్తం అందులో వివరించాడు. రిజిస్ట్రేషన్ చేసుకోమని అభ్యర్థించాడు. సక్సెస్ అవుతుందో లేదో అనుకున్న అర్థవ్ కు.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. వేల సంఖ్యలో స్కూళ్లు తమ విద్యార్థులను వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోమని పొత్సహించాయి. దాంతో ఇక ఆర్థవ్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలి వారంలోనే బుక్ రివ్యూలు పంపేందుకు పెద్ద సంఖ్యలో బాల రచయితలు సిద్ధమయ్యారు. వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమ రివ్యూలు పంపేందుకు ఓ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేశాడు. అలా వచ్చిన రివ్యూలను తనే క్రాస్ చెక్ చేసి పోస్ట్ చేస్తాడు.

" విద్యార్థులు వారి సొంతంగా రాశారో లేదో ఓ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ద్వారా పరిశీలిస్తాను. అరవై శాతం కన్నా తక్కువ సహజత్వం ఉన్నప్పుడు ఆ రివ్యూను తిప్పి పంపుతాను. మళ్లీ రాయమని కోరుతాను. పదిహేను రోజుల్లోపు స్పందన రాకపోతే రివ్యూను డిలీట్ చేస్తాను. విద్యార్థులు సొంతంగా తమ రివ్యూను రాసేలా ప్రొత్సహిస్తాను. వారు సొంతంగా రాస్తే ఒక్క అక్షరాన్ని కూడా మార్చను" అర్థవ్ పాటిల్ 

మొదట్లో పది, పన్నెండు గంటలు పనిచేసేవాడు ఆర్థవ్. రిజిస్ట్రేషన్స్ చూడటం, ఈమెయిల్స్ పంపడం, సందేహాలను సమాధానాలను చెప్పడంతోనే సమయం గడిచిపోయేది. అయితే ఇప్పుడు అంతా పర్ ఫెక్ట్ గా నడుస్తూండటంతో మామూలు రోజుల్లో రెండు, మూడు గంటలు.. వీకెండ్స్ లో మూడు, నాలుగు గంటలు వెబ్ సైట్ ను అప్ డేట్ చేయడానికి కేటాయిస్తున్నాడు.

image


టీన్ టైకూన్

మనోడు రివ్యూలతో బిజీగా మారినా.. పుస్తకాలు చదివే అలవాటు మాత్రం మానుకోలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా తను చదివిన పుస్తకానికి రివ్యూ రాసేస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు చదివే అలవాటుకు దూరమవుతున్నారని.. అలాంటి వారిని మార్చే ప్రయత్నం చేస్తున్నావని చాలామంది పెద్దవాళ్లు ఆర్తవ్ పాటిల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గత నెలలో జరిగిన IIT-B ఈ సమ్మిట్ లో అర్థవ్ పాటిల్ టీన్ టైకూన్ అవార్డును అందుకున్నాడు. 250 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు.

undefined

undefined


ఆదాయం కూడా..!

ఐహావ్ రీడ్ ద బుక్.కామ్ కి ఆదాయం కూడా తెచ్చే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాడు అర్థవ్ పాటిల్. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, క్రాస్ వర్డ్ సంస్థలతో లింకప్ అయ్యాడు. దీని నుంచి ఆయా సైట్లలోకి వెళ్లి పుస్తకాలు కొంటే పది శాతం కమిషన్ ను చెల్లిస్తున్నాయి. చదవుకి, వెబ్ సైట్ కి మధ్య సమయం సమన్వయం చేసుకోడమే ముఖ్యమంటున్నాడు ఈ టీన్ ప్రెన్యూర్. అప్పుడే మాటల్లోనే అంట్రప్రెన్యూర్లను గుర్తుకు తెస్తున్నాడు. భవిష్యత్ లో అయితే రైటర్.. లేకపోతే సైంటిస్టును అవుతానంటున్నాడు. మీ మనసకు నచ్చింది చేయండి అంటూ తోటివారికి సందేశమిస్తున్నాడు.

వెబ్ సైట్