100 డాలర్ల నోటు రద్దు చేసే యోచనలో ఆస్ట్రేలియా

ఇండియా బాటలోనే వెనిజులా, తాజాగా ఆస్ట్రేలియా

0

నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇండియాలో పరిస్థితి గురించి వేరే చెప్పక్కర్లేదు. మన కష్టాలు సంగతి పక్కన పెడితే మొన్ననే వెనిజులా దేశం 100 బొలివర్ నోటును రద్దు చేసింది. అక్కడా మన దగ్గర సీనే కనిపిస్తోంది. అయితే తాజాగా అదే బాటలో ఆస్ట్రేలియా కూడా వెళ్లాలని చూస్తోంది. త్వరలో వంద డాలర్ల నోటు రద్దు చేయాలని చూస్తోంది. టాక్స్ ఎగ్గొడుతూ నల్లధనం పోగేసుకుంటున్న వారి ఆటకట్టించాలంటే- ఇదే మార్గమని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ దెబ్బతో లొసుగుల ద్వారా బ్లాక్ మనీ కట్టలు తెగి బయటకొస్తాయని ఆ దేశ ఆర్ధిక శాఖ చెప్తోంది.

ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో 300 మిలియన్ల వంద డాలర్లు చలమాణిలో ఉన్నాయి. మొత్తం కరెన్సీలో 92 శాతం యాభై, వంద డాలర్ల రూపంలోనే ఉంటాయి. అయితే 5 డాలర్ల నోటు కంటే వంద డాలర్ల నోటు కంటే మూడు రెట్లు ఎక్కువగా సర్క్యులేషన్లో ఉంది. దీన్ని బట్టి చెప్పొచ్చు బ్లాక్ మనీ ఏ స్థాయిలో పోగయిందో. టాక్సులు ఎగ్గొట్టి అక్రమంగా సంపాదించుకున్న నల్లధనమంతా ఆ దేశ జీడీపీలో 1.5 శాతం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ డబ్బంతా బయటకు రావాలంటే డిమానిటైజ్ జరగాల్సిందే అని ఆస్ట్రేలియన్ ఎకానమిస్టులు అంటున్నారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టడమే కాదు, హౌజ్ హోల్డ్ డిపాజిట్లు పెరిగి, క్రైం రేట్ కూడా పడిపోతుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే రద్దు నిర్ణయం తప్పు కాదని ముక్తకంఠంతో చెప్తున్నారు.

ఇదిలా వుంటే మొన్నామధ్యనే వెనిజులా దేశం అతిపెద్ద కరెన్సీ అయిన 100 బొలివర్ నోటును రద్దు చేసింది. భారీ ఎత్తున మాఫియా వర్గాలు ఈ నోట్లను నిల్వ చేశాయని, వారిని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశాధ్యక్షుడు ప్రకటించారు. ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అత్యంత ఎక్కువగా ఉన్న వెనిజులాలో- ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ విలువైన కొత్త నోట్లు, నాణేలను విడుదల చేసేందుకు వెనిజులా సిద్ధం అవుతోంది. ఇంత తక్కువ సమయంలో పెద్ద నోటును రద్దుచేయడం సరికాదని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ ఏడాది చివరికి అక్కడ ద్రవ్యోల్బణం 475శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.

Related Stories