యాప్ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డు.. క్షణాల్లో ఆదాయపన్ను వివరాలు  

1

కేంద్రం చేపట్టిన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా పాన్ కార్డ్ తీసుకోడానికి, టాక్స్ ఎంత చెల్లించాలో తెలుసుకోడానికి ఒక యాప్ తయారు చేస్తోంది. ఆదాయపన్ను శాఖ ఈ యాప్ ను డెవలప్ చేస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఈ ప్రాజెక్టు మీద వర్కవుట్ చేస్తోంది. సీనియర్, యంగ్ టాక్స్ పేయర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ యాప్ తయారు చేస్తున్నారు. దీనిద్వారా ప్రాసెస్ మరింత ఈజీ అవుతుంది. యాప్ కాన్సెప్ట్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పైలట్ ప్రాజెక్టుని ఆర్ధిక శాఖ ఫైనల్ చేయాల్సి వుంది.

ఈ యాప్ ద్వారా రియల్ టైంలో పాన్ కార్డ్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఆదాయపన్ను చెల్లింపు వివరాల్ని నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఆధార్ ఈ-కేవైసీ అథంటికేషన్ సిస్టమ్ ద్వారా ద్వారా డీవోబీ, అడ్రస్ తెలుసుకుంటారు. ఒకవేళ ఈ-కేవైసీ ద్వారా సిమ్ కార్డు తీసుకుంటే అదే పాన్ నంబర్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది. స్పాట్ లోనే నంబర్ జెనరేట్ అవుతుంది. కార్డు తర్వాత ఇంటికొస్తుంది.

రూ. యాభై వేల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే పాన్ నంబర్ తప్పనిసరి చేసింది కేంద్రం. రెండు లక్షల కంటే ఎక్కువ కొనుగోలు జరిపినా పాన్ కార్డ్ కంపల్సరీ అయింది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కలిసి.. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేట్ కంపెనీలకు మూడు నాలుగు గంటల్లోనే పాన్ కార్డులు ఇష్యూ చేస్తున్నాయి. అయితే సమయాన్ని మరింత తగ్గించడానికి యాప్ ద్వారా కార్డులు ఇష్యూ చేయాలని ఫైనాన్స్ శాఖ భావించింది. ఇది ఒక్కసారి ఫైనల్ అయిపోతే డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ లో మరో కీలక అడుగు ముందుకు పడినట్టే.    

Related Stories

Stories by team ys telugu