భాగ్యనగరంలో ఆఫ్ షోర్ ఆపరేషన్స్ విస్తరించాలని చూస్తున్న సింక్రొనీ ఫినాన్షియల్

భాగ్యనగరంలో ఆఫ్ షోర్ ఆపరేషన్స్ విస్తరించాలని చూస్తున్న సింక్రొనీ ఫినాన్షియల్

Thursday April 28, 2016,

2 min Read


భారత దేశంలో ఆపరేషన్స్ పై సింక్రోనీ ఫైనాన్స్ తన వ్యూహాన్ని ప్రకటించింది. దాదాపు 80 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఫైనాన్స్ కంపెనీకి హైదరాబాద్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి తమ భారతీయ ఆపరేషన్స్ పై కంపెనీ ప్రకటన చేసింది. ఐటి మంత్రి కెటీఆర్ తో కంపెనీ సీఈఓ మార్గరేట్ కియేన్ తో పాటు ఇండియన్ హెడ్ ఫైజలుద్దీన్ భేటీ అయ్యారు. అనంతరం కంపెనీ వ్యవహారాలపై ప్రకటన చేశారు.

image


“మా భారతీయ ఆపరేషన్స్ మా ఎదుగుదలో ఎంతోకీలకమైనవి. 2014 నుంచి 2017 వరకూ 130 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం. దాన్ని కొనసాగిస్తున్నాం. మరికొన్నిపెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం” -మార్గరేట్ కియేన్

హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కేంద్రంగా ఈ వ్యవహారాలన్నీ సాగనున్నాయి. అయితే భారత్ నుంచి ఆఫ్ షోర్ ఆపరేషన్స్ వరకే పరిమితం కావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం భారత్ లో ఆపరేషన్స్ కు సిద్ధంగాలేనట్లు ఆమె ప్రకటించారు.

“12 మిలియర్ డాలర్లను భారతీయ ఆఫ్ షోర్ ఆపరేషన్స్ విస్తరించడానికి వినియోగిస్తున్నాం”- మార్గరేట్

ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ సపోర్ట్, ప్రాసెస్ కంట్రోల్ మానిటరింగ్ తో పాటు టెక్నాలజీ సపోర్ట్ కోసం ఈ మొత్తం వినియోగించనున్నారు.

image


తెలంగాణ ప్రభుత్వ సహకారం భేష్

ఆఫ్ షోర్ ఆపరేషన్స్ సక్రమంగా కొనసాగించడానికి ఇక్కడి ప్రభుత్వం చూపించిన చొరవ భేష్ అని మార్గరేట్ అన్నారు. హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ కెపాసిటీని మరింత పెంచే ప్లాన్ లో ఉన్నామని తెలిపారు. మరిన్ని ఆఫ్ షోర్ సేవలను అందుబాటులోకి తీసుకు రావడమే తమ లక్ష్యమన్నారు. ఇదే విషయంపై టీఎస్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఉన్న టాలెంట్, డెడికేటెడ్ వర్క్ ఫోర్స్ తో ఇది సుసాధ్యం అవుతుందన్న దీమా వ్యక్తం చేశారు మార్గరేట్.

సింక్రొనీ గురించి క్లుప్తంగా

గతంలో జీఈ క్యాపిటల్ రిటైల్ ఫినాన్స్ గా ఉన్న సింక్రోనీ ఫైనాన్స్1932 నుంచి ఫినాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉంది. కెనడా, యూఎస్ లో 3 లక్షల 50వేల ప్రాంతాల్లో సేవలున్నాయి. వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ అందిస్తోంది. కస్టమర్లకు క్రెడిట్ సేవలు, క్రెడిట్ ప్రాడక్టులు సమకూరుస్తుంది. భారత్ లో ఆఫ్ షోర్ ఆపరేషన్స్ ప్రారంభించి సుమారు 15 ఏళ్లు కావొస్తున్నాయి. ఇక్కడ ఈ సంస్థకు 2,500మంది ఉద్యోగులున్నారు. కానీ ఆపరేషన్స్ మాత్రం మొదలు పెట్టలేదు. ప్రైవేట్ లేబుల్ క్రెడిట్ కార్డులు ఇచ్చే అతిపెద్ద సంస్థగా ఇప్పుడు అవతరించింది.