చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఆర్డర్ చేసినా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే స్టార్టప్

చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఆర్డర్ చేసినా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే స్టార్టప్

Tuesday July 18, 2017,

2 min Read

ఉరుకుల పరుగుల జీవితంలో టైం బొత్తిగా అడ్జస్ట్ అవడం లేదు. ప్రాజెక్ట్ టార్గెట్, పనివొత్తిడి, అనుకోని ప్రయాణాలు మనిషికి నిద్రకూడా సరిగా ఉండటం లేదు. ముఖ్యంగా పట్టణప్రాంత ప్రజలకు కిరాణా సరుకులు కొందామన్నా సమయం చిక్కడం లేదు. అందుకే చాలామంది ఆన్ లైన్ షాపింగ్ కి షిఫ్టయ్యారు. కూరగాయల దగ్గర్నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల మీదుగా బట్టల దాకా ప్రతీదీ ఆన్ లైనే. వర్చువల్ సూపర్ మార్కెట్లు ఆఫర్ చేయని వస్తువంటూ లేదు.

image


ఈ డిమాండ్ నుంచి పుట్టుకొచ్చిందే మిస్టర్ నీడ్స్. నోయిడాకు చెందిన ఈ మైక్రో డెలివరీ స్టార్టప్ యాప్ బేస్డ్ సబ్ స్క్రిప్షన్ సర్వీసులను అందిస్తుంది. పాల దగ్గర్నుంచి బ్రెడ్, ఎగ్స్, గ్రాసరీ వరకు డెలివరీ చేయని వస్తువంటూ లేదు.

హితాషి గార్గ్, రవి వాద్వా, రవి వర్మ, యోగేష్ గార్గ్ అనే నలుగురు మిత్రుల బ్రెయిన్ చైల్డ్ ఈ స్టార్టప్. 2016 అక్టోబర్ నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టిన మిస్టర్ నీడ్స్.. రోజుకి ఎంతలేదన్నా 1200 ఆర్డర్లు డెలివరీ చేస్తుంది. ఉదయం ఆరింటి నుంచి రాత్రి 9 వరకు అన్ని రకాల సరుకులను చేరవేస్తారు. మొదట్లో నోయిడా చుట్టుపక్కల మాత్రమే రవాణా చేసేవారు. రానురాను పరిధి పెంచారు.

స్థాపించిన కొద్ది కాలంలోనే మిస్టర్ నీడ్స్ కస్టమర్ల మనసు చూరగొంది. ఇప్పటిదాకా మిస్టర్ నీడ్స్ యాప్ కి 9వేల మంది సబ్ స్క్రైబ్ అయ్యారు. రోజుకి సగటున ఆర్డర్ సైజ్ రూ. 120 నుంచి 140 వరకు ఉంటుంది. ఇంకో విశేషం ఏంటంటే వీళ్లు ఎలాంటి డెలివరీ చార్జీలు వసూలు చేయరు. ఎంత మొత్తమైనా ఆర్డర్ చేయొచ్చు. మినిమం ఆర్డర్ అంటూ నియమం లేదు.

మిస్టర్ నీడ్స్ ఏర్పాటు చేయకముందు హితాషి, రవి వర్మ గతంలో కలిసి పనిచేశారు. రవి వాద్వా, యోగేష్ గార్గ్ తో కూడా వర్క్ చేశారు. నలుగురూ ఒకసారి మైక్రో డెలివరీ బిజినెకస్ మీద మాట్లాడుకుంటున్న సమయంలో.. మిస్టర్ నీడ్స్ స్టార్టప్ ఐడియా వచ్చింది. తమకున్న ఫైనాన్స్, టెక్నాలజీ, మార్కెటింగ్ స్కిల్స్ అన్నీ బిజినెస్ కోసం వర్కవుట్ చేసి స్టార్టప్ పెట్టారు. ఉమేష్ అరోరా వీరికి మెంటార్ గా, ఇన్వెస్టర్ గా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ తో పోల్చుకుంటే, ఇది చాలా చవక, సులువైంది కూడా. మిస్టర్ నీడ్స్ కేవలం అపార్ట్ మెంట్ కాంప్లెక్సులో మాత్రమే సర్వీస్ అందిస్తోంది. ఆర్డర్ టు సెర్వ్ మోడల్లో సస్టెయినబుల్ బిజినెస్ చేస్తోంది. డెలివరీ చార్జీలు వసూలు చేయడం లేదు, మినిమం ఇంత ఆర్డర్ చేయాలని రూలేం పెట్టలేదు కాబట్టి, కస్టమర్ చిన్న పాల ప్యాకెట్ కావాలన్నా, బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నా తీసుకెళ్లి ఇస్తున్నారు.

image


మైక్రో డెలివరీ మార్కెట్లో మిస్టర్ నీడ్స్ మాత్రమే ఉంది. దీనికి కాంపిటీటర్ పెద్దగా లేడు. 4వేల గ్రాసరీ ఐటెమ్స్ ఆర్డర్ చేసినా, తెల్లారేసరికల్లా ఇంటిముందు ఉంచుతారు. ఒకవేళ ఆర్డర్ చేసిన వస్తువుల్లో అవసరం లేదనపించిన ఐటెమ్ ని కట్ ఆఫ్ టైంకల్లా తీసేయొచ్చు.

రెండోది.. ఇతర కాంపిటీటర్ల మాదిరి ఫలానా టైంలోనే డెలివరీ ఇస్తాం అని కండీషన్ పెట్టలేదు. ఆర్డర్ సైజ్ ఎంతున్నా మినిమం మూడు గంటల్లో డోర్ నాక్ చేస్తారు. అందుకే అనుకున్న టార్గెట్ దాదాపు రీచ్ అయ్యారు.

ప్రస్తుతానికి టీంలో 80 మంది వర్క్ చేస్తున్నారు. అందులో మెజారిటీ ఫీల్డ్ వర్కర్స్ గా ఉన్నారు. ఇంకో 20 మంది బిజినెస్ ఫంక్షన్స్ చూసుకుంటారు. ఈ మధ్యనే 5లక్షల డాలర్ల ఏంజిల్ ఫండింగ్ రెయిజ్ చేశారు. త్వరలో ఢిల్లీ, ద్వారక, ఇందిరాపురం, గూర్గావ్ లో మిస్టర్ నీడ్స్ ఆపరేషన్స్ విస్తరించాలని భావిస్తోంది.