ఫిట్‌నెస్ సెంటర్ల వివరాల వేదిక 'ప్లే అండ్ లివ్'

ఫిట్‌నెస్ సెంటర్ల వివరాల వేదిక 'ప్లే అండ్ లివ్'

Thursday September 24, 2015,

4 min Read

నకుల్ కపూర్ మంచి రన్నర్. సైకిలిస్ట్ కూడా. అనేక ఆటలూ ఆడతాడు. అతడు ఫిట్‌నెస్‌కి సంబంధించి ప్రాధమిక అంశాల్ని నేర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఇంటర్నెట్ సాయంతో ఫిట్‌నెస్ ట్రైనీలు, సంబంధిత సంస్థల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. తన అవసరాలకు సరిపోయే సంస్థ కానీ, ట్రైనీలు కానీ అతడికి దొరకలేదు. రాహుల్ ఓద్వా.. నకుల్‌కి మంచి స్నేహితుడు. అతడు వారాంతాల్లో పూర్తిగా బాస్కెట్ బాల్ కోర్టులో గడిపేందుకు ఇష్టపడతాడు. అయితే అతడు తాను వెళ్లే కొత్త ప్రాంతాల్లో బాస్కెట్ బాల్ కోర్టు, ఇతర జిమ్ ఫెసిలిటీస్‌ను వెతికిపట్టుకోవడం అంత తేలికేం కాదని గ్రహించాడు. వాళ్లిద్దరూ కలిసి తమ సమస్యను ఎదుర్కోవడానకి ప్లే ఎన్ లివ్‌ను ప్రారంభించారు.

image


ప్లే ఎన్ లివ్(Playnlive) అంటే ఏంటి ?

ఆన్‌లైన్లో క్రీడలు, ఫిట్‌నెస్ సంబంధిత విషయాలను కనిపెట్టి వాటిని బుక్ చేసుకునే విధానానికి సంబంధించిన సమాచారం అందించే ప్లాట్ ఫామ్. కోచింగ్ అకాడమీ, స్పోర్ట్స్ క్లబ్స్, జిమ్స్, ఫిట్నెస్ సెంటర్ల వివరాలన్నింటిని ప్లే ఎన్ లివ్ అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఐదు నగరాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. సమాచారాన్ని అడ్రస్‌లతో సహా ఇవ్వడం, ఫొటోలు, సంప్రదించాల్సిన నెంబర్లు అందిస్తారు. 9000 సదుపాయలకు సంబంధించి ఉచితంగా ట్రైల్ బుకింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

ప్లే ఎన్ లివ్ దాదాపు 25 క్రీడలకు సంబంధించిన మంచి సదుపాయాలు అందిస్తోంది. ఢిల్లీల్లో 250 రకాల సదుపాయల వివరాలను అందజేస్తోంది. వినియోగదారులు వ్యక్తిగతంగా యోగా, ఫిట్‌నెస్, సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు బుక్ చేసుకోగలుగుతారు. న్యూట్రిషినిస్ట్, డైటీషియన్ మొదలైన వారి సేవల్ని కూడా పొందొచ్చు. వివిధ రకాల ఆటల కోసం గ్రౌండ్లు, కోర్టుల బుకింగ్ వెసులుబాటూ ఉంది.

ప్రస్తుతం రోజుకి 100కిపైగా రిక్వెస్టులను స్వీకరిస్తారు. తమ నెట్వర్క్ లో ఉన్న సంబంధిత విభాగాలకు వాటిని పంపిస్తారు. ‘‘ నెలవారీ పాస్‌లు తీసుకుంటే వినియోగదారులు దేశంలో ఎక్కడైనా తమతో ఒప్పందం కుదర్చుకున్న జిమ్‌లకు వెళ్లొచ్చు. ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఆ వినియోగదారులు తమ స్లాట్ ను ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ’’ అంటున్నారు నకుల్.

నకుల్ కపూర్

నకుల్ కపూర్


ఎలా వచ్చిందీ ఆలోచన ?

ఈ స్టార్టప్‌ను నకుల్, రాహుల్ ఇద్దరూ కలిసి ప్రారంభించారు. నకుల్ , ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్సిట్యూట్ (ఐఎంఐ), ఢిల్లీ నుంచి పట్టా పొందిన తర్వాత 2012లో ఆక్సిజన్ సర్వీస్‌లో ప్రొడక్ట్ మెనేజ్‌మెంట్‌లో తన కెరియర్‌ను ప్రారంభించారు. రాహుల్ ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన హన్స్ రాజ్ కాలేజీ నుంచి కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌లో ఫిక్స్‌డ్ ఎసెట్ డొమైన్‌లో కొంతకాలం పాటు పనిచేశారు. దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు ఫిట్‌నెస్ సెంటర్ల వివరాలు కనుక్కోవడం, వాటిలో స్లాట్స్ బుక్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని వీరు కనిపెట్టారు. ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి ఉన్నవారికి, ఆ సర్వీసులు అందిస్తున్నవారికి కూడా ఇదో సమస్యగా మారిందని గుర్తించారు. వాళ్ల ఆసక్తే ఒక స్టార్టప్ ప్రారంభించేలా చేసింది.

‘‘ ప్లేఎన్ లివ్‌కి నేనే క్లర్క్, నేనే సీఈవో, వ్యవస్థాపక భాగస్వామిని. మా ఆఫీసులో ఉన్న ఏసీల దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఆన్‌లైన్ లో కొన్నవే. మేం వెబ్ సైట్, మొబైల్‌లో డెలివరీ చేసే మా ఉత్పత్తులు వరకు అనీ కూడా ఇంటర్నెట్ కి సంబంధించినవే. నేను మొదటి నుంచి ఇంటర్నెట్ ఉత్పత్తులకే బానిస అయిపోయా. ప్లే ఎన్ లైవ్‌ను కూడా గ్లోబల్ వినియోగదారుల కోసం ఇంటర్నెట్ కంపెనీగా తీర్చిదిద్దాం ’’ అంటారు నకుల్. ఇంతకు ముందు అయన పేటీఎంలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ కొద్దికాలం పనిచేశారు. అక్కడ పేటీఎం వాలెట్స్ తయారీలో అనుభవం పొందారు.

image


రెవెన్యూ మోడల్

8 మందితో కూడిన ప్లే ఎన్ లైవ్ , తమ దగ్గర 10,000లకుపైగా లిస్టింగ్స్ ఉన్నాయని ప్రకటించింది. గడచిన మూడ నెలల్లో 5000లకుపైగా లీడ్స్‌ను తమ వ్యాపారులకు అందించారు. మొదట్లో వీరు వెబ్ సర్వీసులను మాత్రమే ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఒక మొబైల్ యాప్‌ను వినియోగదారులు, వ్యాపారుల సౌకర్యం కోసం ప్రారంభించారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో వీరి సేవలు, సదుపాయాలు బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది.

ప్రస్తుతం వీరు తమ స్టార్టప్ గురించి, మౌత్ పబ్లిసిటీ, రిఫరల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. బిజినెస్ టు బిజినెస్ మోడల్ లో తమ భాగస్వాములు నెలసరి చందాలను ఇతర ఫీజులును ఆన్ లైన్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవడం వంటి అంశాలపై దృష్టిసారిస్తున్నారు. ‘‘క్రీడలు, ఫిట్‌నెట్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మనం నమ్ముతాం. మా యూఎస్పీ (యునిక్ సెల్లింగ్ పాయింట్) కేవలం ఫిట్నెస్ ఒక్కటే కాదు, క్రీడలు, బ్రాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. యువరాజ్ సింగ్ అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్స్ తో మా ఒప్పందాలు ట్రయిల్ దశలోనే ఉన్నాయి. అయితే సెహ్వాగ్ అకాడమీతో మాత్రం స్థిరమైన బంధం కొనసాగుతోంది. జస్ట్ డయల్ లాంటి పేరొందిన వాటితో పోల్చితే మేం మరింత మెరుగైన అవకాశాల్ని అందించగలుగుతున్నాం.’’ అంటారు నకుల్.

image


భవిష్యత్ ప్రణాళికలు

తమ ఫ్లాట్ ఫామ్‌లో ఉన్న జాబితాలలో అంశాలను గుర్తించడం చాలా కష్టంగా ఉందని ఈ టీమ్ ఆరంభంలోనే గుర్తించింది. తమకు కావాల్సిన సమాచారం సేకరించడానికి టీమ్ సభ్యులు ఒక్కో సెంటర్‌కు లేదా సదుపాయాలు కల్పించేవారి దగ్గరకు మూడు నాలుగు సార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారు నకుల్.

‘‘ మేం గేట్ కీపర్లు, రిసెప్షన్లు, కేర్ టేకర్ల చుట్టూ తిరిగి చివరకు ఓనర్లను కలిసి మా జాబితాలను సరిచూసుకునేవాళ్లం. కొని సందర్భాల్లో మేం ఫొటోలు కూడా అందించలేకపోయాం, డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో ఈ సదుపాయాల్ని ఉపయోగించుకుంటున్న కొంత మందిని మేం సంప్రదించలేకపోయాం.

ప్లేఎన్ లివ్ మొదటగా స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా సేకరించిన నిధులతో ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏంజిల్ ఇన్వెస్టర్ల ద్వారా పెట్టుబడులు సమకూరాయి. భవిష్యత్తులో ఒక ఐఓఎస్ యాప్ ను లాంచ్ చేయాలనుకుంటున్నారు, ‘టిండర్ ఆఫ్ స్పోర్ట్స్’ గా పిల్చుకోవాలనుకుంటున్నారు. వేరు వేరు ఆటలకు సంబంధించి ఆసక్తి ఉన్నవారు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు ఇది దోహదపడుతుంది.

ఈ సెక్టార్ ఎలా ఉంది ?

భారతదేశంలో హెల్త్, ఫిట్నెస్ సెక్టార్‌ అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం యోగా మీద ప్రచారం చేపడుతోంది. చాలా మంది ప్రజలు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు.

2013లో మొదలైన క్లాస్ పాస్ ఇప్పటి వరకు నాలుగు రౌండల్లలో 54 మిలియన్ డాలర్ల వ్యాపారానికి చేరుకుంది. ఇది ఫిట్‌నెస్ స్టూడియోలకు నెలవారీ పాస్‌లు అందిస్తుంది. వినియోగదారులే తమంత తాముగా వర్క్ ఔట్లు చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. భారతదేశంలో ఫిట్నెస్ పాపా, జిమ్ పిక్, ఫిటర్నిటి వంటి సంస్థలు ఈ మధ్యకాలంలో 1మిలియన్ డాలర్ స్థాయికి ఎదిగాయి. ఈ విభాగంలోకి కొత్తగా ప్రవేశించిన మరో సంస్థ జిమ్మర్. దీని ద్వారా జిమ్ స్లాట్స్ ను అవసరాన్ని బట్టి గంటల వారీగా బుక్ చేసుకోవచ్చు. జస్ట్ డయల్ లాంటి వాటి నుంచి కూడా తమకు పోటీ ఉందని నకుల్ భావిస్తున్నారు.

ఆరోగ్యం, ఫిట్ నెస్ రంగానికి సంబంధించి ప్రముఖమైన స్టారప్, వ్యాపారసంస్థ హెల్తీఫైమీ. మనం తీసుకునే కేలరీలు దానికి అగుణంగా ఫిటెనెస్ అనే కాన్సెప్ట్ తో నడిచే సంస్థ ఇది. ఇది మొదటగా మైక్రోమ్యాక్స్ నుంచి నిధులు సమీకరించింది. రెండో రౌండ్ లో ఏంజిల్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడులు సంపాదించింది. ట్రూవెయిట్ సంస్థ తీసుకునే ఆహారంలో నియంత్రణతో బరువు తగ్గొచ్చని చెబుతోంది. ఈ సంస్థ 2015లలో కలారీ క్యాపిటల్ నుంచి నిధులు సమీకరించింది. గౌరవ్ జస్వాల్, గుల్ పనాగ్ కలసి మొబిఫిట్‌ను ప్రారంభించారు. ఫిట్ నెస్ కోసం ఎదురుచూస్తున్నవారిని గైడ్ చేస్తుంది మొబిఫిట్. విశాల్ గోండాల్ గోక్యూని స్థాపించాడు. ధరించడానికి అనువైన ఫిట్ నెస్ బ్రాండ్స్, దూరంగా ఉన్న వ్యక్తిగత కోచ్ లతో జత కట్టడం వీరు అందించే సేవలు. వీరు ఈ మధ్య కాలంలో వాట్స్ ఆప్ కి చెందిన నీరజ్ అరోరా, అమెజాన్‌కి చెందిన మార్కో అర్జంటిల నుంచి నిధులు సమీకరించారు.