కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర..! అదీ ఒక్క కాలుతోనే!!

ఇన్ఫినిటీ రైడ్ ద్వారా ఐదు రికార్డులు సొంతం చేసుకున్న ఆదిత్య

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర..! అదీ ఒక్క కాలుతోనే!!

Friday November 06, 2015,

3 min Read

ఆ రోజు జరిగిన ఓ యాక్సిడెంట్ జీవితాన్ని అతడి అమాంతం చీకట్లోకి నెట్టేసింది. అప్పటి వరకూ ఇంపోర్ట్స్ ,ఎక్స్ పోర్ట్స్ అంటూ విదేశాల్లో తిరిగే ఆ కుర్రాడి జీవితం ఒక గదికి పరిమితం కావల్సి వచ్చింది. ఒక్క రోజులో అంతా తలకిందులైంది. మస్తిష్కం నిండా శూన్యం ఆవహించింది. అప్పుడు చెప్పాడు తండ్రి- జీవితం ఒకచోట ఆగిపోయిందంటే -అక్కడే కొత్త జీవితం మొదలువుతుందని! ఆ మాటలను వేయి ఏనుగల బలాన్నిచ్చాయి. పడిలేచిన కెరటంలా ఎగసిపడ్డాడు. ఎంత స్పీడుతో అయితే కిందపడ్డాడో అంతే స్పీడుతో లేచి నిలబడ్డాడు. నిలదొక్కుకోడానికి రెండు కాళ్లు అవసరం లేదు.. ఒక్కటుంటే చాలని నిరూపించాడు ఆదిత్య మెహతా. డబుల్ సిల్వర్ మెడల్స్ సాధించడమే కాదు ఆదిత్య ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా మారాడు.

“నువ్వొక యోధుడివి. నీ జీవితంలో నువ్వు పోరాడటం ఆపొద్దు అని నాన్న గారు చెపుతుండే వారు.” ఆదిత్య మెహతా

30 రోజులు ఒకే గదిలో ఉన్నా

ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. ఏకంగా 30 రోజులు ఒకే గదికి పరిమితం అయ్యాను. అలాంటి రోజులు వస్తాయని నేనెప్పుడూ ఊహించలేదు. ఆ గది నుంచి బయటకు వస్తాననే దీమాతోనే ఆ నెలరోజులూ గడిపాను. ఆ టైంలో నా కుటుంబం ఇచ్చిన మద్దతు మరచిపోలేనిది. నెల రోజుల తర్వాత ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత ఏడాదిపాటు నా ఫిట్ నెస్ కోసం కష్టపడ్డా. ఆ సమయంలోనే సైక్లింగ్ చేశా. ప్రంపంచ క్రీడా వేదికలో డబుల్ సిల్వర్ మెడల్ సాధించేదాకా నా ప్రాక్టీస్ కొనసాగింది.

“సడెన్ గా నేనొక సెలబ్రిటీని అయిపోయా. అంతకు ముందు జీవితం కంటే ఇప్పుడే నా జీవితం నాకు నచ్చింది.” ఆధిత్య

యాక్సిడెంట్ తర్వాత నేను కోలుకోడానికి నా స్నేహితులు ఎంతో సహకరించారు. రాత్రి కనపడే చీకటి తర్వాత ఉదయం వచ్చే వెలుగులా నా జీవితం ఒక్క సారిగా మారిపోయింది.

image


ఆదిత్య మెహతా ఫౌండేషన్

ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రారంభించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సుమారు 21మంది స్పోర్ట్స్ మెన్ లకు మేము సహకారం అందించాం. ఫిజికల్లీ చాలెంజ్డ్ అయిన వారిపై జాలి చూపించడం నాకు ఇష్టం ఉండదు. వారిని ప్రోత్సహస్తే వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకూ మేం సాయం అందించిన వారంతా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా మంది ప్రపంచ వేదికలపై తమ సత్తా చాటారు. సాధారణంగా ఉండే వారికంటే వారిలోనే మనో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైర్ ని ఉపయోగించుకోగలిగితే ఎలాంటి టార్గెట్ అయినా చాలా సింపుల్ అయిపోతుంది. మా మోటో కూడా ఇదే. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఇలాంటి వారికోసమే ఏర్పాటు చేసింది. వచ్చే రెండేళ్లలో స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలనే లక్ష్యంతో ముందుకు దూసుకు పోతున్నాం. మాకెలాంటి సహాయం అక్కర్లేదు.

“నాకు ఈరోజే ముఖ్యం. రేపటి గురించి నేను ఆలోచించను. రేపొస్తుందన్న దుఖం కోసం ఇవాళ్టి ఆనందాన్ని దూరం చేసుకోలేను.” ఆధిత్య మెహతా

రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. రేపు ఇదే జరుగుతుందంటే నమ్మనంటారు. ఇప్పుడు జరిగింది మంచి కోసమే జరిగింది. రేపూ మంచే జరుగుతుందని అనుకుంటూ ముందుకు పోవాలని చెప్పుకొచ్చారాయన.

image


ఇన్ఫినిటీ రైడ్

నా జీవితాన్ని మార్చేసిన ప్రయాణం ఇన్ఫినిటీ రైడ్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర చేయడం కష్టమే. మరి ఒక్క కాలు లేకుండా చేయగలమా అనే ప్రశ్నకు ఆదిత్య మెహతా యే సమాధానం. ఇప్పటి వరకూ ఇన్ఫినిటీ రైడ్ ద్వారా ఐదు రికార్డులు సొంతం చేసుకున్న ఆదిత్య మరో రికార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ కు ఫండ్స్ ని ఇన్ఫినిటీ రైడ్ ద్వారా రెయిజ్ చేస్తారు.

image


‘నా కుటుంబమే నాకు శ్రీరామరక్ష’ ఆధిత్య

ఇన్ఫినిటీ రైడ్ లో భాగంగా దోన్ ప్రాంతంలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. సింగిల్ లెగ్ తో రైడ్ చేస్తూ కొండలపై సైక్లింగ్ చేయడం నాజీవితంలో మరచిపోలేని సంఘటన. అప్పుడు నా ఫ్యామిలీ గుర్తొచ్చారు. నన్ను నమ్ముకున్న ఫ్యామిలీకోసమైనా నేను తిరిగి రావాలని సంకల్పించాను. అనుకున్నట్లు గానే సాధించుకొని రాగలిగాను.ఇన్ఫినిటీ రైడ్ ఇంత సక్సస్ ఫుల్ గా సాగుతోందంటే దానికి కారణం తన కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహమే అంటారాయన. తాను తలిచిన మిషన్ పూర్త చేయాలంటే మరో రెండేళ్లు పడుతుందంటున్నారు. ఒక స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించగలననే దీమా వ్యక్తం చేశారు.

image


అకాడమీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కి కోటి రూపాయిలు అవసరం. దాన్ని రన్ చేయడం ఇతర కార్యక్రమాలకు 5 నుంచి 6 కోట్లు అవసరం అవుతుంది. దీనికి ఇన్ఫినిటీ రైడ్ ఒక్కటే ఆదాయ మార్గం. దాంట్లో పాల్గొని విరాళాలు అందిస్తే ఎక్కువ మందికి సాయం చేయగలనంటారు ఆదిత్య