కంపెనీల రవాణా సమస్యలకు 'క్యుబిటో' ఫుల్ స్టాప్

కంపెనీల రవాణా సమస్యలకు 'క్యుబిటో' ఫుల్ స్టాప్

Monday October 05, 2015,

3 min Read

కొద్ది కాలం క్రితం "యువర్ స్టోరీ" క్యూబిటో గురించి ప్రస్తావించినప్పుడు అది ఓ క్యాబ్ పూలింగ్ కంపెనీ మాత్రమే. బిజినెస్ టు కన్జ్యూమర్ విభాగంపైనే దృష్టిపెట్టిన సంస్థ. బీ2సీ మోడల్‌లో క్యూబిటో కామన్ క్యాబ్స్ మాదిరిగా ఉన్న వారిని గమ్యస్థానాలను చేర్చడమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫీస్ క్యాబ్స్ తరహాలో పనిచేస్తుండేది. ప్రస్తుతం క్యూబిటో సేవలు, వ్యాపార స్థాయికి విస్తరించాయి. అందుబాటు ధరల్లోనే వివిధ కంపెనీలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సంస్థ నిర్వాహకులు కృషిచేస్తున్నారు. 2015 జనవరిలో క్యూబిటో టీమ్ బీ2సీ బిజినెస్ మోడల్‌ను బీ2బీగా మార్చారు. ఇప్పుడు క్యూబిటో రవాణా విభాగంలో విస్తృత సేవలందిస్తోంది. బెంగళూరు నగరాన్ని కేంద్రం ఏర్పాటుచేసుకున్న ఈ కంపెనీ ఆటోమేటెడ్ విధానంలో ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్లో తనదైన ముద్ర వేసింది. ఎంప్లాయీ ట్రాన్స్‌పోర్టేషన్ ఆటోమేషన్ టూల్ ద్వారా రవాణాను యంత్రీకరించింది.

వినియోగదారుడితోనే నేరుగా నిర్వహించే వ్యాపార విధానంలో క్యుబిటీ సేవలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. డిమాండ్‌కు తగినట్టుగా వాహనాలు సరఫరా చేయడంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు సహ వ్యవస్థాపకుడు యష్ పడోటియా తెలిపారు. ఈ లోపాలను అధిగమించేందుకు మరో కో-ఫౌండర్ ప్రణయ్‌తో యష్ విస్తృతంగా చర్చించారు. ఈ చర్చల్లో తెరపైకి వచ్చిన బీ2బీలోని సాస్ పై వీరు దృష్టిపెట్టారు. "సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్" (SaaS) తమ బిజినెస్‌కు అనుకూలంగా ఉండడంతో వెంటనే ఈ మోడల్‌ను ఎంపిక చేసుకున్నట్లు యష్ చెప్పారు.

టెక్నాలజీ యే సంస్థకు బలం

క్యుబిటో వ్యవస్థాపకుల బలం టెక్నాలజీయే.. బీ2సీ సెగ్మెంట్లో ఏడాది పాటూ మార్కెట్లో నిలబడ్డ ఈ స్టార్టప్ బి2బీలో SaaS శక్తిని అర్ధంచేసుకుని వెంటనే ఈ ప్లాన్‌ను ఆచరణలో పెట్టినట్లు యష్ పటోడియా చెప్పారు. సంస్థ ప్రారంభదశలో క్యూబిటోను విలీనం చేసుకుంటామంటూ ఆఫర్స్ వచ్చాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరిస్తూ టెక్నాలజీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి రవాణాలో అత్యున్నత సేవలందించే సంస్థకు రూపమిచ్చారు యష్. క్యుబిటో ఫౌండర్స్అభివృద్ధి చేసిన టూల్ ఎంప్లాయిస్ ఏ ప్రాంతంలో ఉన్నదీ తెలుసుకునేందుకు వీలవుతుంది. ఉద్యోగస్తుల జియోకోడ్స్‌ను బట్టి వారికి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ టూల్ ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్‌తో పాటూ వాళ్లు ఎక్కడన్నుది కూడా తెలుసుకోవచ్చు. అంతే కాదు.. పేపర్ వర్క్‌ను నివారించే అవకాశం చిక్కింది. " కంపెనీకి వ్యయాన్ని తగ్గించి.. భద్రత-పారదర్శకతలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యష్ తెలిపారు.

సేఫ్టీ-ట్రాన్స్‌పరెన్సీల ద్వారా వినియోగదారులతో సత్సబంధాలను పెంచుకున్నామని వెల్లడించారు.

క్యుబిటో

క్యుబిటో


బీ2బీతో గణనీయ వృద్ధిరేటు

బీ2సీ మోడల్‌లో ఉన్నప్పుడు క్యుబిటో అభివృద్ధి రేటు 5.8శాతం ఉండేది. బీ2బీగా రూపాంతరం చెందిన క్యుబిటో ప్రస్తుత గ్రోత్ రేట్ 21శాతం. ఈ సంస్థ వారానికి 12.8శాతం చొప్పున అభివృద్ధి సాధిస్తోంది. క్యుబిటో బృందం తమ డేటాబేస్‌లో 12 మంది క్లైంట్స్‌ను చేర్చుకుంది. వీరి ద్వారా బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పుణె, జమ్‌షెడ్‌పూర్‌లల్లో 5వేల వాహనాలను నడుపుతోంది. సంస్థలోని 40 మంది నిష్ణాతుల సహకారంతో ఇంతటి అభివృద్ధి సాధిస్తున్నట్లు యష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ వ్యవస్థ ద్వారా ప్రతీ వినియోగదారుడికీ అత్యున్నత సేవలందుతాయని యష్ చెప్తున్నారు. క్యాబ్స్ సైతం లాభాలు సాధిస్తాయని అంటున్నారు.

image


పారదర్శకతే మా పనితీరు

పారదర్శకత ఆధారంగా ఓ బ్రాండ్‌ను నిర్మించడమే లక్ష్యమని, సామర్ధ్యం-ఆటోమేషన్ సాయంతో వివిధ రంగాల్లో జోరును పెంపొందించడమే ధ్యేయమని టీం చెబ్తోంది. అనేకమంది భారతీయ వినియోగదారులకు సేవలందించడం ద్వారా ఈ దిశగా గణనీయమైన అభివృద్ధి సైతం సాధించామని యష్ అన్నారు. ఈ ఉత్సాహంతోనే త్వరలోనే ఆగ్నేయాసియా దేశాలకూ సేవలు విస్తరించనున్నట్లు వెల్లడించారు. దీని కోసం పెద్ద ఎత్తున డేటాతో పాటూ అంచనా అభివృద్ధి, విశ్లేషణ సామర్థ్యాలను తయారుచేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారానే అమెరికా-యూరప్‌ల్లో రవాణా సమస్యలకు పరిష్కారం లభించిందని అందరి విశ్వాసం. క్యాబ్ షేరింగ్‌కు వేదికగా నిలిచిన తొలి బీ2సీ సంస్థ క్యుబిటోనే కాదు. రైడ్ఇన్ సింక్ కూడా బీ2బీ మోడల్‌కు మారింది. ఇదిలా ఉంటే కార్ పూలింగ్ భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకోకపోవడానికి గల కారణాలను "యువర్ స్టోరీ" గుర్తించగలిగింది. వాహనాలకు సంబంధించి భారతీయులకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సొంత వెహికిల్స్ ఉండాలన్న ఆలోచనతో పెట్టుబడులు సైతం క్యాబ్ షేరింగ్ సిస్టమ్ పై ప్రభావం చూపుతున్నాయి. అంతేకాక పికప్ చేసుకోడానికి వచ్చే క్యాబ్ డ్రైవర్‌ను విశ్వసించడం ప్రధాన సమస్యగా పరిణమించింది. కొందరు ఆఫీస్ క్యాబ్‌లో ప్రయాణించడానికి ఇష్టపడితే ఎలాంటి పరిచయంలేని డ్రైవర్ కార్‌లో ఇతర ప్రయాణికులతో జర్నీ చేయడంపై మరికొందరు ఆసక్తి చూపడం లేదు.

website