మహిళా పారిశ్రామికవేత్తలకు అద్భుత వరం సోషల్ మీడియా !

0


సోషల్ మీడియా... నేటి సమాజంలో అతి పెద్ద ప్లాట్‌ఫాం. మార్కెటింగ్ చేసుకునేందుకు ఒక చక్కటి అవకాశం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్‌ మీడియాను ఉపయోగించకుండా బ్రాండ్‌కు పబ్లిసిటీ ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే సోషల్ మీడియాతో కోట్లాది మందితో కనెక్ట్‌ అవుతారు. ముఖ్యంగా బ్రాండింగ్‌కు సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ప్లాట్‌ఫాంగా మారుతోంది. న్యూస్‌ అయినా, ఈవెంట్‌ అయినా, ప్రాడెక్ట్‌ అయినా వైరల్‌ గా కోట్లాది మందికి సోషల్ మీడియా ద్వారా పాకిపోతోంది.

ఈ అవకాశాన్నే వాడుకోవాల్సిన అవసరం నూతనంగా మార్కెట్‌లో అడుగుపెడుతున్న మహిళా ఆంట్రప్రెన్యూర్‌లకు ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలు తమ సర్వీసెస్‌ను డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పేస్‌లో పెడితే కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. ఒక కుటీర పరిశ్రమ కానీ బొటిక్‌కు కానీ పబ్లిసిటీ ఇవ్వాలనుకుంటే సోషల్‌ మీడియానే కరెక్ట్‌ ప్లేస్‌, ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలో వేలకు వేలు ఖర్చు చేసే కన్నా సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయవచ్చు.  

సోషల్‌ మీడియా కరెక్ట్‌ వేదిక..!

ఇంటర్నెట్‌ యూజర్లలో సుమారు 74 శాతం మంది సోషల్ మీడియాను వాడుతున్నారు. వారిలో సుమారు 76 శాతం మంది మహిళలు కాగా 72 శాతం మంది పురుషులున్నారు. వ్యక్తిగతంగా కూడా మనకు కావాల్సిన టార్గెట్‌ కస్టమర్లను, క్లయింట్స్‌తో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మహిళలకు పురుషుల కన్నా చాలా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ ఇలాంటి మాధ్యమాల ద్వారా మహిళలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. గ్రూప్స్‌ లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందుకే సోషల్ మీడియా మహిళా పారిశ్రామికవేత్తలకు పర్ఫెక్ట్‌ ఛాయిస్‌.

డిజిటల్‌ మార్కెటింగ్‌ లో ఎదురయ్యే సవాళ్లు..!

సోషల్‌ మీడియా పట్ల అప్‌డేట్‌ గా ఉండకపోవడం కూడా మహిళా ఆంట్రప్రెన్యూర్లకు సమస్యగా మారుతుంది. ముఖ్యంగా పబ్లిసిటీ కోసం ఎక్కువగా టైం వెచ్చించలేకపోవడం కూడా ఒక సవాలే. అందుకే కంటెంట్‌ రైటర్ల మీద, డిజైనర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. స్కిల్స్‌ పెంచుకోవడం కూడా సవాలే. అలాగే సోషల్‌ మీడియాలో కావాల్సిన పనికోసం ఓపికగా ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే వీటిని అధిగమించేందుకు ఒక టీంను మెయిన్‌ టెయిన్‌ చేయాలి. అప్పుడే డిజిట్‌ మార్కెటింగ్ లో ఉన్న ఇబ్బందులను ఈజీగా ఎదుర్కొనవచ్చు.

సోషల్‌ మీడియాపై అపోహలు..

సోషల్‌ మీడియాలో ముఖ్యంగా సమయం వృధా అవుతుంది. కానీ నేటి ప్రపంచంలో సోషల్‌ మీడియా ఒక శక్తివంతమైన మాధ్యమం. అయినా ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టాలంటే మాత్రం వెనుకడుగు వేస్తుంటాం. కానీ ఇందులో పెట్టుబడి పెడితే మనకు కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. ఇక ప్రైవసీ విషయంలోనూ అపోహలు ఉన్నాయి. కానీ పబ్లిసిటీ విషయంలో మాత్రం సోషల్‌ మీడియాను మించిన మాధ్యమం మరొకటి లేదు

మొత్తానికి సోషల్‌ మీడియా నేటి ప్రపంచాన్ని కుగ్రామంలా మార్చిన శక్తివంతంమైన మాధ్యమం. అందుకే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సర్విసెస్‌ అందించే వారికి కూడా సామాజిక మాధ్యమం ఒక అద్భుతమైన ప్లాట్‌ ఫాం.     

Related Stories