సంతానం లేదని బాధపడకండి..! పండంటి బిడ్డనిస్తాం భరోసాగా రండి..! !

అమ్మతనాన్ని ప్రసాదిస్తామంటున్న ఇద్ద‌రు డాక్ట‌ర‌మ్మ‌లు

1

ఆడ‌జ‌న్మ అపురూప‌మైన‌ది. అమ్మ‌త‌నం అంత‌కంటే అపురూప‌మైనది. మాతృత్వం క‌న్నా మ‌ధుర‌మైన ఘ‌ట్టం జీవితంలో మ‌రొకటి లేదు రాదు. అమ్మాయి త‌ల్లి కాబోతోంది- అనే వార్త ఏక‌కాలంలో పుట్టినింటినీ మెట్టినింటినీ ఆనంద డోలిక‌ల్లో ముంచెత్తుతుంది. ఇంటిల్లిపాదినీ మురిపిస్తుంది. క‌డుపుని త‌నివితీరా నిమురుకుంటూ రంగుల క‌ల‌ల్లోకి జారుకుంటారు. ఎప్పుడెప్పుడు అమ్మా అనిపించుకోవాలా అని ఆరాట ప‌డుతుంటారు. అదీ మాతృత్వ‌పు మ‌ధురిమ‌. క‌డుపున ఒక కాయ‌కాయాల‌ని ఎదురైన దేవుడిన‌ల్లా మొక్కే త‌ల్లుల‌కు కొద‌వే లేదు. పాపో బాబో ఎవ‌రైతేనేం - క‌డుపు పండితే చాలు- అనుకునే స్త్రీలు ఎంద‌రో! సంతానం కోసమ‌ని ఆ వైద్యం ఈ వైద్యం చేయించుకుంటూ, చివ‌రికి ఆకుప‌స‌ర్లు కూడా తాగుతూ- పొత్తిళ్ల‌లో ప‌సిగుడ్డుకు స్త‌న్య‌మిచ్చి త‌నివితీరా ఏడ్చేయాల‌ని త‌ప‌న ప‌డే మ‌హిళ‌లు- మ‌న‌కు నిత్యం తార‌స‌ప‌డుతునే ఉంటారు.

సంతాన భాగ్యం ఎవ‌రు క‌ల్పిస్తారు ?

నిజమే. సంతానం లేకుంటే అదొక సోష‌ల్ టార్చ‌ర్‌. గొడ్రాలు అనే మాట‌లు ఈటెల్లా దిగ‌బ‌డ‌తాయి. అనుభ‌విస్తేగానీ తెలియ‌దు. సూటిపోటి మాట‌లు త‌ట్టుకోవాలంటే గుండెధైర్యం కావాలి. ఇవాళ కాకుంటే రేపు అనే ఆత్మ‌విశ్వాసం కావాలి. మ‌రి ఆ ధైర్యం, ఆత్మ‌విశ్వాసం ఎవ‌రిస్తారు? సంతాన భాగ్యం ఎవ‌రు క‌ల్పిస్తారు? అలాంటి వారికోస‌మే మేమున్నాం అంటూ ముందుకొచ్చారు ఓ ఇద్ద‌రు డాక్ట‌ర‌మ్మ‌లు.

అడ్వాన్స్‌డ్ ఫర్టిలిటీ సెంటర్‌

డాక్టర్ ఆర్. నిర్మల, డాక్టర్ వర్షా శాంసన్ రాయ్ .ఇద్దరూ బెంగళూరులో బాగా పేరున్న వైద్యులు. సంతానలేమి స‌మ‌స్య ఈ రోజుల్లో ఎంత తీవ్రంగా ఉందో ఒక‌ డాక్ట‌ర్లుగా, అందునా సాటి మ‌హిళ‌లుగా వాళ్ల‌కు బాగా తెలుసు. ఆ కారణంతో ఇద్ద‌రు ఆంట్రప్రెన్యూర్లుగా మారారు. 2004లో బెంగళూరులోని జేపీ నగర్‌లో అడ్వాన్స్‌డ్ ఫర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. వేరే ఆరోగ్య స‌మ‌స్య‌లేవీ చూడ‌రు. వీళ్ల ఫోక‌సంతా సంతానలేమికి స‌మ‌స్య‌కు ట్రీట్‌మెంట్ ఇవ్వడంపైనే. పేషెంట్ల క్లినికల్ కండిషన్లు, టెస్టులు, రిపోర్టులు వగైరా వ‌గైరా డాక్టర్ నిర్మల చూసుకుంటారు. డాక్టర్ వర్ష మాత్రం పేషెంట్ల ఎంబ్రియో (అండం,అండాశయం) సంబంధించిన వింగ్‌ను సూపర్ వైజ్ చేస్తుంటారు.

ఫర్టిలిటీ సెంటర్ లో ఓ ఎంబ్రియో
ఫర్టిలిటీ సెంటర్ లో ఓ ఎంబ్రియో

ఒకే ఆలోచనలతో

వ్యక్తిగత విజయాల విషయానికి వస్తే-డాక్టర్ నిర్మలకు సంతానలేమి స‌మ‌స్య‌ల‌కు తిరుగులేని డాక్ట‌ర్. ఈ మ‌ధ్యే వైద్యరంగంలో ఆమె సేవ‌ల‌ను కొనియాడుతూ అక్క‌డి ప్రభుత్వం ఆర్యభట్ట అవార్డు కూడా ఇచ్చింది. ఇక‌పోతే డాక్టర్ వర్షా శాంసన్ రాయ్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మెడిసిన్‌లో డిగ్రీ పొందారు. మొదట్నుంటీ ఎంబ్రియోలజీ అంటే ఆమెకు ఆసక్తి. వచ్చే పదేళ్లలో ఎలాంటి జబ్బుకైనా అడ్వాన్స్‌ డ్ ట్రీట్‌మెంట్ అంతా లేబొరేటరీల్లోనే జరుగుతుందని నమ్ముతారామె.

పదేళ్ల విజయప్రస్థానం తర్వాత..అడ్వాన్స్‌డ్ ఫర్టిలిటీ సెంటర్ ప్రారంభ దినాల గురించి చెప్తూ.. అప్పట్లో మేం తీసుకున్న నిర్ణయం చాలా డేరింగ్ స్టెప్ అంటారు ఈ ఇద్దరు డాక్టర్లూ.

అడ్వాన్స్‌ డ్ ఫర్టిలిటీ సెంటర్ ప్రారంభానికి ముందు డాక్టర్ వర్ష, డాక్టర్ నిర్మల ఇద్దరూ ఓ మల్టీస్పెషాల్టీ హాస్పటల్‌లో కలిసి రెండేళ్లు పని చేశారు. అప్పుడే ఇద్ద‌రి అభిప్రాయాలు, ఆలోచనలు క‌లిశాయి. మొద‌ట్లో వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బు లేదు. కుటుంబసభ్యులు, స్నేహితులు సాయం చేశారు. ఫర్టిలిటీ సెంటర్ ప్రారంభించినప్పుడు ఈ స్థాయికి చేరతామని ఊహించలేదు. 2వేల గజాల స్థలంలో ప్రారంభమైన సెంటర్‌కు మొదట్లో పది నుంచి 15మంది మాత్రమే వచ్చేవారు. తర్వాత నాలుగేళ్లకు రోజుకు 5వేల మంది పేషెంట్లు రిజిస్టర్ అయ్యారు. ఇది వాళ్ల దృష్టిలో గొప్ప విష‌యం. క‌చ్చితమైన డయాగ్నోసిస్, ల్యాబ్ రిపోర్టుల మీద‌ పేషెంట్లకు ఎన‌లేని నమ్మకం. వాళ్లే మా అడ్వాన్స్‌ డ్ ఫెర్టిలిటీ సెంటర్ కు అతి పెద్ద ప్రచార సాధనాలంటున్న ఇద్ద‌రు డాక్ట‌ర్లు -యువర్ స్టోరీతో ఇంకా ఎన్నో విష‌యాలు షేర్ చేసుకున్నారు. అవేంటో ఈ కింది వీడియోలో చూడండి.

i like extensive reading. తెలుగు భాష అంటే ఎనలేని ప్రేమ. ఎక్కువ చదువుతాను..ఎక్కువ రాయడానికి ఇష్టపడతాను..

Related Stories

Stories by anveshi vihari