నవంబర్ 5న టి-హబ్ ప్రారంభం

0

స్టార్టప్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి-హబ్ ప్రారంభ తేదీ ఖరారైంది. నవంబర్ 5వ తేదీన టి హబ్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. టాటా గ్రూప్ ఛైర్మన్ ఎమిరెటస్ రతన్ టాటా సహా దేశవిదేశాల్లోని పారిశ్రామిక ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు ఆయన వెల్లడించారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటి క్యాంపస్‌లో 60వేల చదరపు అడుగుల్లో టి-హబ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో సుమారు 800 స్టార్టప్‌లకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నో వందల అప్లికేషన్లు రాగా.. వాటిలో నుంచి 40 దరఖాస్తులను స్ర్కీనింగ్‌ చేశారు. నవంబర్ 5వ తేదీ నాటికి మరో 200 దరఖాస్తులను ఖరారు చేయాలని చూస్తున్నట్లు జయేష్‌ రంజన్‌ తెలిపారు.