కనికా టెక్రీ ధైర్యం ముందు కేన్సర్ కూడా చిన్నబోయింది

కేన్సర్‌... జెట్‌ స్పీడ్‌లో పరుగెత్తింది !ఆత్మవిశ్వాసమే ఆయుధంఆశావహ దృక్పధమే రక్షణ కవచంఅందుకే ఆమెకు విజయంజెట్‌ సెట్‌ గో వ్యవస్థాపకురాలు కనికా టెక్రీ కథ

కనికా టెక్రీ ధైర్యం ముందు కేన్సర్ కూడా చిన్నబోయింది

Thursday April 02, 2015,

4 min Read

'మరణం అందరిది కానీ ఆరోగ్యం కొందరిదే' అనే నానుడి ఎవరు చెప్పారో కానీ అది వాస్తవం. అయితే ఆరోగ్యం సంపాదించుకోవడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి తప్పదు. ఊహించని పరిస్థితుల్లో, చిన్న వయస్సులో అనారోగ్యం బారిన పడితే. ఇక చెప్పేదేముంది.. డీలా పడిపోతాము. అధైర్యానికి గురవుతాము. నిరాశ వెంటాడుతుంది. ఇవన్నీ సాధారణ వ్యక్తుల విషయంలో చోటుచేసుకునేవి. కేన్సర్‌ బారినపడి తిరిగి కోలుకుని తాను విజయం సాధించాలనుకున్న రంగంలో జయకేతనం ఎగురవేసి అందరితో శభాష్‌ అనిపించుకున్న ఆ మహిళ గురించి తప్పని సరిగా తెలుసుకోవాల్సిందే. ఆత్మవిశ్వాసంతో కేన్సర్‌ను జయించింది ఎవరంటే జెట్‌ సెట్‌ గో వ్యవస్థాపకురాలు కనికా టెక్రీవాల్‌. కేన్సర్‌ బారి నుండి ఎట్లా బయటపడింది, అందుకు ఎంత కృషి చేసింది మొదలైన ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

కనికా టెక్రివాల్, జెట్ సెట్ గో

కనికా టెక్రివాల్, జెట్ సెట్ గో


''మొట్టమొదటిసారిగా నేను కలిసిన డాక్టరు నాతో ఏమి చెప్పిందంటే.. కనికా, నువ్వు చాలా తక్కువ రోజులు మాత్రమే బతుకుతావు అంది. అప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. డాక్టర్, ఇది నిజమా? !, అయితే నాకు 40 ఏళ్లు వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను కలుస్తాను. మందుల కోసం కాదు. నేను కోలుకున్నానని, బతికి ఉన్నానని, చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పడానికి అని చెప్పాను. అప్పటి నుంచి ఆ డాక్టరు ముఖం కూడా చూడలేదు. తాను చేసే వైద్యంపై, మరీ ముఖ్యంగా నాలో నమ్మకం కల్గించే, ఆశావద దృక్పధం ఉన్న ఒక వైద్యుడిని పట్టుకున్నాను. ఇది అంత తేలికగా జరిగిన వ్యవహారం కాదు. దేశం మొత్తం తిరిగాను. చాలా మంది డాక్టర్లను సంప్రదించాను. నేను ఒక విషయాన్ని బాగా తెలుసుకున్నాను. సరైన వ్యక్తులను మనం ఎంచుకోవడమనేది చాలా ముఖ్యం. అదే నేను నేర్చుకున్న ప్రథమ పాఠం. అటువంటి వ్యక్తులు మనకు తారసపడే వరకు వెతుకుతూ ఉండాల్సిందే. వాళ్లపై నీకు, నీపై వాళ్లకు విశ్వాసం ఉండాలి. నేను, నా డాక్టరు.. ఒక టీం లాగా కేన్సర్‌పై పోరాడాము. ఏడాది పాటు కీమోథెరపి, రేడియేషన్‌ చికిత్సల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నాకు అవసరమైన విషయాల గురించి ఆలోచించడానికి, ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లటానికి అవసరమైన ఆలోచన చేయడానికి ఈ చికిత్స పొందుతున్న సమయంలో నాకు లభించింది. ఎటువంటి సవాల్‌ను అయినా సరే ఎదుర్కొనే సత్తా నాకు వచ్చింది. ముఖ్యంగా లక్ష్యం చేరే వరకు పోరాడే తత్త్వం అలవడింది.

image


జెట్‌సెట్‌ గో పనులు ప్రారంభించినపుడు ఏ పని సరిగ్గా జరగలేదు. అయినా నేను నిరాశ చెందలేదు. తర్వాత ఏమి చేయాలి, ఎలా సాధించాలనే దానిపై దృష్టి పెట్టాను. 6 నెలల సమయం, ఆదాయ మార్గం వంటివి చెప్పినా కూడా ఈ రోజున ఒక విమానాన్ని కూడా కస్టమర్‌కి అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం, కస్టమర్‌ మైండ్‌సెట్‌ మారడం వంటి అంశాలే కారణం. అయినా నేను వెనుకంజవేయలేదు. మరికొంత మంది కస్టమర్ల కోసం ఎదురుచూస్తాను. ఈ విమానాలు మరింత చౌకగా కస్టమర్లకు అందించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. రాత్రి నిద్రపోయే ముందు ప్రతి రోజు నాకు ఒకటే అనిపిస్తుంది. ప్రపంచంలో ప్రభావశీలురైన 100 మంది మహిళల స్థానంలో నేను చేరతానని, ఆరోజు దగ్గర్లోనే ఉందని నాకు అనిపిస్తుంది''. 

విభిన్న రంగాల్లో కనిక

ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించే కనిక మారథాన్‌ రన్నర్‌, పెయింటర్‌, ట్రావెలర్‌. ప్రతిరోజు తన జీవితానికి కొత్త నిర్వచనం చెబుతూనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కేన్సర్‌ను జయించిన కనిక కథ కేవలం చదువకోవడానికి కాదు.. మన శక్తియుక్తులను, ఆశలను సమీక్షించుకుని తిరిగి నూతనోత్తేజం పొందడానికి దోహదపడుతుందన్నది వాస్తవం.

ఏవియేషన్‌ రంగంలో ఎంతో అనుభవం

విమానయాన రంగంలో గత 8 ఏళ్లుగా ఆమె పనిచేస్తోంది. అంటే ఆమె వయస్సు పదిహేడేళ్లు ఉన్నప్పటి నుంచి. మనదేశంలో ప్రైవేట్‌ జెట్‌‌ల చాలా తక్కువ గాను, అంతగా అందుబాటులో లేని రోజుల నుంచి ఆమెకు విమానయాన రంగం గురించి తెలుసు. భారత్‌తో పాటు విదేశీ సంస్థలలో కూడా ఈ రంగానికి సంబంధించి ఆమె పని చేసింది. ఎన్నో సంవత్సరాలుపాటు పనిచేసిన అనుభవం జెట్‌సెట్‌గో ఏర్పాటుకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా ఈ రంగానికి చెందిన కస్టమర్లలో తెలియని విసుగు, చికాకు కనిపిస్తోందనేది ఆమె భావన. ముఖ్యంగా చార్టర్‌ బ్రోకర్లను, ఆపరేటర్లను కలిసినప్పుడు ఇది మరీ స్పష్టంగా తెలుస్తుందని చెప్తారు. ప్రైవేట్‌ జెట్‌ కావాలనుకున్న కస్టమర్‌ సంబంధిత బ్రోకరునో, ఎయిర్‌ క్రాఫ్ట్ ఆపరేటర్‌నో కలవాలి. బ్రోకర్లు సూచించే చార్టర్ల విషయానికొస్తే వారికి కమిషన్‌ ఎక్కువగా వచ్చే వాటినే వారు చెబుతుంటారు. కస్టమర్‌ అవసరాల కన్నా వారి కొచ్చే కమిషన్‌ ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తుంటారు బ్రోకర్లు. పారదర్శకత లోపించడం, చార్టర్లు అందుబాటులో లేకపోవడంతో కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి సమస్యల నేపథ్యంలో ప్రొఫెనల్‌ చార్టర్‌ సర్వీస్‌ను అందించే సంస్థలు, పారద్శర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలు వస్తే బాగుంటుందన్న ఆలోచన వారికి ఉంది. భారత్‌లో ఏవియేషన్‌ రంగం ఇంకా పూర్తిగా అభివృద్ధి సాధించలేదు. బోకర్లకు లాభం చేకూర్చే చార్టర్లనే వినియోగదారులకు సూచిస్తుండటం గమనార్హం. దీనికి చెక్‌ పెట్టేందుకే మేము జెట్‌సెట్‌గోను తీసుకువచ్చేందుకు కృషి చేశాము. జెట్‌సెట్‌గో అందరికీ అందుబాటులో ఉందని టెక్రీ చెప్పారు.

image


చార్టర్‌ పైలెట్స్ ఆన్‌లైన్‌

జెట్‌సెట్‌గో ప్రారంభించిన తర్వాత సుమారు 18 నుంచి 20 నెలల పాటు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా వాటిని అధిగమించాము. ప్రైవేట్‌ జెట్‌, హెలికాఫ్టర్‌ చార్టర్లను భారతదేశంలో మొట్టమొదటి ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ప్రవేశపెట్టింది మా సంస్థే అని కనిక టెక్రీ గర్వంగా చెప్పారు. జెట్‌సెట్‌గో ప్రారంభానికి ముందు ప్రణాళికలు అంతా సిద్ధం చేసుకుని రంగంలోకి దిగుదామనుకున్న సమయంలోనే నేను కేన్సర్‌ బారిన పడ్డాను. దీంతో కొంత ఆలస్యం జరిగింది. అదృష్టవశాత్తు మేము ప్రవేశపెడదామనున్న జెట్‌సెట్‌గో విధానాన్ని దేశంలో మరెవరు ప్రారంభించలేదు. జెట్‌సెట్‌గో అనేది ఇంటరాక్టివ్‌ టెక్నాలజీతో నడిచేది. దేశ… వ్యాప్తంగా దీని సేవలు అందుబాటులో ఉంటాయి. భారత్‌కు చెందిన 80 శాతం ప్రైవేట్‌ జెట్‌‌ల తమ సంస్థలో ఉన్నాయని టెక్రీ వివరించారు.