సరైన పత్రాలు లేకున్నాహోమ్‌లోన్స్ ఇచ్చే శుభం

సరైన డాక్యుమెంట్స్ లేకున్నా హోమ్‌లోన్స్ ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న శుభంస్థానమార్పే అసలు సమస్య అంటున్న కంపెనీఆస్తి కొనుగోలు చేయడంపై సలహాలు, సూచనలే కాదు రుణాలు కూడా మంజూరుతిరిగి చెల్లించలేకపోతే సరైన ధరకు విక్రయించేలా సహకారం

సరైన పత్రాలు లేకున్నాహోమ్‌లోన్స్ ఇచ్చే శుభం

Monday June 08, 2015,

3 min Read

మన దేశంతోపాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లన్నిటిలో అర్బన్ ప్రాంతాలు ఎదుర్కునే సమస్య వలసలే. అంతో ఇంతో మెరుగైన జీవితం లభిస్తుందని ఉన్న ఊరి నుంచి తట్టాబుట్ట సర్దుకుని గ్రామాలనుంచి అనేకమంది వచ్చేస్తున్నారు. ఇలా ఉన్నట్లుండి నివాస ప్రాంతం ఒక్కసారిగా మారిపోవడంతో వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ ఉండవు. ఇలా వలసలు విపరీతంగా పెరిగిపోవడంతో కనీస సౌకర్యాలు, వసతులు కూడా లభించే పరిస్థితి కనిపించడం లేదంటారు అజయ్ ఓక్. ఈయన హౌజింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ 'శుభం' సహవ్యవస్థాపకుడు, సీఓఓ కూడా. 

“మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వంటి పట్టణ సంస్థలు దగ్గర అవసరానికంటే తక్కువగానే నిధులుంటున్నాయి. దీంతో నీరు వంటి కనీస సౌకర్యాలకు తప్ప ఇతర అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉండడం లేదు. ప్రధానంగా తక్కువ ధరకో, అందుబాటు ధరలోనో ఇల్లు కట్టుకోగలిగే అవకాశం కల్పించడంలో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. వీరంతా అసంఘటిత రంగంలో పని చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నవారే కావడంతో... రుణ సదుపాయాలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇంటి నిర్మాణం అనే మాట కూడా దరి చేరకుండా జీవితాలు గడిపేస్తున్నారు చాలా మంది” అంటున్నారు అజయ్.

తాజాగా సి-సిరీస్ ఫండింగ్‌తో బిజినెస్ కాల్ టు యాక్షన్‌లో జాయిన్ అయింది శుభం. BCtA అనేది కంపెనీలు సవాళ్లు అధిగమించి అభివృద్ధిలో పాలు పంచుకుని, తద్వారా విజయవంతమయ్యేందుకు సహకరిస్తుంది. అంతర్జాతీయంగా తమ నెట్వర్క్ పెంచుకోవాలని భావిస్తోన్న శుభంకి.. BCtA ఒప్పందం చాలా కీలకమని చెప్పాలి. అనధికారిక, క్రమమైన ఆదాయం లేని వారికి హౌజింగ్ లోన్లు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించింది శుభం. తాజా ఒప్పందం ఈ బాధ్యతను మరింతగా పెంచింది.

అనధికారికం అయితే అప్పులెలా ?

ఆదాయం సరిగా లేకపోవడం కంటే... అసలు సమస్య వారిపై ముద్ర వేసేయడమే అంటారు అజయ్. చాలామందికి తాము సుదీర్ఘకాలం నిలకడగా కట్టగలమనే నమ్మకం ఉండడం లేదు. సాధారణంగా బ్యాంకులు అందించే రుణ సౌకర్యాలు వీరికి అందవు. ముఖ్యంగా గృహరుణాల విషయంలో అసలు ఛాన్సే లేదు. మన దేశంలో ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేవారి సంఖ్య ఐదు శాతం లోపే. అలాగే 55 శాతం మంది ప్రజలకు తమ ఆదాయ సామర్ధ్యాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి పత్రాలు చూపలేని పరిస్థితి. దీంతో అధికారికంగా బ్యాంకుల నుంచో, ఆర్థిక సంస్థల నుంచో రుణాలు తీసుకోలేకపోతున్నారు. వీరంతా ఎక్కువ వడ్డీలకు బయట రుణాలను సేకరించుకోవాల్సి వస్తోంది. ఇవన్నీ స్వల్పకాలిక రుణాలే కావడంతో వాటిని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఈ బాధలన్నిటి కారణం సెటిల్‌మెంట్లకో, అనధికారిక అమ్మకాలకో పాల్పడి.. విపరీతంగా నష్టపోతున్నారు వీరంతా.

image


రుణాలు ఇచ్చేందుకు అర్హతలేంటి ?

రుణం ఇచ్చేందుకు ముందు ఆయా కుటుంబాలతో భేటీ అవుతారు శుభం ప్రతినిధులు. వారు రెండు అంశాలను కీలకంగా వారితో చర్చిస్తారు. కొనాలని అనుకుంటున్న ఆస్తి నిజంగా వారికి అవసరమేనా ? ప్రస్తుతం వాళ్లు ఆ ఖర్చును భరించగలిగేలా ఉన్నారా ? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారు పని చేసే ప్రాంతం నుంచి ఆ ప్రాపర్టీ ఉన్న ప్రాంతానికి దూరం, సంపాదన సామర్ధ్యం, స్కూల్ - హాస్పిటల్ వంటి ప్రాంతాలకు ఉన్న దూరం వంటివాటిపై కుటుంబ సభ్యులందరూ ఆలోచించుకునేందుకు సమయం ఇస్తారు. వారి ఆదాయ వనరులు, నెలవారీ పొదుపు, ఒకేసారి పెట్టుబడి గల సామర్ధ్యం, దీర్ఘకాలిక రుణాలపై నెలసరి వాయిదాలు చెల్లించే సత్తా... వంటివాటిని అంచనా వేసి... వారు సరైన సమయంలో సరైన ఆస్తిని కొనుగోలు చేస్తున్నారో లేదో తెలుసుకుని, అనంతరం రుణమంజూరు చేస్తుంది శుభం.

ఓ రుణగ్రహీత కుటుంబం

ఓ రుణగ్రహీత కుటుంబం


రీపేమెంట్ చేయకపోతే !

ఏ ఫైనాన్స్ కంపెనీకి అయినా.. ఈ పరిస్థితి తప్పదు. కొంతమంది కస్టమర్లు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించలేకపోవడం సహజమే. ఆదాయ మార్గాలు తగ్గిపోవడం, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో రుణ చెల్లింపులు నిలిపివేస్తుంటారు. అయితే మేం సుదీర్ఘ కాలం వారితో రిలేషన్ ఉండాలని భావిస్తామంటారు. అందుకే వారి ఆదాయ మార్గాలు పెరిగేందుకు వీలైన సూచనలు చేయడమో లేకపోతే... ఆ ప్రాపర్టీని సరైన ధరకు విక్రయించేందుకు సహకరిస్తామని చెబ్తున్నారు శుభం ప్రతినిధులు. చాలా రుణాల విషయంలో సగానికి పైగా చెల్లించాక ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సందర్భంలో సరైన ధరకు విక్రయించే ఏర్పాటు చేయడంతో రుణం తీసుకున్న వారు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి.


image


భవిష్యత్ ప్రాజెక్టులు, సవాళ్లు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 78 నగరాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ... దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది . 2018నాటికి కనీసం 50వేల మందికి సొంతిల్లు అందించాలని భావిస్తున్నారు. బీహార్, ఛత్తీస్‌ఘడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహరాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సేవలందిస్తోంది శుభం. తామందిస్తున్న రుణాలపై కస్టమర్లు చాలా సంతోషంగా ఉన్నారని... త్వరలో వ్యవస్థాగతంగా కంపెనీని మార్చబోతున్నామని అంటున్నారు అజయ్ ఓక్.

శుభం అందిస్తున్న రుణాలు, వారు హ్యాండిల్ చేస్తున్న పరిస్థితులపై మరిన్ని వివరాలకు... www.shubham.co వెబ్‌సైట్‌ను దర్శించండి.

ఇమేజ్ క్రెడిట్స్: Shubham.co