మీరు ఆంట్రప్రెన్యూర్లా..? అయితే ఈ మాటలు మీ కోసమే..

Tuesday March 01, 2016,

2 min Read


ఒక్కో ఆంట్ర‌పెన్యూర్ ది ఒక్కో విజ‌య గాథ‌! వారి అనుభవాలు మరొక‌రికి పాఠాలు! ఫిబ్ర‌వ‌రి 21-27 మ‌ధ్య‌ మేం ప్ర‌చురించిన క‌థ‌నాల్లో నుంచి ఆంట్రప్రెన్యూర్స్ ఫేమ‌స్ కోట్స్ ని స్టోరీ బైట్స్ పేరిట అందిస్తున్నాం. ఇదొక వీక్లీ ఫీచ‌ర్! ఈ వారం ఇస్తున్న క‌త్తి లాంటి కోట్స్ ని మీ కొలీగ్స్ తో షేర్ చేసుకోండి!

స్టార్ట‌ప్ న‌డ‌ప‌డం అంత ఈజీ కాదు. ముఖ్యంగా టైర్-2 సిటీల్లో మ‌హా క‌ష్టం- అభిషేక్ భ‌ట్, షాపిట్ డైలీ

సాఫ్ట్ వేర్ స‌ర్వీస్ కంపెనీకి క‌స్ట‌మ‌ర్లు కావాలంటే రిఫ‌రెన్సులే ప్ర‌ధాన మార్గం- అవ్లేష్ సింగ్, వెబ్ఎంగేజ్

లింగ వివ‌క్ష‌ను ప్రోత్స‌హించే సామాజిక క‌ట్టుబాట్ల‌ను బ‌ద్ద‌లు కొడ‌తాను. మ‌హిళ‌లు సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా చేస్తాను- వైశాలి స‌ర్వాంక‌ర్, బంగే ఇండియా

చిన్న‌గా తోస్తేనే ముందుకెళ్లిపోతామా? అది అసాధ్యం!- అతుల్ స‌తిజా, ది న‌డ్జ్

ఆంట్ర‌ప్రెన్యూర్ షిప్ అప్పుడ‌ప్పుడూ కాస్త అస‌హ‌నానికి గురి చేస్తుంది. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌క త‌ప్ప‌దు- త‌రుషా మిట్ట‌ల్, కూంక్

డిజైన్ టు ఇన్ స్పైర్ అన్న‌దే నా విజయ సూత్రం. మీరు చేసే ప‌ని మీ వ్య‌క్తిత్వానికి అద్దం పట్టాలి- నేహా మూర్తి, ప‌చ్చీసీ

మీరు అందించే వ‌స్తువు జ‌స్ట్ బాగుంటే స‌రిపోతుందా? టాప్ క్వాలిటీతో త‌యారు చేస్తారా? ఆలోచించుకోండి- పెటె లా, వ‌న్ ప్ల‌స్

ముందు మీ ఐడియాను జ‌నం ముందు ఉంచండి. ఆ త‌ర్వాతే కార్యాచ‌ర‌ణ‌లోకి దిగండి- అనూజా జోషి, గౌర‌భ్ మాథురే

మీ కాన్సెప్టు విని జ‌నం న‌వ్వుకోవ‌చ్చు. అంత‌మాత్రానికే భ‌య‌ప‌డిపోకండి- అనౌషెష్ అన్సారీ, ఎక్స్-ప్రైజ్

అమెజాన్ ను వెన‌క్కి నెట్టడానికి అలీ బాబా లోక‌ల్ కంపెనీల‌తో జ‌ట్టు క‌ట్టినా ఆశ్చ‌ర్యం లేదు- కె.వైదీశ్వ‌ర‌న్, ఇండియాప్లాజా

ప్ర‌స్తుతం ఇండియాలో నాన్-బ్రోకరేజీ మార్కెట్ విలువ అక్ష‌రాలా 6.5 బిలియ‌న్ డాల‌ర్లు- అమిత్ కుమార్ అగ‌ర్వాల్, నోబ్రోక‌ర్ డాట్ కామ్

ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో చేసే ప్ర‌తీ ప‌ని ప్ర‌భావం బిజినెస్ మీద ఉంటుంది. ఆ రెండింటి మ‌ధ్య అడ్డుగోడ‌లు ఉండవు. కాబ‌ట్టి నెవ‌ర్ స్విచాఫ్- స‌చిన్ బ‌న్స‌ల్, ఫ్లిప్ కార్ట్

ప‌నిని, ప‌ర్స‌న‌ల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయ‌డం అర్రిబుర్రి య‌వ్వారం కాదు. అమ్మా.. న‌న్ను వ‌దిలి వెళ్లొద్ద‌మ్మా అని నా కొడుకు ఏడ్చిన‌ప్పుడ‌ల్లా నా గుండె బద్దలవుతుంది- అదితి జుస్సావాలా, మ‌ద‌ర్ హెన్

కాళీమాత‌ను ఆద‌ర్శంగా తీసుకోండి. జీవితంలో గెల‌వండి- చీలు చంద్ర‌న‌న్, డీ బాక్స్

ఆసియా దేశాల్లో మ‌హిళా కార్మికుల విష‌యానికొస్తే, ఇండియా క‌న్నా శ్రీలంక బెట‌ర్- సౌంద‌ర్యా రాజేశ్, అవ‌తార్ ఐ-విన్

వి ఆర్ స్ట్రాంగ్! కానీ ఇప్ప‌టికీ ప్ర‌మాద‌పు అంచునే ఉన్నాం. ద‌ట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ విమెన్- ప్రియా వ‌ర‌ద‌రాజ‌న్, దుర్గా

శ్ర‌మిస్తేనే క‌ల ల‌క్ష్యంగా మారుతుంది- అంకితా ష్రాఫ్, ఎస్ఏవీ కెమిక‌ల్స్

అంద‌రూ చేస్తున్నారు క‌దా అని గుడ్డిగా అదే పని చేయ‌కండి. ప‌నిని ప్రేమించండి. అది కూడా మిమ్మ‌ల్ని ప్రేమిస్తుంది- ప‌ర‌మ ఘోష్‌, ప‌ర‌మ‌

అన్నింటిక‌న్నా మాన‌వ చైత‌న్య‌మే గొప్ప‌ది- గిరీష్ గోజియా, మిష‌న్ పాజిటివ్ ఎర్త్

ఆంట్ర‌ప్రెన్యూర్ల‌కు స్పూర్తినిచ్చే సూక్తులు, కోట్స్ తో యువ‌ర్ స్టోరీ ఒక పాకెట్ బుక్ ని ప్ర‌చురించింది. యాపిల్, ఆండ్రాయిడ్ లో ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.