ఫండింగ్ కి సిద్ధమవుతున్న SLP స్టార్టప్స్

ఫండింగ్ కి సిద్ధమవుతున్న SLP స్టార్టప్స్

Tuesday March 08, 2016,

2 min Read


హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలకు అండగా నిలుస్తోన్న ఎస్ఎల్పీ మరో ముందడుగు వేసింది. ఇటీవలే తమ ప్రొగ్రాం ద్వారా సెలెక్ట్ చేసిన స్టార్టప్ లపై ఏంజిల్ ఇన్వస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్ఎల్పీ లీడ్ సుబ్బరాజు ప్రకటించారు. ఈ ఏడాది మొదటి బ్యాచ్ స్టార్టప్స్ పెర్ఫామెన్స్ పెరగడం ఆనందంగా ఉందని అన్నారాయన.

“15 స్టార్టప్ కంపెనీలను షార్ట్ లిస్ట్ చేశాం, అందులో ఆరింటిపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు,” సుబ్బరాజు

ఎస్ఎల్పీ(SLP) గురించి

స్టార్టప్ లీడర్షిప్ ప్రొగ్రాం. అదే ఎస్ఎల్పీ. స్టార్టప్ ఈకో సిస్టమ్ కు మద్దతివ్వడం దీని ముఖ్య ఉద్దేశం. బోస్టన్ కేంద్రంగా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ఇండియాలోని ఆరు నగరాల్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అందులో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండం విశేషం. ఇప్పటి వరకూ 200 స్టార్టప్ కంపెనీలు ఈ కార్యక్రమంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కనెక్ట్ అయి ఉన్నాయి.

“హైదరాబాద్ స్టార్టప్ లీడర్షిప్ కార్యక్రమం మనదేశంలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తోంది. స్థానికంగా ఉన్న స్టార్టప్ ల మద్దతుతోనే ఇది సాధ్యమైంది” సుబ్బరాజు
image


ఎస్ఎల్పీ అందించే సేవలిలా ఉన్నాయి. 

1. స్టార్టప్ సొల్యూషన్ గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వడం

2. ఫౌండర్లకు లీడర్షిప్, కమ్యూనికేషన్ ట్రెయినింగ్ అందించడం

3. స్టార్టప్ సెల్ఫ్ సస్టెయినబుల్ మొడల్ ని గుర్తించేలా చేయడం

4. మార్కెట్ వాల్యూమ్ తెలుసుకొని ప్రమోషనల్ ప్లాన్స్ ఇవ్వడం

5. ఏంజిల్ ఇన్వెస్టర్లకు స్టార్టప్స్ పరిచయం చేయడం

6. యాక్సిలరేట్ ప్రోగ్రాం అవసరం అనుకుంటే రిఫర్ చేయడం

7. ఒక ఐడియాను స్టార్టప్ గా ఎలా మెటిరియలైజ్ చేయాలనే దానిపై సలహాలివ్వడం..

దానికి తగిన ట్రెయినింగ్ అందించడం

ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన స్టార్టప్స్ 

విచ్ ప్లీజ్, ఎక్స్ క్లూజివ్ మాగ్నేషియం, పేస్ హాస్పిటల్, క్లీన్స్ హై, హెల్త్ సూత్ర, వీడెలివర్. అయితే వీటిలో ఫండింగ్ ఏఏ కంపెనీలకు వస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది.

విచ్ ప్లీజ్ అనేది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న శాండ్విచ్ ఫుడ్ స్టార్టప్. ప్రారంభించి దాదాపు రెండేళ్లవుతోంది. ఆన్ లైన్ తోపాటు ఆఫ్ లైన్ స్టోర్లతో అది దూసుకుపోతోంది.

విచ్ ప్లీజ్ స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విడెలివర్ అనేది కూడా స్థానికంగా ఉంటూ లాజిస్టిక్ డొమైన్లో నాలుగేళ్లు పూర్తి చేసింది.

విడెలివర్ స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిగిలిన స్టార్టప్స్ ప్రారంభమై దాదాపు 6 నెలులు కావొస్తోంది. డొమైన్లలోనూ మెరుగైన ఫలితాలతో రాణిస్తున్నాయి.

సుబ్బరాజు, హైదరాబాద్ హెడ్,SLP

సుబ్బరాజు, హైదరాబాద్ హెడ్,SLP


ఫండింగ్ మాత్రమే ఛాలెంజ్ కాదు

ఫండింగ్ కోసమే స్టార్టప్ ప్రారంభించకూడదని, ఫండింగ్ అవసరం లేకుండా సస్టేయిన్ కావడమే స్టార్టప్ సక్సెస్ అని సుబ్బరాజు అభిప్రాయపడ్డారు. ఫండింగ్ కూడా వస్తే మరింత బెటరని అన్నారాయ. హైదరాబాద్ స్టార్టప్స్ గతేడాది నుంచి ఫండింగ్ లో తమదైన ముద్ర వేస్తున్నాయని, ఈ ఏడాది మరిన్ని స్టార్టప్ లు ఫండ్ రెయిజ్ చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐడియాలను సక్సెస్ ఫుల్ స్టార్టప్ లుగా మార్చండి ఆ తర్వాత ఫండింగ్ కోసం ఆలోచించాలని ముగించారు సుబ్బరాజు