స్టేజ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ - పూజా సంపత్

స్టేజ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్  - పూజా సంపత్

Wednesday August 26, 2015,

4 min Read

ఫోన్ రింగవుతోంది. ఎవరో మహిళ సెంటర్ స్టేజ్ ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు పూజ " అది నేనే " అని సమాధానం చెప్పింది. అలా చెప్పగానే అడిగిన ఆ మహిళ "జోకులాపి ఆ ప్రొడ్యూసర్‌ను పిలువు" అంది.

ఇలాంటి సరదా పేజీలు పూజ జీవితంలో చాలా ఉన్నాయి. ఫ్రెష్ కాలేజీ గాళ్‌లా కనిపించే పూజ ఓ మీడియా సంస్థకు ప్రొడ్యూసర్ అంటే ఎవ్వరైనా నమ్మడం చాల కష్టం. " నాకు ఎలా రియాక్ట్ కావాలో తెలిసేది కాదు. అందుకే నేను ఎలాంటి రియాక్షన్ లేకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను. కానీ పరిస్థితులు ఇప్పుడు మారాయి " అంటారు.

పూజ సంపత్ సెంటర్ స్జేజ్‌లో పార్టర్, ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరక్టర్‌తో పాటు యాక్టర్ కూడా. అంతే కాదు సెంటర్ స్టేజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంప్రూవ్ IMPROV అనే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. 2012లో పోస్ట్ గ్రాడ్యూషన్ సమయంలో యాక్టింగ్ విద్యార్థిగా సెంటర్ స్టేజ్‌లో చేరింది పూజ. వెంటనే అదే కంపెనీలో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. కొద్ది సంవత్సరాల్లోనే ఆ కంపెనీలో సహచరిగా చేరి.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎదిగింది. చివరకు అందులో భాగస్వామి అయ్యింది.

image


తన పని తీరు గురించి చెబుతూ " నేను గత మూడేళ్లలో స్క్రిప్టులు రాయడమే కాదు కొన్ని ప్రకటనలకు, వైరల్ వీడియోలకు దర్శకత్వం కూడా వహించాను. కాస్టింగ్ డైరక్టర్‌గా వ్యవహరించడమే కాదు శిక్షణ పొందిన నటిని కూడా. తగిన పాత్రలు లభించినప్పుడు అలాంటి వాటిలో నేను నటించడం మాత్రమే కాదు క్లైంట్లతో చర్చల్లో పాల్గొనేదాన్ని అవసరమైతే వారికి సూచనలు కూడా చేసేదాన్ని "

నటిగా ఎలా మారిందంటే...?

పూజకు మొదట్లో నటించడం అంటే చాలా ఇష్టం. బెంగళూరులోనే పుట్టి పెరిగిన పూజ.. సోఫియా హైస్కూల్లోనూ, మౌంట్ కెర్మెల్ కాలేజీలోనూ చదువుకుంది. కట్టుబాట్ల మధ్యే పెరిగినా .. కొత్త విషయాల పట్ల తనకుండే ఆసక్తికి మంచి ప్రోత్సాహం లభించేది.

దేనికి నో చెప్పడం తెలీదు. నాట్యం, పాటలు పాడటం, స్విమ్మింగ్ , స్కేటింగ్, నటనలో శిక్షణ, గోకార్ట్ ఛాంపియన్ షిప్ లో జిల్లా స్థాయి శిక్షణ, సంగీత వాద్యాల్లో శిక్షణ, ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నని ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి పూజకు కూడా గుర్తులేవు.

ఈ చేంతాడంత లిస్టులో ఒక్కదానిపై మాత్రం చిన్నప్పటి నుంచే పూర్తిగా దృష్టి పెట్టింది. నటించడం పైనా , నాట్యం చెయ్యడం పైనా ప్రేమ పెంచుకుంది. తన మొట్ట మొదటి కమర్షియల్ యాడ్‌లో తన తనకెదురైన అనుభవాల్ని గురించి ఇలా చెబుతుంది.

" దక్షిణాదికి చెందిన ఓ వాటర్ హీటర్ ప్రకటన మొట్టమొదటిది. అప్పుడు నాకు 14 ఏళ్ల వయసు. ఆడిషన్ ద్వారా ఎంపికైన నేను వెంటనే కెమెరా ముందు నిల్చోవాల్సి వచ్చింది. అది నా జీవితంలోనే అత్యంత చెత్త ప్రదర్శన. అయితే ఆ అనుభవం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నేనుండటం నాకు చాలా సంతోషం కలిగించే విషయం. తెర వెనుక ఎలా ఉంటుందో మొట్టమొదటిసారి నాకు అర్థమయ్యింది. చాలా విషయాలు తెలియడమే కాదు ఫిల్మ్ మేకింగ్ పైనా, ప్రొడక్షన్ పైన చాలా ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. దానికి ఎవరు సమాధానాలు చెబుతారో తెలీదు. అందుకే అనుభవం ద్వారానే తెలుసుకోవాలనుకున్నాను ".

వేసవి సెలవుల్లో ఓ హ్యాండిక్యామ్ కొని.. తానే తన చిన్నాన్న పెద్దనాన్న పిల్లల సాయంతో స్క్రిప్టు తయారు చేసి వాటికి అనుగుణంగా దృశ్యాలను షూట్ చేసి తీసుకొచ్చి ఎడిటింగ్ చేసేది. తన ఇంట్లో వాళ్లకు, బంధువులకు , స్నేహితులకు వాటిని చూపించేది. " ఇవే ఆ తరువాత నా జీవితంపై ప్రభావం చూపిస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు" అంటారు పూజ.

మరిన్ని ఇష్టాలు

నటనపై ఆమెకున్న ప్రేమ అప్రతిహతంగా కొనసాగుతునే ఉంది. అలాగని కాలేజీలో కానీ, స్కూల్లో కానీ నటనను ఓ సబ్జెక్ట్ గా ఏం తీసుకోలేదు. సైకాలజీ, హిస్టరీ చదవాలనుకునేది. అంతే కాదు వాటితో పాటు థియేటర్ డ్రామా క్లబ్స్‌లో కూడా పాల్గొనేది.

మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్‌లో ఎంబీఏ చేసింది. " అన్ని విషయాల్లోనూ నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అనేక రంగాల్లో నన్ను నేను నిరూపించుకోగలిగాను " అంటారామె.

image


సెంటర్ స్టేజ్ ఇండియా

నలుగురిలోకి వచ్చేసరికి పూజ చాలా కామ్ అయిపోతుంది. అంతే కాదు సిగ్గు, బిడియం కూడా ఎక్కువే. అన్నింటినీ నిశితంగా గమనించే పూజ " నేనెప్పుడు తక్కువ మాట్లాడటం వల్లే ఎక్కువగా నేర్చుకుంటున్నాను " అంటుంది. కంపెనీ ప్రారంభంలోనే అందులో చేరిన పూజ దాని అభివృద్ధితో పాటే కొనసాగింది. 

" నటిగా నాపైన, నా ప్రదర్శనపైన నా కో ఫౌండర్లకు ఉన్న నమ్మకం వల్లే చాలా ప్రకటనల్లోనూ చిత్రాల్లోనూ పని చెయ్యగలిగాను. కేవలం నటించడం మాత్రమే కాదు రాయటం, దర్శకత్వం వహించడం కూడా చేసేదాన్ని. బిజినెస్ హెడ్ మరియు భాగస్వామి అయిన మాజ్ ఖాన్ బిజినెస్ విషయంలోనూ, ప్రొడక్షన్ విషయంలోనూ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు '' - పూజ.

ద ఇంప్రూవ్

ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నిల్చోని నవ్వేలా చెయ్యడం, వారిని ఎడ్యుకేట్ చెయ్యడం.. వాటి మధ్య తేడాను గుర్తించేలా చెయ్యడం పూజకు పెద్ద ఛాలెంజ్. వాటి మధ్య తేడా గురించి పూజ ఇలా చెబుతుంది." చాలా సార్లు కొన్ని సార్లు అవే జోక్స్‌ను వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రేక్షకుల దగ్గర రిపీట్ చెయ్యాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఆశువుగా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి స్క్రిప్టు లేకుండానే ప్రేక్షకుల్ని నవ్వించాలి. IMPROV లో ఎక్కువగా చేసేది అదే.

ఒక ప్రొడ్యూసర్‌గా కొత్త కొత్త ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించడం ఆమెకు ముఖ్యమైన సవాల్. ప్రతి సారీ పర్‌ఫార్మర్స్ ప్రదర్శనలను మెరుగులు దిద్దాలి. షో చూసిన ప్రేక్షకులు రాళ్లెయ్యకూడదు. ఎప్పుటికప్పుడు జరిగే తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తుంటారు.

సెంటర్ స్టేజ్ , ద ఇంప్రూవ్ సంస్థలతో పూజ ప్రయాణం సాగుతున్నంత కాలం ఎంత ఉన్నతంగా.. ఎంత అత్యుత్తమంగా ప్రదర్శనలివ్వాల అనే ఆలోచిస్తూ ఉండేది.

ప్రతి షో ముందు అటు క్రియేటివ్ ఇటు ప్రొడక్షన్ రెండు వైపుల నుంచి చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అత్యుత్తమ ప్రదర్శన చెయ్యడానికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తాం. అంతా చాలా స్మూత్ గా సాగిపోతుంది. IMPROV కు సంబంధించి మీరు ఇప్పుడు చూస్తున్నది నవ్వుల తుపాను ముందు ప్రశాంతతను మాత్రమే.

పనే దైవం

ప్రోగ్రాంకు సంబంధించిన విషయంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. మాటకు కట్టుబడి ఉండాలి. లేనిపోని హామీలివ్వకూడదు. అన్నింటికన్నా ముఖ్యం ఎదుటి వారి సమయానికి విలువనివ్వాలి. ముఖ్యంగా ఈ 3 వ్యాపార సూత్రాలను పూజ పాటిస్తుంది. ఎదుటి వారి సమయానికి గౌరవాన్నివ్వడం సెంటర్ స్టేజ్ తనకు మొట్ట మొదట్లోనే నేర్పింది.

పూజకి పనే దైవం. తను ఎంచుకున్న కెరీర్ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. నూటికి నూరు శాతం సంతోషంగా ఉంది. యధార్థంగా చెప్పాలంటే "సెలవు పెట్టాల్సిన అవసరమే లేని కెరీర్ నాది "అంటుంది పూజ.