పేరడీ కోసం చేసిన యాప్ పెట్టుబడులు తెస్తుందా ?

YO యాప్ కు పేరడీ చేసే ప్రయత్నంaiYo పేరుతో సిద్ధమైన ఇండియన్ యాప్డౌన్ లోడ్స్ పెరిగితే మరిన్ని ప్లాట్ ఫార్మ్ కు విస్తరించే యోచన

0

మనలోని ఆలోచనా శక్తి.. ఆసక్తి, అనూహ్యంగా మనల్ని సెలెబ్రిటీలను చేసేస్తుంటాయి. ఓఆర్ ఆర్బెల్ విషయంలో ఇదే రుజువైంది. ఈ 32 ఏళ్ళ యాప్ డెవలెపర్.. తన వ్యాపార భాగస్వామి మెసేజ్ ల కోసం ఆషామాషీగా ఓ యాప్ ని రూపొందించారు. అయితే అనూహ్యంగా.. ఈ యాప్.. అమెరికాలోని iOS యాప్ స్టోర్ లో నంబర్ వన్ గా నిలిచింది. దీని రూపకర్త అర్బెల్ తన యాప్ వల్ల తనకింత ఖ్యాతి వస్తుందని కలలోనైనా ఊహించలేదు. కానీ ఇది వాస్తవం. ఈయన వ్యాపార భాగస్వామి మోషె హోగె తన సహాయకులను ఫోన్ ద్వారా మాట్లాడకుండా.. సందేశాన్ని పంపే అవసరం లేకుండా.. ఒక యాప్ ని తయారు చేసి ఇవ్వమని ఆర్బెల్ ని కోరాడు. అదే వినూత్న ఆవిష్కరణకు హేతువైంది.

aiYO టీమ్
aiYO టీమ్

ఇప్పుడు మనకు YO ఇండియన్ వెర్షన్ వచ్చేసింది. బెంగళూరుకు చెందిన వెబ్, మొబైల్ అభివృద్ధి సంస్థ వావ్ ల్యాబ్జ్.. YO యాప్ కు భారతీయను అద్దుతూ.. aiYO యాప్ ను రూపొందించింది. aiYO, ఒక్క నోటిఫికేషన్ సౌండ్స్ లో తప్ప అన్నింటిలోనూ YO కు ధీటుగా ఉంటుంది. ఓ శనివారం రోజున, ఈ బృందంలోని సభ్యుల్లో ఒకరైన రోహిత్ వీరజప్ప ఆఫీసుకి వచ్చి, YO యాప్ గురించి ప్రస్తావించారు. అప్పుడే.. ఆ సభ్యులంతా.. దీనకి పేరడీ యాప్ ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. “ ఇది Yo యాప్ కి పేరడి. అసలు మేము “క్యాబే” లేదా “అబే ఓయ్”అని పేరు పెడదామనుకున్నాము. కానీ కొందరు aiYO పేరును ప్రతిపాదించారు. అది మా ప్రయత్నానికి కొంత అర్థవంతమైన పదం అనిపించింది” అని వావ్ ల్యాబ్జ్ వ్యవస్థాపకుడు అమిత్ సింగ్ చెబుతారు.


యాప్ స్క్రీన్ పేజ్
యాప్ స్క్రీన్ పేజ్

ఎనిమిది గంటల్లోనే యాప్..!

ఈ బృందం.. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే.. కేవలం ఎనిమిది గంట్లోనే aiYO యాప్ ని రూపొందించేశారు. ఈ యాప్ బృందం సభ్యుల్లోని అసహనాన్ని సమూలంగా నిర్మూలించేసింది.“వినియోగదారుడి యాప్ కి నిధులు సమీకరించేందుకు దేవుడా నానా అగచాట్లూ పడాలి” అంటారు అమిత్. ఈ పేరడీ విజయవంతానికి కారణాలను మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. ప్రజలు రోజువారీ జీవితంలో సంఘర్షణకు గురవుతుంటారు. వారికి పెట్టుబడిదారుడితో ముఖాముఖి అవకాశం రాదు. దీంతో యో యాప్ 1.2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకోగలిగింది. YO యాప్ ప్రస్తుత పరిస్థితిని, దానికి వచ్చే పెట్టుబడులు చూస్తే హాస్యాస్పదమనిపించక మానదు అంటారు రోహిత్.

వావ్ ల్యాబ్జ్ బృందపు aiYO యాప్ ఇదే సందేశాన్ని సమాజానికి మార్మోగిపోయేలా చెబుతోంది. సహజంగానే, మాకు మిలియన్ డాలర్ల నిధులు కావాలనీ ఎలుగెత్తుతోంది.

తర్వాత ఏంటి..?

“ఒకవేళ మేము పది వేలు లేదా అంతకుమించి డౌన్ లోడ్స్ పొందితే, iOS యాప్ ని ఒక్క రోజులోనే తయారు చేసేస్తాం అని అమిత్ ధీమాగా చెబుతారు. లక్ష డౌన్ లోడ్స్ వస్తే..? అని రోహిత్ ని ప్రశ్నించాను. లక్ష డౌన్ లోడ్స్ కి మేము ఎలాంటి ప్రణాళికలూ రూపొందించుకోలేదు. ఒకవేళ అన్నే డౌన్ లోడ్స్ వస్తే.. దాన్ని అనుసరించి మా వ్యాపార నమూనాను రూపొందించుకోవాల్సి ఉంటుంది. మేము ఇందులో కాస్త బలహీనంగా ఉన్నాము. కాబట్టి... మేము మా పాత బిజినెస్ నమూనాను పరిశీలించి, ఏదో కొంత పురోగతి దిశగా ఆలోచిస్తాము. అని బదిలిచ్చారు రోహిత్.

పదివేలు కావచ్చు లేదా లక్ష డౌన్ లోడ్స్ కావచ్చు.. త్వరలోనే తెలిసి పోతుంది. అదే సమయంలో, మీరూ గూగుల్ ప్లే స్టోర్ లో aiYO యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ స్నేహితులకు aiYO చెప్పేయవచ్చు.