ఇండియాలో స్టార్ట్ టీఎల్వీ కాంపిటిషన్.. మహిళా ఆంట్రప్రెన్యూర్లకు మంచి అవకాశం

ఇండియాలో స్టార్ట్ టీఎల్వీ కాంపిటిషన్.. మహిళా ఆంట్రప్రెన్యూర్లకు మంచి అవకాశం

Friday June 09, 2017,

3 min Read

భారత్ లో మహిళా ఆంట్రప్రెన్యూర్లకు ఇదొక చక్కటి అవకాశం. మహిళల ఆధ్వర్యంలో నడిచే టెక్ స్టార్టప్ ల కోసం ఇజ్రాయల్ కొన్నాళ్లుగా అన్వేషిస్తోంది. అందులో భాగంగా ప్రతి ఏడాది భారత్ లో స్టార్ట్ టీఎల్వీ పోటీ నిర్వహిస్తోంది. వరుసగా ఐదో సారి కూడా ఇండియాలో కాంపిటీషన్ మొదలైంది. టెక్ ఇన్నోవేషన్స్ లో మహిళల పాత్రను పెంచడమే లక్ష్యంగా స్టార్ట్ టీఎల్వీ పోటీ జరగబోతోంది.

గత ఏడాది నిర్వహించిన పోటీ గ్రాండ్ సక్సెస్ అయింది. అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా స్టార్ట్ టీఎల్వీ ఫిఫ్త్ ఎడిషన్ భారత్ ముందుకొచ్చింది. ఇందులో ప్రధానంగా మహిళల నాయకత్వంలో నడిచే టెక్ స్టార్టప్ లపై ప్రధానంగా దృష్టి పెట్టారు. భారత్, ఇజ్రాయల్ పాతికేళ్ల అనుబంధానికి ఈ పోటీ ప్రతీకగా నిలవబోతోంది. ఇజ్రాయల్ విదేశాంగ శాఖ, టెల్ అవివ్ నగరం సంయుక్తంగా ఏటా స్టార్ట్ టీఎల్వీ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాయి. 23 దేశాల నుంచి ఎంపికైన టెక్ స్టార్టప్ ఫైనలిస్టులు.. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఇజ్రాయల్ లోని టెల్ అవివ్ లో సమావేశం అవుతారు. అక్కడ డీఎల్డీ ఎన్నోవేషన్ ఫెస్టివల్ తో కలిసి ఐదు రోజుల పాటు స్టార్టప్ బూస్ట్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. పోటీలో గెలిచిన స్టార్టప్ లు ఇజ్రాయెలీ ఆంట్రప్రెన్యూర్లతో కలిసి వర్క్ షాపులు, మీటింగులు నిర్వహిస్తారు. ఇందులో ఇజ్రాయెల్ కు చెందిన ప్రముఖ కంపెనీలతోపాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, నిపుణులు పాల్గొంటారు.

image


ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ అద్భుతంగా అభివృద్ధి చెందడంపై ఇజ్రాయెల్ అంబాసిడర్ డేనియల్ కార్మోన్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ ఈకో సిస్టమ్ ఇజ్రాయెల్ కు దగ్గరగా ఉంటుందని చెప్పారు. రెండు దేశాల బంధం బలోపేతం కావడానికి ఇదొక సువర్ణ అవకాశమని అభివర్ణించారు. ఇన్నోవేషన్ రంగంలో ఉభయ దేశాల ఉమ్మడి శక్తి.. మన సమాజాలను, ఆర్థిక వ్యవస్థలను మరింత మెరుగైన మార్గంలో నడిపిస్తాయని ఆకాంక్షించారు. ప్రపంచం మీద ఒక సానుకూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. అటు ఇన్నోవేషన్ రంగంలో అతివల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని రెండు దేశాల స్టార్టప్ ఈకో సిస్టమ్స్ బలంగా నిలదొక్కుకోవాలని డేనియల్ కార్మోన్ ఆకాంక్షించారు.

పోటీ వివరాలు:

ఇండియాలో స్టార్ట్ టీఎల్వీ కాంపిటీషన్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఎంట్రీలకు జూలై 7 చివరి తేదీ. ఐదుగురు ఫైనలిస్టులను జూలై 24న ఢిల్లీకి ఆహ్వానిస్తారు. వీళ్లు అక్కడ తమ స్టార్టప్ ల టెక్నాలజీ, అవి సమాజం మీద చూపిస్తున్న ప్రభావం గురించి నిపుణులు బృందానికి వివరించాల్సి ఉంటుంది. అందులో ఒకరిని నిపుణుల బృందం విజేతగా ఎంపిక చేస్తుంది.

స్టార్ట్ టీఎల్వీ ఇండియా కాంపిటీషన్, అప్లికేషన్ ఫారం వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

మహిళల ఆధ్వర్యంలో పనిచేస్తున్న అప్ కమింగ్ స్టార్టప్ ల కోసం ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అన్వేషిస్తోంది. ఇందుకోసం భారత ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం, టై ఎన్సీఆర్, యస్ బ్యాంక్, యస్ బ్యాంక్ గ్లోబల్ ఇన్ స్టిట్యూట్ తో ఇజ్రాయల్ ఎంబసీ టైఅప్ అయింది. స్టార్ట్ టీఎల్వీ అనేది- ఇజ్రాయల్ లో అతిపెద్ద అంతర్జాతీయ హై టెక్ కాంపిటీషన్. ఇందులో రకరకాల స్టార్టప్ లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లు, ఇన్నోవేటర్లు పాల్గొంటారు.

image


స్టార్టప్ నేషన్

ఇజ్రాయెల్ చిన్న దేశమే కావొచ్చు. 69 ఏళ్ల కిందట పుట్టిన కంట్రీనే అయ్యుండొచ్చు. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు టెక్నాలజీ, ఇన్నోవేషన్ కు గ్లోబల్ హబ్. ఆర్ట్ అండ్ కల్చర్ లోనూ తనదైన ముద్ర వేసింది. స్టార్టప్ ల ఏర్పాటులో అమెరికా తర్వాతి స్థానం ఆ దేశానిదే. అంతేకాదు, అమెరికాతో పోలిస్తే రెండింతల వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంటును ఆకర్షించి రికార్డు సృష్టించింది. ఈ మొత్తం యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు సమకూర్చుకున్న దాని కంటే 30 రెట్లు అధికం కావడం విశేషం. ప్రపంచంలోనే అత్యధికంగా (3.9 శాతం) ఆర్అండ్ డీపై ఖర్చు పెట్టింది కూడా ఇజ్రాయలే. ఇకపోతే టెల్ అవివ్ నగరం ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని. అంతకుమించి అది ఇన్నోవేషన్ హబ్. ప్రపంచ శ్రేణి టెక్ ఈకో సిస్టమ్స్ కు ఆ నగరం నెలవు. డజన్ల కొద్దీ మల్టీనేషనల్ దిగ్గజాలు, వందలాది స్టార్ టెక్ స్టార్టప్ లు ఇక్కడున్నాయి.

ఇండియాలో గత విజేతలు:

తక్కువ ధరకే వైద్యం అందిస్తున్న అడ్వెనియో కంపెనీ నుంచి మౌసమీ ఆచార్య, ఆన్ లైన్ పేటెంట్ సెర్చ్ అండ్ అనాలిసిస్ సేవల దిగ్గజం ఎక్స్ఎల్పీఏటీ ల్యాబ్స్ కు చెందిన కోమల్ తల్వార్ గత ఏడాది స్టార్ట్ టీఎల్వీ పోటీలో విజేతలుగా నిలిచారు. ఈ ఇద్దరు మహిళలు తమ కంపెనీలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇక 2013లో స్టార్ట్ టీఎల్వీకి భారత్ తరఫున నవ్ ఫ్లోట్స్ కంపెనీ ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీ ద్వారా ఎంతో మందితో శాశ్వతమైన అనుబంధం, మిత్రుత్వం ఏర్పడిందని నవ్ ఫ్లోట్స్ కో ఫౌండర్ రోనక్ కుమార్ సమంత్రే చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ఇజ్రాయల్ ఎంబసీకి కృతజ్ఞతలు తెలిపారు.

image


2014లో షీల్డ్ స్క్వేర్ స్టార్టప్ కు చెందిన పవన్ తాతా భారత్ నుంచి విన్నర్. టెల్ అవివ్ లో జరిగిన స్టార్టప్ మీట్ లో పాల్గొనడం ఒక గొప్ప అనుభవమని ఆయన గుర్తు చేసుకున్నారు. వన్ టు వన్ ఇంటరాక్షన్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. టెల్ అవీవ్ ఈవెంట్ తప్పనిసరిగా హాజరు కావాల్సిన కార్యక్రమమన్నారు.

ఇకపోతే గౌతమ్ షెవక్రమణి! స్మార్ట్ ఫోన్లను పర్సనల్ టూర్ గైడ్లుగా మార్చిన ఆడియో కంపాస్ కంపెనీకి ఫౌండర్ కమ్ సీఈవో. 2015 స్టార్ట్ టీఎల్వీ కాంపిటీషన్ విన్నర్ ఈయనే. ఈ పోటీలో గెలవడం వల్లే తమ కంపెనీ ప్రపంచానికి పరిచయమైందంటారు గౌతమ్. అంతేకాదు, వివిధ మార్కెట్ల నుంచి ఐడియాలు, అనుభవాలు పంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. అన్నింటికీ మించి ఇజ్రాయెల్ కంపెనీలతో కలిసి పనిచేసే అద్భుత అవకాశం లభించినందుకు గౌతమ్ సంతోషంగా ఉన్నారు.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి (జూలై 7లోగా అప్లయ్ చేసుకోండి