ఇంటి దగ్గర సేఫ్ గా దింపుతామంటున్న మిషన్ స్మార్ట్ రైడ్ !!

ఇంటి దగ్గర సేఫ్ గా దింపుతామంటున్న మిషన్ స్మార్ట్  రైడ్ !!

Friday January 01, 2016,

2 min Read

న్యూ ఇయర్ పార్టీ అయిన తర్వాత వేల సంఖ్యలో కార్లు పార్టీ వేదికల నుంచి ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల యాక్సిడెంట్లు జరిగాయి. ఈ అపాయాలకు కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమేనా? పార్టీలో డ్రింక్ చేశాక మన ఇంటిదాకా డ్రైవ్ మనమే చేసుకోవాలి కదా? ఇంకెవరు చేస్తారు? అందులో తప్పేముంది. అయితే మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. అలాంటి అవసరం లేకుండా మిమ్మల్ని ఇంటి దగ్గర సేఫ్ గా దింపడానికి ఈ స్మార్ట్ రైడ్ ఉపయోగపడుతుంది.

“నా జీవితంలో కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన తో ఈ ఆలోచన వచ్చింది,” ఫౌండర్ నంద సంధ్యాల

మిషన్ స్మార్ట్ రైడ్ ఫౌండర్ అయిన నంద సంధ్యాల కొన్ని నెలల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో రియలైజ్ అయిన సమస్య నుంచి ఈ సొల్యూషన్ కనిపెట్టారు.

image


హోటల్, బార్లతో అనుసంధానం

ఈ మిషన్ స్రార్ట్ రైడ్ దేశంలోనే మొట్టమొదటి సారి హైదరాబాద్ లో ప్రారంభించామని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి హటళ్లు, బార్ లు, రెస్టారెంట్ లతో అనుసంధానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తోపాటు ఎన్జీఓ లతో కలసి పనిచేయడానికి ముందుకొచ్చింది. పార్టీలు జరిగే ప్రదేశాల్లో బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వారిని ప్రత్యేకమైన రక్షణ కవచంలా ఇది ఉపయోగపడుతుందని నంద అంటున్నారు.

“అకేషనల్లీ డ్రింకింగ్ హ్యాబిట్ ఉండొచ్చు. కానీ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం అంత సురక్షితం కాదు,” నంద

పార్టీలు, ఫంక్షన్లకు అటెండ్ అయిన వారికి, వారి కుటుంబాలకు ఈ సర్వీసు బాగా ఉపయోగపడుతుంది.

మిషన్ స్మార్ట్ రైడ్, ఉబర్ క్యాబ్ సౌజన్యంతో

ఉబర్ సంస్థ మిషన్ స్మార్ట్ రైడ్ కోసం క్యాబ్ లను అందిస్తోంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఉబర్ హైదరాబాద్ జిఎం సిద్ధార్థ్ శంకర్ అన్నారు. రెస్టారెంట్ లో లేట్ నైట్ దాకా డిన్నర్ అటెండ్ అయినా, డ్రింక్ చేసి , కారు నడపలేని స్థితిలో ఉన్నప్పుడు డ్రైవింగ్ కు దూరంగా ఉండటం మంచిది. అలాంటప్పుడు తమ క్యాబ్ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఉబర్ సంస్థ చెబుతోంది. దీన్ని మిషన్ స్మార్ట్ రైడ్ తో కలసి అమలు చేస్తోంది.

“సిటీ మొత్తం మా సంస్థకు క్యాబ్ లను సప్లై చేయడం ఒక్క ఉబర్ వల్ల సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని ప్రాంతాలకు కలసి పనిచేయడానికి ముందుకొచ్చారు,” నంద

ప్రారంభంలో ఉబర్ ను కలుపుకు పోయామని, భవిష్యత్ లో అందుబాటులో ఉన్న క్యాబ్ సర్వీసులను వినియోగించుకుంటామని నంద చెప్పుకొచ్చారు.

image


మిషన్ రైడ్ టీం

మిషన్ రైడ్ కు నంద సంధ్యాల సిఈఓ, ఫౌండర్. ఇన్సూరెన్స్, ఐటి ఇండస్ట్రీల్లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉన్న ఈ ఎన్నారై- దేశం కోసం ఏదైనా చేయాలని భారత్ కు తిరిగి వస్తూ అనుకున్నారు. పక్కా హైదరాబాదీ అయిన ఈయన అదే విజన్ తో ఈ సోషల్ ఇనిషియేషన్ ను తీసుకున్నారు. ముందుగా తెలంగాణలో అమలు చేసి తర్వాత దేశ వ్యాప్తంగ ఈసేవలను అందిస్తామంటున్నారు. నందతోపాటు మరో పది మంది ఆన్ రోల్, ఆఫ్ రోల్ ఉద్యోగులు ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.

సవాళ్లు

జనంలో అవేర్ నెస్ లేనంత వరకూ ఇలాంటి వాటికి పెద్దగా ఆదరణ ఉండదు. ఈవిషయంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎన్జీవోలతో కలసి పనిచేస్తామని అంటన్నారు నంద. తమ సంస్థకు ముందున్న పెద్ద సవాల్ ఇదేనని చెబుతున్న ఆయన దీన్ని అధిగమించడానికి అన్ని మాధ్యమాల్లో ప్రచారం చేస్తాముంటన్నారు.

ఆదాయవనరు, భవిష్యత్ ప్రణాళికలు

మిషన్ స్మార్ట్ రైడ్ ను స్థానిక ఇన్సూరెన్స్ కంపనీలతో టై అప్ చేస్తారట. భవిష్యత్ లో ఇదే తమకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని దీమాతో ఉన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ ను జీరో యూడిఐ సిటీగా మార్చాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.

“భవిష్యత్ లో కార్ పూలింగ్ మోడల్ ద్వారా కూడా ఆదాయ మార్గాలు అన్వేషిస్తామని ముగించారు నంద”