పర్యాటక ప్రాంతాల్లో పనికొచ్చేది ఏదైనా చేయాలి !

హోటల్ నిర్వహణ నుంచి టూరిస్ట్ బ్లాగర్ వరకూ రుతావి ప్రయాణంటూరిస్ట్ ప్లేస్‌లపై మనకి బాధ్యత ఉండాలని సూచనఫోటోగ్రఫీ, బైక్ రైడింగ్ చేయగల సాహస మహిళప్రయాణాలంటే భయం కాదు బాధ్యత అంటున్న వనిత

పర్యాటక ప్రాంతాల్లో పనికొచ్చేది ఏదైనా చేయాలి !

Monday May 18, 2015,

4 min Read

రుతావి మెహతా... అంతర్జాతీయ పర్యాటకురాలు, ఒంటరిగా సాహస యాత్రలు చేసే మహిళ, సామాజిక మీడియా రచయిత

ఎక్కడికైనా వెళ్తే... మనం ఆ ప్రాంతానికి ఎంతో కొంత ఇచ్చి రావాలని నేను నమ్ముతా- రుతావి మెహతా

"16ఏళ్ల వయసులో తొలిసారిగా నేను కొల్హాపూర్‌కు ఒంటరి ప్రయాణం చేశాను. సాధారణ బస్సులోనే నా ప్రయాణం సాగింది. ఒంటరిగా ప్రయాణిస్తున్నాననే భావనే నాకు లేదు. ఆ ప్రయాణంలో నేను గుర్తుండిపోయిన విషయం. బైక్ తోలగలిగే మహిళతో పరిచయం. మహరాష్ట్ర సాంప్రదాయ దుస్తులను ధరించిన ఆమె రాజ్‌దూత్ బుల్లెట్ డ్రైవ్ చేస్తుంది. ఆమెకి 70ఏళ్లంటే నమ్మగలరా ? తన భర్తతో కలిసి రోడ్ ట్రిప్ వేసిన విషయాన్ని ఆమె చెప్పింది. ఆ సంగతి నా మనసులో నాటుకుపోయింది "- రుతావి

రుతావి మెహతా- ప్రయాణమే ఆమె ఊపిరి

రుతావి మెహతా- ప్రయాణమే ఆమె ఊపిరి


హోటల్ నిర్వాహకురాల నుంచి ఒంటరి ప్రయాణాల వరకూ

హాటల్ నిర్వహణ, సేల్స్, మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్, సోషల్ మీడియా ప్లానర్, ఇంటర్నెట్ మార్కెటింగ్ వంటి అనేక రంగాల్లో అనుభవం ఉంది రుతావి మెహతాకు. అయితే ఉద్యోగాలు ఎన్ని చేసినా మెహతాకు మాత్రం ట్రావెలింగ్ అంటే ఉన్న ఇష్టం మాత్రం అలానే ఉంది. “నేను నేర్చుకున్న మొదటి స్కిల్ ఫోటోగ్రఫీ. అప్పట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ చేశాను ఓసారి. అప్పుడే బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. నాకు కొత్త కావడంతో డ్రైవింగ్, కెమేరా రెండింటినీ కలిపి ఉపయోగించడంపై అవగాహన రాలేదు. రైడర్‌కి, బైకర్‌కి మధ్య తేడా అర్ధమయ్యాక... ఒక ఫోటోగ్రాఫర్ దృష్టిలోంచి డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టానం”టారు రుతావి.

తర్వాత బైకర్ణీకి చెందిన ఊర్వశి పాటోల్‌లో చేరారామె. ఇంటర్నెట్ మార్కెటింగ్ ద్వారా తెలుసుకున్నానని చెబ్తారు మెహతా. అంతకు ముందు హోటల్ రంగంలో అనుభవం ఉండడం ఈ విషయంలో ఆమెకు కలిసొచ్చిందని చెప్పాలి. తాను కూడా సొంతంగా ప్రారంభించాలనే తలంపు కలిగింది. ” చేస్తున్న పనులన్నీ వదిలేసి కతార్‌లో ఉన్న తన సోదరి దగ్గరికి వెళ్లిపోయాను. ఇది చాలా మంచి నిర్ణయమని తర్వాత అర్దమైంది. ఎందుకంటే ట్రావెలింగ్, టూరిజం గురించి చాలా తెలుసుకున్నాను. మొదట కతార్ టూరిజం పూర్తి చేశాను. ట్రావెల్ ప్రాజెక్టుకు.. సోషల్ మీడియా, మార్కెటింగ్‌లను కలిపి పూర్తి చేశాను. దీని పేరు ఐ లవ్ కతార్. ఇది నా మొటి అసైన్‌మెంట్.”-రుతావి

దీని తర్వాత వెనక్కి తీరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనేక టూరిజం బోర్డులతో కలిసి పనిచేసే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. “ ట్రావెలింగ్, సోషల్ మీడియాపై పని చేయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. అలాంటి ఒక ప్రాజెక్ట్ పేరు కేరళ బ్లాగ్ ఎక్స్‌ప్రెస్. ప్రపంచవ్యాప్తంగా 25 మంది బ్లాగర్లను కేరళలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వారి అనుభవాలు పంచుకున్నారు. దీనికి వచ్చిన స్పందన అమోఘమం”టారు రుతావి.

బైక్‌పై అలా రయ్యని దూసుకుపోతుంటే.. ఆ కిక్కెే వేరప్పా

బైక్‌పై అలా రయ్యని దూసుకుపోతుంటే.. ఆ కిక్కెే వేరప్పా


బాధ్యతాయుత ప్రయాణాలు

ఒక మహిళగా ఒంటరి ప్రయాణాలు చేయడంపై తానెప్పుడూ అలా భావించలేదంటారు రుతావి మెహతా. “ఇదో అద్భుతమైన అనుభవం. ప్రయాణాలను నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను. విడిగా అయినా, గ్రూపులో భాగంగా అయినా ప్రయాణమంటే మనల్ని మనం తెలుసుకోవడమే. అదే సమయంలో ప్రయాణాలంటే బాధ్యత కూడా ఉండాలి. ప్రతీ ఏటా లడఖ్‌లోని స్కూళ్లలో ఒక నెల రోజుల పాటు పాఠాలు చెబ్తాను. ఆయా పాఠశాలలను చేరుకునేందుకు రోజు అనేక కిలోమీటర్లపాటు నడవాలి. అయినా సరే 2001 నుంచి ప్రతీ ఏటా ఇది చేస్తూనే ఉన్నాను. నా ఉద్దేశ్యంలో ఎక్కడికైనా వెళితే... ఆ ప్రాంతానికి మనం ఎంతో కొంత సాయం చేయాలి. ఆ ప్రదేశాల నుంచి మనం చాలా తీసుకుంటాం. కానీ ఆ ప్లేసులకు కూడా ఇవ్వాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదం”టారు రుతావి.

తర్వాత రుతావి టూర్ లక్షద్వీప్‌లో. “అక్కడి దీవుల్లో స్థానికుల ప్రయాణ సాధనాలు, విధానాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. నీటి ద్వారా తప్ప మరే విధంగా రవాణా సదుపాయం లేని ఆ ప్రాంతంలోనూ అనేక ఆంక్షలుంటాయి. అక్కడి గిరిజనులందంరూ చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. కానీ నేను తిరిగిన ద్వీపం మొత్తం వైశాల్యం ఐదు కిలో మీటర్లే. కల్పెన్నీ అనే అతి పెద్ద దీవి 12 కిలోమీటర్లు ఉంటుందంతే. ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా. లక్షద్వీప్ ప్రజలు, ప్రాంతాలపై ఓ డాక్యుమెంటరీ తీయాలని భావించా. అయితే.... ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయానం''టారు రుతావి

ఎవరెస్ట్ బేస్ కేంప్ దగ్గర

దేశంలోని వివిధ ప్రాంతాలను సదర్శంచడం, పలు రకాల సంస్కృతును తెలుసుకోవడం రుతావికి చాలా ఇష్టం. ముంబై ట్రావెల్ మాసివ్‌కి హెడ్‌గా ఉన్న ఆమె.. నగరంలోని ప్రాంతాలను సందర్శించేందుకు పలు ట్రావెల్ మీట్‌లను నిర్వహిస్తున్నారు. ఎన్‌డీటీవీలో ప్రసారమైన ఎవరెస్ట్ ఛాలెంజ్‌లో కూడా ఆమె భాగస్వామి. “ నేనేమీ అథ్లెట్‌ని కాదు. దీంతో నేను ఈవెంట్‌లో పాల్గోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరెస్ట్ బేస్ కేంప్ ఎలా ఉంటుందో తెలియకుండానే ఈ ప్రోగ్రాంకి అప్లై చేశాన్నేను. ఇలాంటి యాక్టివిటీ నేను ఎక్కడా చూడలేదు కూడా. ఫైనల్ వరచూ చేరుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. రాజస్థాన్‌ టూర్‌కీ ప్లాన్ చేశాను. ప్రారంభంలోనే నేను పడిపోతే షేర్పాలు మోసుకొచ్చారు. నా పాదానికి తీవ్ర గాయమైంది. నాతోటి వారంతా చాలా హెల్ప్ చేశారు. నేను ఆ ఈవెంట్ నుంచి తప్పుకోవడం తప్పనిసరైంది" అంటూ రాజస్థాన్ ట్రిప్ గురించి గుర్తు చేసుకున్నారు రుతావీ.

image


రిక్షా రన్‌లో రుతావీ

ఓసారి రుతావీ మెహతా రిక్షా రన్‌లో కూడా పాలు పంచుకున్నారు. “2010లో రిక్షారన్ గురించి తెలుసుకున్నాను. ఈ ఈవెంట్ ఇండియాలోనే జరుగుతున్నా... ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నేనున్న హోటల్‌ను దాటుకుంటూ వెళ్తున్న సమయంలో మొదటిసారిగా చూశాను. ఆ ఈవెంట్ నిర్వహించే కంపెనీ భారత దేశానికి చెందినది కాకపోవడంతోనే... ఇండియన్లు లేరనే విషయం తెలుసుకున్నాను. అక్కడున్న ఇద్దరు ట్రావెల్ బ్లాగర్లతో నాకు అప్పటికే పరిచయం ఉంది. డెరిక్, బ్రెయిన్‌లు.. నన్ను ఆ ఈవెంట్‌లో భాగం కావాలని కోరారు." రుతావి

షిల్లాంగ్ వరకూ వెళ్లే ఆ ఈవెంట్ పూర్తవడానికి 12 రోజులు పడుతుంది. ప్రతీ ప్రాంతంలోనూ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం విశేషం. రిక్షా రన్‌లో పాల్గొన్న మొదటి ట్రావెల్ బ్లాగర్ రుతావీయే కావడ విశేషం. ఇంతకీ ఈ రిక్షారన్ నిర్వహించే టీం పేరేంటో తెలుసా... టీం రోమాంచక్. బాగా నేటివ్ టచ్ ఇచ్చారు కదా.