తెలుగు స్టాండప్ కామెడీ.. నవ్వుతారు పడీపడీ !!

తొలిసారిగా వేదికైన భాగ్యనగరం

తెలుగు స్టాండప్ కామెడీ.. నవ్వుతారు పడీపడీ !!

Friday November 27, 2015,

2 min Read

ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో చాలా కామన్ అయిన స్టాండప్ కామెడీ షోలు హైదరాబాద్ లో కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఇటీవల స్టాండప్ కామెడీ ఈవెంట్స్ ఎక్కువగా జరుగున్నాయి. మొదటి సారి బంజారాహిల్స్ లామకాన్ లో జరిగిన తెలుగు స్టాండప్ కామెడీ కాంపిటీషన్స్ ఆడియన్స్ ని నవ్వులతో కట్టిపడేసాయి.

‘స్టాండప్ ను మొదటి సారి తెలుగులో చేపట్టినప్పుడు అసలు సక్సస్ అవుతుందో లేదో అనుకున్నాం. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది.’ మహేష్ కత్తి

చతురులు నిర్వహకులుగా వ్యవహరిస్తున్న మహేష్ మొదటి స్టాండప్ కామిడీ కాంపిటీషన్స్ సక్సస్ ఫుల్ గా నిర్వహించారు.

image


స్టాండప్ కామెడీ

స్టాండప్ కామెడీ అనేది పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రక్రియ. అమెరికాలో స్టాండప్ కామెడీ షోలన్నీ హౌస్ ఫుల్ షోలే. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ప్రతి వీకెండ్ కి ఇలాంటి షోస్‌ జరుగుతుంటాయి. స్టాండప్ కామెడీతో జరిగే టీవీ షోలు అంత్యంత రేటింగ్ ఉన్న షోలుగా నడుస్తున్నాయి. మొదటి ఇలాంటి షోలకు ముంబై వేదికైంది. థియేటర్ ఆర్ట్స్ ఆడిటోరియంలోనే స్టాండప్ కామెడీషోలు జరిగాయి. తర్వాత వీటి పరిమితి పెరుగుతూ వచ్చింది. ముంబై కేంద్రంగా స్టాండప్ కామెడీ చేసే ఎంతో మంది ఆర్టిస్ట్ లకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఒక ఆర్టిస్ మైక్ ముందు నిల్చొని హాస్యాన్ని పండించడం అన్న మాట. అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. ఎలాంటి యక్షన్ కు ఇక్కడ అవకాశం లేదు. సాధారణ ప్రక్రియలతో పోలిస్తే కామెడీ పండించడం కష్టమే. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కూడా స్టాండప్ కామెడీ నైట్స్ కి చాలా డిమాండ్ ఉంది.

క్యూ కట్టిన పార్టిసిపెంట్స్

ఇంగ్లీష్, హిందీ స్టాండప్ కామెడీ షోలతో పాటు తెలుగు స్టాండ్ కామెడీ చేయడానికి సిద్ధం అన్నట్లు పార్టిసిపెంట్స్ ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. ఇప్పటి దీనికి సరైన ప్లాట్ ఫాం లేకపోవడం వల్లనే షోలకూ దూరంగా ఉన్నట్లు ఆర్టిస్టులు చెప్పుకొచ్చారు. చతురులు పేరుతో ఫేస్ బుక్ లో వచ్చిన అనౌన్స్ మెంట్ కి అప్లై చేస్తూ చాలామంది హాజరయ్యారు. మొదటి సారి కనీసం మంది వస్తారని ఊహించిన నిర్వహకులకు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ రావడం కొద్దిగ ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాలి. తెలుగు భాషలో కూడా స్టాండ్ కామెడీకి మరింత భవిష్యత్ ఉందనే సంకేతాలందాయనే చెప్పాలి.

image


ఆడియన్స్ రెస్పాన్స్ అదుర్స్

తెలుగు సినిమా లో కమెడియన్స్ ఎక్కువ. మన సినిమాల్లో హాస్యానికి ప్రాధాన్యం కూడా ఎక్కువే. ఎంటర్టైన్‌మెంట్‌ ఉంటే తెలుగు సినిమా సూపర్ హిట్. అందుకే ఈ ప్రక్రియ సక్సస్ అవుతుందనడానికి అవకాశాలెక్కువగా ఉన్నాయి.

“ఆర్టిస్ట్ ను రిసీవ్ చేసుకునే ఆడియన్స్ ప్రధానం.” తమ్మారెడ్డి భరద్వాజ

సక్సస్ అయిన తెలుగు సినిమాకు ప్రధాన కారణం రైటర్లు, డైరెక్టర్ల క్రియేటివిటీ ఒక ఎత్తైతే, ఆర్టిస్ట్ ని రిసీవ్ చేసుకునే ఆడియన్ మరో ఎత్తని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమాకు అనుబంధంగా ఉన్న నాటక రంగం, ఇలాంటి స్టాండప్ కామెడీ లాంటివి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారాయన.

image


భవిష్యత్ లో మరిన్ని షోలు

మొదటి సారి రెస్పాన్స్ ఇంత బాగా వచ్చింది. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖల్లో కూడా ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తామని చతురులు ఫౌండర్ మహేష్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే అక్కడ పోటీలు నిర్వహించాలని ప్రపోజల్స్ వచ్చాయని అన్నారాయన.

తెలుగు స్టాండప్ కామెడీలు ఏ కమ్యూనిటీలకే పరిమితం కాకుండా సాధారణ ఆడియన్స్ దగ్గరకు తీసుకెళడానికి తమ సంస్థ పనిచేస్తుందని చెప్పి మహేష్ ముగించారు.