కశ్మీర్‌లోనూ విస్తరిస్తున్న ఈ-కామర్స్

కశ్మీర్ అనగానే తీవ్రవాదమే కాదు, ప్రాకృతిక సంపద కలిగిన స్వర్గమంటున్నారు సాహిల్...కశ్మీరీ ఆర్గానిక్ ఉత్పతులను దేశ విదేశాలకు పరిచయం చేస్తున్న 'ప్యూర్ మార్ట్ '...దేశ వ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్న సాహిల్...

0

జమ్ము కశ్మీర్ అనగానే తీవ్రవాదం లేదా మంచు ప్రదేశమని ఆలోచించే చాలా మందికి కొత్త రూపాన్ని పరిచయం చేస్తున్నారు సాహిల్ వర్మ. కశ్మీర్ ప్రాకృతిక సంపదను సహజంగా ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనే ‘ప్యూర్ మార్ట్’ స్ధాపించడానికి దారి తీసింది.

తన కాలేజ్ లైఫ్ వరకు కశ్మీర్ దాటని సాహిల్ వర్మ, ఈ రోజు కశ్మీర్ ఉత్పతులకు ప్రపంచ ఆన్‌లైన్ మార్కెట్లో పరిచయం చేస్తున్న ఓ కంపెనీ అధిపతి.

“చిన్నప్పుడు చాలా మంది కశ్మీర్ కుంకుమ పువ్వు, ఇతర డ్రై ఫ్రూట్స్ గురించి ఎందుకంతా ఆసక్తి చూపేవారో తెలియకపోయేది. ఎందుకంటే మాకు అవన్నీ సాధారణంగా దొరికే పధార్థాలే ”. - సాహిల్ వర్మ

మొట్టమొదటి సారి తను బీ ఫార్మసీ చేయడానికి కశ్మీర్ దాటి బెంగుళూరు వెళ్లారు సాహిల్. అయితే సొంతూరు వదిలి వెళ్లడం అత్యంత కఠినంగా అనిపించిందని అంటారు. అక్కడ చాలా మంది, వివిధ ప్రాంతాల వారు స్నేహితులు అయ్యారు. “కాని కశ్మీర్ గురించి చాలా మందికి అనేక అభిప్రాయాలు ఉండేవి. మా ప్రాంతమనగానే తీవ్రవాదం,కుంకుమ పువ్వు, అక్రూట్లు, మంచు ప్రాంతమనే అందరు గుర్తించే వారని అంటారు సాహిల్.”

తన గ్రాడ్యూయేషన్ తరువాత 14 సంవత్సరాల పాటు హైద్రాబాద్, పుణే, ముంబయి, చెన్నై ప్రాంతాల్లో జీవితాన్ని గడిపిన సాహిల్, కశ్మీర్ గురించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

ఓ రోజు తన ప్రాణ స్నాహితుడి తండ్రి మరణం, సాహిల్ ఆలోచనని బలపరిచింది, ఆయన తిండి అలవాట్లు, బీజీ షెడ్యూల్ అయన ఆరోగ్యాన్ని పాడు చేసిందని తెలుసుకున్నారు. గుండె జబ్బులు, శ్వాస సంబంధించిన సమస్యలతో పాటు కీళ్ల సమస్యలు ఈ కాలంలో చాలా మంది మరణాలకు కారణంగా మారుతుందని గమనించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజమైన కశ్మీర్ అక్రోట్లు, కుంకుమ మరియు ఇతర డ్రై ఫ్రూట్స్‌ను ప్రజల ఆరోగ్యకర డైట్‌లో చేర్చాలని భావించారు. దాని వల్ల తన కశ్మీర్ కేవలం తీవ్రవాద కార్యకలాపాల పేరుతో కాకుండా ఆరోగ్యకర ఉత్పత్తులతో గుర్తుండేలా చేయాలని సాహిల్ ప్రయత్నం.

ఈ ఆలోచనని పూర్తిగా మద్దతు ఇస్తూ సహకరించారు సాహిల్ భార్య, అయితే ఇలాంటి వ్యాపారాలంటే తల్లిదండ్రులు ఒప్పుకోరని వారి తల్లిదండ్రులకు మాత్రం చెప్పలేదు.

తన కో ఫౌండర్ మరియు భార్య రజని వర్మతో కలిసి సంవత్సరం పాటు సాహిల్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్తర భారత దేశం ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కుంకుమ పువ్వు , అక్రూట్ల గురించి ఏ మాత్రం తెలియని వారు కూడా ఉన్నారని చూసి ఆశ్చర్యపోయారట సాహిల్ దంపతులు. అలాంటి వారి కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా సాంపిల్ తీసుకెళ్లేవారు.

ఇదంతా చూసాక, నేరుగా కస్టమర్లతోనే వ్యాపారం చేయాలని ఆలోచించారు, ఇక ఆ సమయంలోఈ కామర్స్ జోరుగా నడుస్తుండటం చూసి, 2011 లో కొత్త ట్రెండ్‌లోకి అడుగుపెట్టారు సాహిల్.

కుంకుమ పువ్వు, అక్రూట్లతో ప్రారంభమైన ‘ప్యూర్ మార్ట్’, ఇతర చాలా ప్రాడక్ట్స్‌ను లాంచ్ చేసారు. దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్యూర్ మార్ట్ ఉత్పత్తులు సప్లై చేస్తున్నారు. అంతే కాకుండా, కెనెడా, యూకే, దుబాయి లాంటి దేశాల నుండి 2వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి.

అక్రూట్లను సిద్ధం చేస్తున్న మహిళ
అక్రూట్లను సిద్ధం చేస్తున్న మహిళ

సహజమైన వ్యవసాయంతో ఉత్పత్తి చేసే అక్రూట్లు, కుంకుమ పువ్వును రైతుల నుండి సమీకరిస్తున్న ‘ప్యూర్ మార్ట్’, ‘నీవ్ హర్బల్స్’ మరియు ‘24 మంత్రా’ లాంటి ప్రముఖ ఆర్గానిక్ కంపెనీలతో కూడా పొత్తు పెట్టుకున్నారు.

ఓ మంచి బ్రాండ్ కన్నా, మంచి ప్రాడక్ట్ సప్లై చేస్తేనే కస్టమర్ విశ్వాసాన్ని గెలుచుకుంటారని భావిస్తారు సాహిల్. ఇప్పటి వరకు 99 శాతం కస్టమర్లు మా కంపెనీని మెచ్చుకున్నారని అంటున్న అతను, ఒక శాతం డెలివరీ చేసే కంపెనీ కారణంగా సమస్య ఏర్పడిందని అంటారు. అయితే డెలివరి, పేమెంట్స్ సమస్య ఇప్పటికీ ఉందంటున్న సాహిల్, ఆ సమస్యని పరిష్కరించడానికి సొంత మోడల్‌ను బెంగుళూరులో ప్రారంభించామని విశ్లేషిస్తున్నారు. అక్కడ ఎక్స్‌ట్రా చార్జ్ లేకుండా డెలివరీ చేసే విధానాన్ని ఇతర నగరాలకూ విస్తరించే యోచనలో కంపెనీ ఉంది.

కొత్త ప్రాజెక్ట్స్‌తో సిధ్ధంగా ఉన్న ‘ప్యూర్ మార్ట్’, ఇతర సంస్ధలతో పాటు ఆర్గానిక్ ఫెయిర్స్‌తో తమ కంపెనీని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. అలాగే ప్రధాన నగరాల్లో ఉండే అనుకూలమైన భాగస్వాముల కోసం కూడా వెతికే పనిలోపడ్డారు. సాహిల్, సోషల్ మీడియాలో తమ ఇమేజ్‌ను పెంచడంతో పాటు, సొంత టెక్నికల్ టీమ్ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు.

జమ్ము కశ్మీర్లోని ఇతర ఆన్‌లైన్ వ్యాపారవేత్తలతో పొత్తు పెట్టుకుని, ఇక్కడి హస్తకళలను ‘ఫ్యూర్ మార్ట్’ ద్వారా పరిచయం చేయాలనే ప్రయత్నం కూడా జరుగుతోంది. మా ప్రాడక్ట్స్‌పై ప్రజల నమ్మకంతో పాటు విశ్వాసం గెలవాలనేదే మా లక్ష్యమంటున్నారు సాహిల్. ఇదే సామర్ధ్యంతో ఈ ఏడాది కోటి వరకు టార్గెట్ పెట్టుకున్నారు. తన కంపెనీకి అన్ని తనే అయిన సాహిల్, “రేండేళ్లు ఆన్‌లైన్ సేల్స్ అనుభవంతో సొంతూరు తిరిగి రావడం ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు.

“వ్యాపారానికి సొంత టేస్ట్ తో పాటు ఆనందం, సరదా కూడా ఉంటుందని అంటున్న సాహిల్, సాహసం చేసే వారు వారి గమ్యాన్ని ఎంచుకుంటారని అంటున్నారు.”
Sr. Correspondent @ yourstory.com

Related Stories