ఫుడ్డు కావాలా నాయనా.. !?

ఫుడ్డు కావాలా నాయనా.. !?

Saturday December 19, 2015,

4 min Read

రోజులు మారుతున్నా కొద్దీ ప్రజల అలవాట్లు మారిపోతున్నాయి. గతంలో ఇంటి రుచికే పరిమితమైన జనాలు ఇప్పుడు విభిన్న రుచుల కోసం రెస్టారెంట్లకు పరుగులు పెడుతున్నారు. ఏ రెస్టారెంట్‌ కు వెళ్లాలో క్లారిటీతోనే ఉంటున్నప్పటికీ, ఏం తినాలనే దానిపైనే కన్ఫ్యూజన్. అయితే రుచికరమైన వంటకాల గురించి తెలుసుకోవాలంటే తమతో చాట్ చేయండంటోంది క్వింటో. ఫుడ్ టెక్నాలజీలోకి విభిన్న ఆలోచనతో అడుగుపెట్టిందీ స్టార్టప్. ఈ రంగంలో ఉన్న అన్ని స్టార్టప్‌లతో కలిసి మీ-టూ రెస్టారెంట్ సెర్చ్ సర్వీసులను అందిస్తున్నది.

కొన్నిసార్లు ఎంపిక కూడా చాలా కష్టమవుతుంది. ఏ రెస్టారెంట్‌కు వెళితే మంచి ఫుడ్ లభిస్తుందో తెలిసినప్పటికీ, ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేయాలో మాత్రం చాలామందికి అర్థం కాదు. ఎగ్ స్పెషలిస్ట్ రెస్టారెంట్ ‘యాల్క్ షైర్’ రెస్టారెంట్ ఓనర్, ‘ది టాస్డ్ సలాడ్’ ఫుడ్ బ్లాగర్ నిర్వహిస్తున్న పుణెకు చెందిన సాహిల్ ఖాన్‌ కు ఇలాంటి ప్రశ్నలు కస్టమర్ల నుంచి తరుచుగా ఎదురవుతుంటాయి. ‘‘నగరంలో మంచి బిర్యానీ ఎక్కడ లభిస్తుంది?’’, ‘‘ఫలానా రెస్టారెంట్‌లో ఏ ఐటమ్ ఆర్డర్ చేస్తే బాగుంటుంది’’ అని బ్లాగ్ రీడర్స్ ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు.

తనలాంటి ఎంతోమంది నగరంలో ఫుడ్ బ్లాగర్ నిర్వహిస్తున్నా, జమాటో, బర్ప్ లాంటి స్టార్టప్‌ లు రివ్యూలు ఇస్తున్నా, భోజన ప్రియలు మాత్రం ఏమి తినాలనే అంశంలో ఇంకా కన్ఫ్యూజన్‌ లోనే ఉన్నారని సాహిల్ గుర్తించారు.

ఇదే సమయంలో ఫుడ్ అండ్ బేవరేజెస్ ఇండస్ట్రీలో పర్చేజ్-ఇంటెంట్ మైనింగ్ టూల్‌ పై పనిచేసే హృషికేష్ రాజ్‌ పథ్‌ ఈ విషయాన్ని గుర్తించారు. పుణెలో బే ఆఫ్ బెంగాల్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న హృషికేష్ ఐఐటీలో ఎంసీఏ పూర్తిచేశారు. పెరిసిస్టెంట్ టెక్నాలజీలో ఐదేళ్లపాటు డాటామైనింగ్, మెషిన్ లెర్నింగ్‌ విభాగంలో పనిచేశారు. సాహిల్ ఖాన్, హృషికేష్ ఇద్దరు కలిసి పనిచేస్తే బాగుంటుందని వారి స్నేహితులు సూచించారు. ఒకరినొకరికి పరిచేయం కూడా చేశారు.

క్వింటో టీమ్

క్వింటో టీమ్


‘‘మా ప్రధాన లక్ష్యం ఒక్కటే. గత ఏడాదిగా భోజన ప్రియుల మదిలో మెదులుతున్న సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదే మా లక్ష్యం. ఇందు కోసం ఎంతో సెర్చ్ చేశాం. ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తిగత అభిరుచిలను తెలుసుకున్నాం. సోషల్ డిస్కవరీ మోడల్‌ లో చాలామంది అభిప్రాయాలు సేకరించాం’’ అని 27 ఏళ్ల సాహిల్ చెప్పారు.

ఆటోమేటెడ్ చాట్ బేస్డ్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ రికమండేషన్ల కోసం క్వింటో ఏఐ అనే సాఫ్ట్‌ వేర్‌ ను రూపొందించింది. దాన్ని ఫుడ్‌ కు సంబంధించి సిరిగా భావిస్తున్నది. ప్రస్తుతం వీరి సేవలు కేవలం పుణె, ముంబైలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్‌ లలో యాప్ సేవలు అందిస్తున్నది.

గత ఏడాది ఆగస్టులో ప్రాడక్ట్‌ ను లాంచ్ చేసినప్పటికీ మార్కెట్ ఫీడ్‌ బ్యాక్ తీసుకుని ఫిబ్రవరిలో మరోసారి లాంచ్ చేయాల్సి వచ్చింది. ఇక నాచురల్ లాంగ్వేజ్ ప్రొగ్రామింగ్‌ ను రూపొందించి నవంబర్ 16న ప్రాడక్ట్ సెకండ్ వర్షన్‌ ను లాంచ్ చేశారు.

ఆరంభంలో సెర్చ్, డిస్కవరీ మోడల్ ప్లాట్‌ఫామ్‌ ను వీరు రూపొందించారు. అయితే కస్టమర్ల నుంచి మరిన్ని ఫిల్టర్స్, డిస్క్రిప్షన్స్ కావాలని ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కస్టమర్లకు తమ సమస్యేంటే తెలిసిపోవడంతో, దాన్ని పరిష్కరించేందుకు మల్టిపుల్ వెర్షన్స్ ఉన్న యాప్ తీసుకురావాల్సిందేనని సాహిల్ చెప్పారు.

మరిన్ని ఫిల్టర్స్, డిస్క్రిప్షన్స్‌ను అందించడం కంటే ‘మీ-టూ’ రెస్టారెంట్ సెర్చ్ సర్వీస్‌ లను అందించాలని వారిద్దరూ నిర్ణయించారు. ‘‘మొబైల్ యాప్ బేస్డ్ మోడల్‌ ను కొనసాగిస్తూనే, చాట్ బేస్డ్ మోడల్ అయితే బాగుంటుందని మేం భావించాం’’ అని సాహిల్ తెలిపారు.

ఈ సమయంలోనే క్వింటో ఐడియా వచ్చింది. క్వింటో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ఎవరికి ఏం నచ్చుతుందో దీనికి పూర్తిగా తెలిసిపోతుంది.

వర్కింగ్ స్టయిల్..

కస్టమర్లకు ఎలాంటి ఫుడ్ నచ్చుతుందో తెలుసుకునేందుకు క్వింటో కూడా ఎన్ఎల్పీ మోడల్‌ను ఉపయోగిస్తుంది. దీని ద్వారా వ్యక్తిగత ప్రతిపాదనలను అందిస్తుంది.

‘‘మా ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్‌ లను స్థానికంగానే రూపొందించాం. కస్టమర్లు తాము తినే సమయంలో ఫుడ్ గురించే చర్చించుకుంటారు. తాము ఎక్కడెక్కడ తిన్నది చెప్పుకొంటారు. వారి ఆలోచనలన్నీ వాటి చుట్టే ఉంటాయి. డాటా మైనింగ్, ఎడిటోరియల్ క్యూరేషన్‌ల సాయంతో ఆ సమాచారాన్నంతా మేం సేకరించి, కస్టమర్ల డేటాబేస్‌ ను రూపొందించి, వారికి వ్యక్తిగత ప్రతిపాదనలను అందిస్తాం’’ అని సాహిల్ వివరించారు.

ఫుడ్, రెస్టారెంట్ల రికమండేషన్ల కోసం యూజర్లు సులభంగా చాట్ చేయొచ్చు. చాలామంది కస్టమర్లకు తలెత్తుతున్న సందేహాలివే...

1. దక్కన్‌ లో మంచి మసాలా ఆమ్లెట్ ఎక్కడ దొరుకుతుంది?

2. లే ప్లాసిర్ రెస్టారెంట్‌ లో దొరికే మంచి ఫుడ్ ఏంటి?

3. మంచి చై నీస్ ఫుడ్‌ ను సూచించండి?

4. కొరెగావ్ పార్క్ సమీపంలో బార్ల గురించి..

యూజర్ల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు బదులుగా, ఫుడ్, రెస్టారెంట్ల గురించి ఎలా తెలుసుకోవాలన్న ఆలోచనలను చొప్పించడానికి బదులుగా, క్వింటో టీమ్ మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రజలతో చాట్ చేస్తూనే వారికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నది. ఇలాంటి ప్రతిపాదనలు చేసేముందు ఎంతో డేటాబేస్‌ ను ఆకలింపు చేసుకుంటున్నామని, ఆ తర్వాతే ఎడిటోరియల్ క్యూరేషన్, పర్సనలైజేషన్ పద్ధతుల ద్వారా సలహాలిస్తున్నామని సాహిల్ చెప్పారు.

మోడల్.. గ్రోత్..

ఈ క్వింటో బృందం ఆదాయం కోసం అగ్రిగేటర్ మోడల్‌ ను అనుసరిస్తున్నది. కమిషన్ ద్వారా రెవెన్యూ ఆర్జిస్తున్నది. అన్ని డెలివరీ యాప్స్, ఫుడ్ ఔట్‌ లెట్స్, రెస్టారెంట్స్ క్వింటో ప్లాట్‌ ఫామ్‌ లో భాగంగానే ఉండిపోతాయి. ఎవరైనా ఫుడ్ లేదా రెస్టారెంట్ గురించి అడిగితే వారికి అవసరమైన ప్రతిపాదనలు అందిస్తుంది క్వింటో.

అయితే కమిషన్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేదానిపై ఇంకా క్వింటో టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సర్వీస్‌ లు అందించేముందు సరైన ప్రతిపాదనలు అందించడం, భోజన ప్రియులు కోరుకునేదాన్ని చూపడంపైనే తమ దృష్టంతా నెలకొల్పామని క్వింటో టీమ్ చెప్తున్నది. కస్టమర్ల మదిని దోచుకోగలిగితే వారు క్వింటో ద్వారానే అన్నీ ఆర్డర్ చేస్తారని వారు భావిస్తున్నారు.

ఫండింగ్..

ఫుడ్ టెక్నాలజీ రంగంలో క్వింటో ఇప్పుడిప్పుడే నిలదొక్కంటున్నది. దీంతో ఫండింగ్ కూడా వస్తున్నది. ఫాసో సీఈవో జైదీప్ బర్మన్ గత జులైలో ఈ స్టార్టప్‌ లో పెట్టుబడి పెట్టారు. ఎంత పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచారు. ఫండింగ్ ద్వారానే కాకుండా మరిన్ని మార్గాల్లో రెవెన్యూ సంపాదించాలని క్వింటో టీమ్ చూస్తున్నది. యాండ్రాయిడ్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ లో క్వింటోకు అవుటాఫ్ ఫోర్‌ కి 3.9 రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు దాదాపుగా 5 వేలమంది ఈ యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకున్నారు. ప్రతి రోజు 100-120 మంది తమ ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు.

ప్రస్తుతానికైతే పుణె, ముంబైలపై మాత్రమే క్వింటో దృష్టిసారించింది. ఇతర సేవలను అందించేముందు ఇప్పుడిస్తున్న సేవలను అత్యున్నతంగా కస్టమర్లకు అందించే విధానాలు ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

యువర్‌ స్టోరీ టేక్

ఫుడ్ టెక్నాలజీలో పోటీ రోజు రోజుకు పెరిగిపోతున్నది. దీంతో రెవెన్యూ మార్గాలు కూడా సన్నగిల్లుతున్నాయి. దీంతో వ్యాపారం, ఆదాయం, స్థిరత్వం కోసం మరింత దృష్టిపెట్టాల్సిన అవసరముంది. కస్టమర్లను, ఇన్వెస్టర్లను ఫుడ్ ఇండస్ట్రీ త్వరగా ఆకర్షిస్తుందని చాలామంది విశ్వాసం. మొదటి మూడొందల ఆర్డర్లు పొందడం సులువే. ఆ తర్వాత ఆర్డర్లు పొందడంతోనే కష్టాలు ఆరంభమవుతాయి. అలాగే ఆహార రంగంలో కస్లమర్లను దక్కించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఫుడ్ పండాలాంటి ప్రముఖ స్టార్టప్ ప్లాట్‌ ఫామే ఒక్కో కస్టమర్‌ను దక్కించుకునేందుకు 400 నుంచి 500 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నది. మొత్తం ఏడు డీల్స్‌ లో ఏప్రిల్ ఒక్క నెలలోనే ఆహారరంగంలో 74 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే ఆగస్టులో ఇది ఐదు డీల్స్‌కు 19 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక సెప్టెంబర్‌లో మరో రెండు డీల్స్ పడిపోయాయి.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, చాట్ బేస్డ్ ఇంటర్‌ ఫేస్ మోడల్‌ లో నెమ్మదైన వృద్ధి ఉన్న నేపథ్యంలో క్వింటో మోడల్ ఏ మేరకు సక్సెసవుతుందో వేచి చూడాలి.

Google Play/iOS