నగలను అద్దెకివ్వడానికి పుట్టుకొచ్చిన 'ఈవ్స్24'

మగువల కోసం సరికొత్త పధకాలు ప్రకటించిన 'ఈవ్స్24'అమ్మకానికి నగలు, అద్దెకు కూడా తీసుకునే అవకాశంనగల కోసం ప్రత్యేక సెక్యూరిటీ కల్పిస్తోన్న సంస్థమెంబర్షిప్ ఆప్షన్‌తో ప్రత్యేక ఆఫర్లు

నగలను అద్దెకివ్వడానికి పుట్టుకొచ్చిన 'ఈవ్స్24'

Wednesday July 29, 2015,

3 min Read

image


‘వివాహమే శాశ్వత బంధం. నగలనేవి అప్పటి వరకే నిలిచేవి. ఇదే ఈవ్స్24 డాట్ కామ్ ట్యాగ్ లైన్ ఇది. భారతీయ మొదటి జువెల్రీ రెంటల్ సర్వీసిది. మీ బీరువా అంతా నగలతో నింపుతానంటోంది. ఈవ్స్24 ఫౌండర్ రాహుల్ బంకా తన కజిన్ పెళ్లికి వెళ్లినప్పుడు జరిగిన ఓ సంఘటన ఈ కంపెనీ ప్రారంభించడానికి ప్రోత్సహించింది. రాహుల్ వాళ్ల ఆంటీ తన ఎమరాల్డ్, పర్ల్‌సెట్ మరోసారి వేసుకోవాలా? అంటూ ఫిర్యాదు చేస్తోంది. మూడు వారాల క్రితం జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌లో వేసుకున్నానే ! ఇప్పుడు మరోసారి ఎలా వేసుకోగలను ? అంటూ ఆమె వ్యక్తం చేసిన ప్రశ్నలాంటి ఆశ్చర్యాన్ని రాహుల్ గ్రహించారు. ఎంతో ఖర్చుపెట్టిన నగలను ఒకసారి వాడి.. బీరువాలో పెట్టేయడమంటే ఎవరికైనా కష్టమే. ఈవిషయాన్ని గుర్తించిన ఆయన తన లైఫ్‌స్టైల్ వెంచర్‌కు ఐడియాగా తీసుకున్నారు.

image credit - shutterstock

image credit - shutterstock


వినూత్న రంగంలోకి బుడి బుడి అడుగులేస్తూ వచ్చిన ఈవ్స్24 ఇప్పటికే నమ్మకమైన కస్టమర్లను సంపాదించుకుంది. నిత్యం ఫ్యాషనబుల్‌గా, అందరికంటే భిన్నంగా కనిపించాలనుకునే మగువలే వీళ్ల టార్గెట్. సాధారణంగా వీరంతా పెళ్లిల్లు, రిసెప్షన్, పార్టీల్లో అందరికంటే బెస్ట్‌గా కనిపించాలనుకుంటారు. అయితే వీళ్లంతా చీరలు, డ్రెస్‌లను అకేషన్‌కి తగ్గట్టు మారుస్తూ, కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు. కానీ నగల విషయంలో అలాంటి వెసులుబాటు తక్కువ. ఇదే వారిని కొద్దిగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీళ్ల దగ్గర మెంబర్‌షిప్ తీసుకుంటే ఈ ఇబ్బందులకు సరైన పరిష్కార మార్గాలు దొరుకుతాయి.

''మగువలు ఫోజులివ్వడానికి స్వేచ్ఛ ఇచ్చాం. దాంతో పాటు లేటెస్ట్ నగలను ఇస్తున్నాం. ప్రతీ సెట్ రెండో దానికంటే ప్రత్యేకమైనదే. నగలతో ఆడవారిని మరింత అందంగా కనపడేలా చేయడమే మా అసలు కాన్సెప్ట్ అని అంటారు రాహుల్ బంక''.

ఇదెలా పనిచేస్తుంది ?

ఈ వెంచర్ రెండు రకాలైన సేవలను అందిస్తోంది. ఒకటి నగలను కొనడం. రెండోది అందమైన జువెల్రీని అద్దెకు తీసుకోవడం. మొదటి సర్వీసులో మగువలు రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేది ఇందులోనే. రోజువారీ వాడుకకి ఉపయోగపడే డైమండ్ పీసులివి. కంపెనీకి ఈఎంఐ ద్వారా డబ్బులు పే చెయ్యొచ్చు. మొదటి ఈఎంఐ కట్టిన రోజు నుంచే నగల్ని కస్టమర్లకు అందిస్తాం. నెల నెల వాడుకలో దాన్ని కట్టేసివారి సొంతం చేసుకోవచ్చు. 

రెండో సర్వీసు జువెల్రీ లైబ్రరీ సర్వీసు. ఇది కొద్దిక ఆసక్తిని కలిగించేదే. ఎక్కువ ప్రియం గల నగలు దీని కిందకొస్తాయి. మూడు నుంచి ఏడు రోజుల పాటు కస్టమర్లు వీటిని తీసుకెళ్లి మళ్లీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. వాడుకున్నందుకు ఇంత మొత్తాన్ని ఫీజ్ రూపంలో చెల్లిస్తే చాలు. జువెల్రీ విలువలో ఐదు నుంచి ఏడు శాతం వరకూ ఫీజుగా వసూలు చేస్తారు.. ఇది వారి వాడుకకు తీసుకున్న రోజుల బట్టీ లెక్కిస్తారు.

రాహుల్ బంకా

రాహుల్ బంకా


ఒక సారి సెట్ తిరిగి కంపెనీకి వచ్చాక దాన్ని క్లినింగ్ చేసి షైనింగ్ చేయిస్తారు. తర్వాతి యూజర్ కోసం దాన్ని సిద్ధం చేస్తారు.

మెంబర్‌షిప్ ప్లాన్స్

యాన్యువల్ మెంబర్ షిప్ ఒకటుంది. ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకోవచ్చు. ఇందులో 4రకాలైన మెంబర్షిప్ ప్లాన్స్ ఉన్నాయి. లక్ష, రెండులక్షలు, ఐదు లక్షలు, పదిలక్షల ప్లాన్‌లను రూపొందించారు. మెంబర్షిప్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాక కెవైసి (నో యువర్ క్లైంట్) ఫాం నింపి, కంపెనీ మెంబర్షిప్ అగ్రిమెంటులో సంతకం చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇస్తారు. ఎవరైనా ఆఫర్లతో బ్రౌజ్ చేసే అవకాశం ఉంది. మెంబర్షిప్ ప్లాన్ పరిమితి ఉన్నంతవరకూ ఎన్ని నగలైనా తీసుకోవచ్చు. వాటికి రెంట్‌ చెల్లిస్తే సరిపోతుంది.

ఈవ్స్ 24 లో ఒక పీస్

ఈవ్స్ 24 లో ఒక పీస్


స్మార్ట్ సెక్యూరిటీ

ఈవ్స్24 కస్టమర్ బెనిఫిట్స్ కోసం రక్షణ ఇస్తుంది. మెంబర్షిప్ లెవెల్‌లో 110శాతం సెక్యూరిటీ ఈక్వల్‌ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే లక్ష రూపాయిల మెంబర్షిప్ వ్యక్తులు 1.1లక్షలను చెల్లించాలి. 5లక్షల మెంబర్షిప్ ఉన్న మగువలు 5.5లక్షలివ్వాలన్నా మాట. కాస్ట్ అనేది ఎఫెక్టివ్ , కన్వీనియంట్ గా ఉండేలా చూస్తారు. ఉదాహరణకు ఒక లక్ష రూపాయల విలువైన ఒక జ్యువెల్రీని ఈవ్స్ నుంచి అద్దెకు తీసుకోవాలి అనుకుందాం. అందుకు కస్టమర్ 1.10 లక్షలు కంపెనీకి కట్టాలి. అప్పుడే వాళ్లే కస్టమర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును ఇంటికి డెలివర్ చేసి వెళ్తారు. మళ్లీ వాళ్లే మన అవసరం తీరాక ఆ జ్యువెల్రీని తీసుకుని వెళ్తారు. దీంతో సెక్యూరిటీ భయం కొద్దిగా తగ్గుతుంది. మూడు రోజులకు గాను ఒక్కో వస్తువుపై 5 శాతం అద్దెను వసూలు చేస్తారు. లక్ష రూపాయల జువెల్రీకి రూ.5 వేలు వసూలు చేస్తారని అనుకోవచ్చు.

స్టన్నింగ్  డైమండ్ పీస్

స్టన్నింగ్ డైమండ్ పీస్


ఎవరైనా కస్టమరు కంపెనీ అకౌంట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే. ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయొచ్చు. దాన్ని కంటిన్యూ చేస్తే మంచి వడ్డీ కూడా ఇస్తామని ముగించారు బంకా.

website