వ్యవస్థను కాపాడే సైబర్ వారియర్స్ కావాలి- కేటీఆర్

ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేలా స్కూల్ స్థాయినుంచే సిద్ధం చేయాలి

వ్యవస్థను కాపాడే సైబర్ వారియర్స్ కావాలి- కేటీఆర్

Tuesday November 22, 2016,

3 min Read

హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదికైంది. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, కెన్స్‌ ఎగ్జిబిషన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన సైబర్‌ సెక్యూరిటీ సదస్సు మొదటిరోజు చాలా ఆసక్తికరంగా, ఎంతో ఉత్సాహంగా సాగింది. రెండ్రోజులపాటే జరిగే ఈ సదస్సులో సైబర్‌ సెక్యూరిటీలో వస్తున్న కొత్త ట్రెండ్స్‌, డెవల్‌పమెంట్స్‌ పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు ఐటీ నిపుణులు తమ అభిప్రాయాలను, సూచనలను షేర్ చేసుకున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

దేశంలోనే మొదటిసారి సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ అంటే సమస్యకు పరిష్కారం వెతకడమొక్కటే కాదు.. విస్తారమైన ఉద్యోగ కల్పనకు కూడా మంచి అవకాశం ఉందని అన్నారు.

ప్రపంచం ఇప్పుడు కృత్రిమ మేథస్సుతో నడుస్తోంది. మనతో ప్రతీ మెషీన్ మనతో మాట్లాడుతోంది. మొబైల్ ఫోన్ దగ్గర్నుంచి రిఫ్రిజిరేట్ దాకా.. హోం థియేటర్ నుంచి ఓవెన్ దాకా ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా మారిపోయింది- కేటీఆర్

కనెక్టివిటీ పెరిగిన నేపథ్యంలో డాటాను ప్రపోషనల్ గా పెంచుకోవాలని మంత్రి సూచించారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించాలని అన్నారు. మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగాని అమెరికాలో కలిసిన సందర్భంలో సైబర్ దాడుల గురించి ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు.

image


నవంబర్ 8న ప్రధాని తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తెల్లారి నుంచే పేటీఎం, ఫ్రీచార్జ్ తో పాటు అనేక డిజిటల్ పేమెంట్ సంస్థల లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయని కేటీఆర్ అన్నారు. ప్రపంచమే డిజిటల్లీ ట్రాన్సక్షన్ మోడ్‌ లోకి వెళ్లిపోతోందని అన్నారు. భవిష్యత్ కొనుగోళ్లు అమ్మకాలన్నీ ఇంటర్నెట్ ద్వారానే జరగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల జన్ ధన్ ఖాతాలతో సహా దేశంలోని 1.3బిలియన్ మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

దేశంలోనే మొదటిసారిగా సైబర్ సెక్యూరిటీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే పాలసీ తీసుకురావడంతోనే మా పని అయిపోలేదు. పాలసీని బిల్డ్ చేయడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు మంత్రి అన్నారు. ఈ క్రమంలోనే ఐదు పాయింట్ల ఎజెండాను సదస్సులో ప్రస్తావించారు.

1.అవేర్ నెస్

2.కెపాసిటీ బిల్డింగ్

3.కొలాబరేషన్ అండ్ పార్ట్ నర్ షిప్స్

4.ఆడిట్ అండ్ స్టాండర్డైజేషన్

5.ఇన్నోవేషన్ 2/2

సైబర్ సెక్యూరిటీ అంటే ఇంచుమించు జాతీయ భద్రతే అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఉదాసీనంగా ఉండటానికి అస్సలు వీల్లేదన్నారు. సైబర్ సెక్యూరిటీ అన్నిటికంటే ప్రధానమైందన్నారు. దేశంలోని ప్రతీ మారుమూల గ్రామంలో కూడా సైబర్ సెక్యూరిటీపై అవగాహన రావాలని ఆకాంక్షించారు. సమస్యలు పరిష్కరించుకోవడమే కాదు.. హై స్కూల్ స్థాయి నుంచే పిల్లల్లో కూడా అవేర్ నెస్ తేవాలని సూచించారు.

ఐపాడ్, ఐ ఫోన్లను మా పాప, మా బాబు ఆపరేట్ చేసేంత నేను కూడా చేయలేను. దీన్నిబట్టి ఈ తరం మనకంటే ఎంతగా దూకుడుగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో స్కూల్ పిల్లలకు సైబర్ సెక్యూరిటీ పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనమీద ఎంతైనా ఉంది. ఎలాంటి సైబర్ దాడులనైనా ఎదుర్కొనేలా వాళ్లను సిద్ధం చేయాలి- మంత్రి కేటీఆర్
image


సైబర్ దాడులను, సైబర్ నేరగాళ్ల బారినుంచి కాపాడే సైబర్ వారియర్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. అందుకోసం అనేక సంస్థలతో కొలాబరేట్ కావాలని చెప్పారు. ఇటీవలే కార్నెగి మెలాన్ యూనివర్శిటీతో జరిపిన చర్చలు ఫలించాయన్నారు. దాంతోపాటు మరిన్ని ఇన్ స్టిట్యూషన్స్ తో చర్చలు జరిపాం అని తెలిపారు. దీనికి మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రధానమైందన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో డాటా సంరక్షణ అనేది అత్యంత కీలకమైందన్నారు.

ఇప్పటికే టీ హబ్ ఎన్నో ఆవిష్కరణలకు కేంద్రబిందువైంది. ఎన్నో స్టార్టప్ కంపెనీలన్నీ టీ హబ్ లో ఊపిరిపోసుకున్నాయి. టీ హబ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ అవుతుందనడంలో సందేహంలేదు- మంత్రి కేటీఆర్

అనేక దేశాల నుంచి పెద్దపెద్ద కంపెనీలు టీ హబ్ తో టై అప్ అవడానికి ఉత్సాహం కనబరుస్తున్నాయి. టీ హబ్ కూడా ఆవిష్కరణలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏం సంస్థతో అయినా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కంక్లూడ్ చేశారు కేటీఆర్.