సోలార్ ఉత్పత్తులకు ఒన్ స్టాప్ సొల్యూషన్ 'సన్ బజార్'

ప్రాజెక్ట్ వర్క్ సందర్భంగా సోలార్ ప్రొడక్స్‌పై అవగాహననిపుణులను కలిసి విస్తృతంగా చర్చించిన ఇద్దరు విద్యార్థులుసోలార్ లాంతర్ల నుంచి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుల వరకూ..ఎవరికి ఏ సేవ కావాలన్నా అందుబాటులోకి


సోలార్ ఉత్పత్తులకు ఒన్ స్టాప్ సొల్యూషన్ 'సన్ బజార్'

Sunday July 05, 2015,

3 min Read

ఎంబిఏ చదివిన తర్వాత విద్యార్థులకు కాస్తా.. కూస్తో వ్యాపారంపై అనుభవం తెలిసొస్తుంది. అదే అదే ఐఐఎం లాంటి చోట్ల బిజినెస్ చిట్కాలు నేర్చుకుంటే ఇక ఆ కుర్రాళ్లను మనం ఆపగలమా ? ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఐఐఎం కోజికోడ్‌లో ఎంబిఏ చదివిన విద్యార్థులు సమర్థ్ వాద్వా, కుమార్ గౌరవ్ ఓ సోలార్ స్టార్టప్‌తో వినూత్నంగా నిలుస్తున్నారు. కేవలం ప్రాడక్ట్స్ అమ్మి చేతులు దులుపుకోకుండా సోలార్ వ్యాపారంలో ఒక వన్ స్టాప్ సొల్యూషన్‌లా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

వాద్వా, గౌరవ్ ఇద్దరూ ఎంబిఏ చదువుతున్నప్పుడు వాళ్లకు ప్రొఫెసర్ మహేష్ వంటి వాళ్లు అద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు. అక్కడ వాళ్లు విన్న ప్రసంగాలు, స్టూడెంట్స్ మధ్య జరిగిన గ్రూప్ డిస్కషన్స్ వాళ్లిద్దరి ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. 'ఫస్ట్ సోలార్' పేరుతో వాళ్లు చేసిన కేస్ స్టడీలో అనేక విషయాలను గ్రౌండ్ స్థాయిలో అర్థం చేసుకున్నారు. భారత దేశంలో సోలార్ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ వాళ్ల కంటికి కనిపించింది. ఇదే సన్ బజార్ ఏర్పాటుకు బీజం పడేందుకు దోహదపడింది.

గౌరవ్, సమర్థ్- సన్ బజార్ వ్యవస్థాపకులు

గౌరవ్, సమర్థ్- సన్ బజార్ వ్యవస్థాపకులు


ఈ సోలార్ ఐడియాను వాళ్లు అనేక బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్లకు కూడా పంపి మన్ననలు పొందడంతో వాళ్లే ఓ స్టార్టప్ ప్రారంభించేంత ధైర్యం కలిగింది. వివిధ వేదికల మీద వీళ్లకు ప్రశంసలు కూడా దక్కాయి. ప్రముఖుల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు కూడా తీసుకున్న తర్వాత బలమైన, నిలకడతో కూడిన వినూత్నమైన సంస్థగా తమ సన్ బజార్‌ను ఏర్పాటు చేయాలని స్నేహితులిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. సోలార్ పరిశ్రమకు అవసరమైన మూడు అతి ముఖ్యమైన మూడు విషయాలపై స్పష్టత తెచ్చుకున్నారు. వాటిల్లో మొదటిది యాక్సెసబులిటీ అంటే అందుబాటులో ఉండడం, రెండోంది రిలయబిలిటీ - నమ్మకం, మూడోది ఖచ్చితమైన సర్వీస్.

సోలార్ పరిశ్రమ ఇంత వరకూ బిజినెస్ టు బిజినెస్ ఇండస్ట్రీగానే ఎదుగుతూ వచ్చింది. రిటైల్ కస్టమర్లకు (బి టు సి) నేరుగా సోలార్ ఉత్పత్తులు వెళ్లడం మన దేశంలో బాగా తక్కువ. సన్ బజార్ ఇప్పుడీ ఆలోచనను మార్చేందుకు తన వంతు కసరత్తు ప్రారంభించింది. కస్టమర్లు నేరుగా ఆన్ లైన్‌లో తమ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు వీలుంగా సులువైన, సురక్షితమైన పద్ధతిని ప్రారంభించారు. ఇక పరిశ్రమ విషయానికి వస్తే వాళ్లకు అవసరమైన అన్ని సేవలనూ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని కూడా నిర్ణయించారు. ఇందులో ఆన్ లైన్ ట్రేడింగ్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, ఎంక్వైరీలు, మార్కెటింగ్, ఎనలిటిక్స్ వంటి విభిన్నమైన ఫీచర్లను యాడ్ చేయబోతున్నారు. అమ్మకందార్లకు - కొనుగోలుదార్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు.

image


ఈ నాలుగు పునాదుల మీదే సన్ బజార్ తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది.

  1. ఈ-కామర్స్ - సోలార్ ఉత్పత్తుల అమ్మకానికి ఏర్పాటైన ఆన్ లైన్ ఈ-కామర్స్ స్టోర్
  2. ఈ-బిజ్ - ఇదో ఆన్ లైన్ సోలార్ మార్కెట్ ప్లేస్. ఎక్కిప్‌మెంట్ తయారీదార్లు, సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తిదారులు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, రెన్యువబుల్ కన్సల్టెంట్లందరినీ ఒకే చోట కలుసుకునే సౌలభ్యం ఉంటుంది
  3. ఈ-లెర్న్ - సంప్రదాయేతర ఇంధన వనరులపై అవగాహన పెంచడంతో పాటు ఆన్ లైన్ ద్వారా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. వివిధ కోర్సులు ఏర్పాటు చేసి సర్టిఫికేషన్లు, డిగ్రీలు కూడా ఇస్తారు.
  4. ఈ-కన్సల్ట్ - పెద్ద పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెద్ద ఇళ్లు, పరిశ్రమలు, కంపెనీలకు అవసరమైన సాంకేతిక కన్సల్టెన్సీని అందిస్తారు.

ఇప్పటికిప్పుడు కస్టమర్లకు సౌరవిద్యుత్ పరికరాలపై అవగాహన పెంచి కొనిపించడమనేది అసాధ్యమైన ప్రక్రియ. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు, తమ ఆలోచనలను ఇతరులతో పంచుకున్నప్పుడు వాళ్లలో అధిక శాతం మంది పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే చాలా మంది పెట్టుబడి పెట్టిన వెంటనే ప్రతిఫలం ఆభవిష్యత్తులో ఇది ప్రయోజనకారిగా ఉంటుందనే విషయమూ అందరికీ తెలిసినా, సాధారణంగా సోలార్ పరిశ్రమ అనేది మొదట ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 

''చదువుకున్న వాళ్లు, వీటిపై అవగాహన ఉన్న వాళ్లైనా వాతావరణాన్ని కాపాడే బాధ్యతను కొద్దిగా నెత్తికెత్తుకోవాలి. అయితే ఇందుకోసం ఇంటినంతటినీ సోలార్ మయం చేయమని మేం కోరడం లేదు. కనీసం సోలార్ లాంతర్, గేట్ లైట్, గార్డెన్ లైట్ వంటివైనా కొనుగోలు చేస్తే మంచిది. ఇవి మీ జేబుకు అంత భారం కాకపోవచ్చు. కానీ అది పరిశ్రమ, ప్రకృతిపై ఎంతో కొంత ప్రభావాన్ని తప్పకుండా చూపుతుంది. ఇలా ఒకొరికి ఒకరు ఆలోచిస్తూ సోలార్‌పై నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రస్తుతం సోలార్ బ్యాక్ ప్యాక్స్, సోలార్ ఛార్జర్స్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే జనాల్లో వీటికి మెల్లిగా యాక్సెప్టెన్సీ పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు'' - సమర్థ్ వాద్వా

నవంబర్ 2013లో వ్యాపారాన్ని మొదలుపెట్టిన సన్ బజార్ అతి తక్కువ కాలంలోనే ఎనిమిది అంకెల వ్యాపారాన్ని చూసింది. ఆన్ లైన్ ఈ-కామర్స్ వ్యాపారం తక్కువగానే ఉన్నప్పటికీ వాళ్ల ఆదాయంలో దీని భాగం పది శాతం వరకూ ఉంది. అధికంగా ఆఫ్ లైన్ నుంచి వస్తున్న బల్క్ ఆర్డర్లే కంపెనీకి ఊపిరిగా నిలుస్తున్నాయి. త్వరలో ఆన్ లైన్లో కూడా మెరుగైన వ్యాపారం సాగించలమే నమ్మకం ఈ జోడీలో కనిపిస్తోంది.

మనమూ వీలైతే ఓ చిన్న సోలార్ ఉత్పత్తిని తీసుకుని ప్రకృతికి మేలు చేసే ప్రయత్నంలో భాగం పంచుకుందాం.