గ్రామీణ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్న బంగ్లానాటక్

గ్రామీణ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్న బంగ్లానాటక్

Saturday September 19, 2015,

4 min Read

ఐఐటీలో ఇంజినీరింగ్, అమెరికాలో ఉద్యోగం, ప్రతి ఒక్క యువకుడు కోరుకునేది ఇదే. ఇలాంటి అవకాశం లభిస్తే ప్రతి ఒక్కరు చక్కగా సెటిలైపోయి జీవితాన్ని ఆస్వాదిస్తారు. కానీ అమితవ భట్టాచార్య కాస్త డిఫరెంట్. ఇంజినీరింగ్ చదివి తానొక్కడినే సంపాదిస్తే సరిపోదనుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పాటలు పాడే కళాకారులు కడుపు నిండా తినాలని భావించారు. అందుకే అమెరికాను వదిలి భారత్లో పల్లె పాటలకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు.

అమితవ భట్టాచార్య , ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి. తన కలలను సాకారం చేసుకునేందుకు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 1999లో ఇండియాకు తిరిగొచ్చారు. ‘ కల్చర్ అండ్ డెవలప్‌మెంట్ ’ సంస్థ బంగ్లా నాటక్ డాట్ కామ్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధికి జానపద గేయాలు, నృత్యాలు ఎంతో ఉపయోగపడతాయని భట్టాచార్య బలంగా విశ్వసిస్తారు.

బంగ్లానాటక్.కామ్ వ్యవస్థాపకులు అమితవ భట్టాచార్య

బంగ్లానాటక్.కామ్ వ్యవస్థాపకులు అమితవ భట్టాచార్య


2004లో బంగ్లానాటక్ డాట్ కామ్ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ ‘ ఆర్ట్ ఫర్ లైవ్లీ హుడ్ (ఏఎఫ్‌ఎల్)ను భట్టచార్య ప్రారంభించారు. పశ్చిమబెంగాల్‌లోని ఆరు జిల్లాలకు చెందిన 3200 మంది కళాకారులు ఆరు సంప్రదాయ కళల్లో భాగస్వాములయ్యారు.

‘‘ సంస్కృతి చాలా శక్తిమంతమైనది. గ్రామీణ ప్రాంతాల్లో సంస్థలను అభివృద్ధి చేయాలంటే సంప్రదాయ కళలను ప్రదర్శించాలి. ఆర్ట్ ఆఫ్ లైవ్లీ హుడ్ (ఏఎఫ్‌ఎల్) కార్యక్రమం ద్వారా సంస్కృతీ వారసత్వాన్ని శిక్షణ ద్వారా తిరిగి ఉత్తేజితం చేసి, ప్రమోట్ చేస్తాం. సంప్రదాయ కళలు, క్రాఫ్ట్‌లను ప్రమోట్ చేసుకునేందుకు కొత్త మార్కెట్‌ను కొత్త బ్రాండ్‌ను సృష్టిస్తాం. 

‘‘ కళలను కాపాడుకుందాం. కళాకారులను బతకనిద్దాం. అనేదే మా సిద్ధాంతం’’ అంటారు అమితవ్.

సంస్థ ఆరంభం అయినప్పటి నుంచీ పశ్చిమ బెంగాల్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన 14,000 మందికిపైగా కళాకారుల జీవితాల్లో ఏఎఫ్ఎల్ మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం లక్షల మంది ప్రజల జీవితాల్లో ఏఎఫ్ఎల్ ఓ భాగమైంది. గ్రామీణ ప్రాంతాల్లో సాధన చేస్తున్నకళాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, డైరెక్ట్ మార్కెట్ సదుపాయాలు కల్పిస్తూ కొత్త అభిమానులను పొందడంతోపాటు, మీడియా గుర్తింపు కూడా సాధించింది. ప్రస్తుతం ఈ విధానం జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందింది. ఈ సంస్థ సేవలను గుర్తించిన యునెస్కో.. బంగ్లానాటక్‌కు ఇంటాంజిబుల్ హెరిటేజ్ కమిటీ సలహాలను కూడా అందిస్తోంది.

అమితవ భట్టాచార్య, ఏఎఫ్ఎల్ వ్యవస్థాపకులు

అమితవ భట్టాచార్య, ఏఎఫ్ఎల్ వ్యవస్థాపకులు


‘‘సంస్కృతిని కాపాడేందుకు పెట్టుబడులు పెడితే, మైక్రో ఎకనామిక్స్ వృద్ధి చెంది, దినసరి కూలీల జీవితాల్లో మార్పు వస్తుంది. కూలీల నుంచి వారు ఆర్టిస్టులుగా గుర్తింపు పొందుతారు. దీంతో వారూ అభివృద్ధిలో భాగం పంచుకుంటారు. దురదృష్టవశాత్తూ సంస్కృతీ సమాజంలో పెట్టుబడులు చాలా తక్కువ. అవి కూడా డాక్యూమెంటేషన్, కల్చరల్ మ్యాపింగ్, ఫెస్టివల్ పెర్ఫార్మెన్స్‌కే పరిమితమైపోయాయి. అభివృద్ధికి దీన్ని కూడా ఓ మార్గంగా ప్లానర్స్, ప్రాక్టీషనర్స్ గుర్తించలేదు. సుస్థిర అభివృద్ధికి సంస్కృతి బలమైన దోహదకారిగా ఉపయోగపడుతుందని నా భావన. సమాజంలో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే, అప్పుడు సంస్కృతిని గుర్తించడంతోపాటు, దాన్ని రక్షించి, దానితోపాటు వృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తారు. సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. దీని శక్తిని అంతర్జాతీయ, జాతీయ సిద్ధాంతకర్తలు గుర్తించాల్సిన అవసరమున్నది ’’ అని అమితవ పేర్కొన్నారు.

ఏఎఫ్ఎల్లో భాగంగా బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో సంస్కృతీ పర్యాటకాన్ని బంగ్లానాటక్ అభివృద్ధి పరిచింది. నాచురల్, కల్చరల్ హెరిటేజ్ ను కూడా నిర్మించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫోక్ ఆర్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సందర్శకులకు, గ్రామీణ కళాకారులకు మధ్య ఇంటరాక్షన్‌ను కల్పించి ఎడ్యుకేషన్ టూరిజాన్ని కూడా వృద్ధి చేశారు. తమ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన విజిటర్లకు గ్రామీణ ప్రజలు తమ వారసత్వాన్ని వివరిస్తారు. స్థానిక కమ్యూనిటీలను ఏర్పర్చే సామర్థ్యాన్ని కలిగించడం, పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయడం వంటి వాటి కారణంగా, ప్రజల సాంఘిక, ఆర్థిక స్థితిగతుల్లో ఎంతో మార్పు చోటు చేసుకుంది. టూరిజం ప్రాడక్ట్స్‌ను ఆవిష్కరించేందుకు ఫోక్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ షాప్‌లు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారులతో ప్రపంచస్థాయి మ్యూజిషియన్స్ మమేకమైపోయారు. సందర్శకులు కూడా పల్లె కళాకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. వారసత్వ సంపదకు పునజ్జీవనం కల్పించేందుకు గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు తరుచుగా పల్లె సంబురాలు (ఫోక్ ఫెస్టివల్స్)ను నిర్వహిస్తున్నారు. ఈ సంబురాల్లో కళకారుల సమాజం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించారు. బెంగాల్ కు చెందిన ప్రఖ్యాత మధుబని పెయింటర్లు, స్క్రోల్ పెయింటర్లకు చెందిన గ్రామాల్లో, బెంగాల్ సూఫీ మ్యూజిక్ ఫకీర్ సింగర్లు నివసించే గ్రామాల్లోసంబురాలను నిర్వహించారు.

‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఫెస్టివల్స్ ను నిర్వహించి, యువ కళాకారులతో హెరిటేజ్, కల్చరల్ ప్లూరలిజమ్ ను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించాం. అలాగే కిందిస్థాయి ప్రజల సంస్కృతీ, జీవన విధానంపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల మధ్య చర్చలకు వేదిక నిర్మించాం. మా వార్షిక సంబురం ‘సూఫీ సూత్ర’ ప్రతి ఏటా కోల్ కతా, గోవా, ఢిల్లీ, బీహార్ లలో 2011 నుంచి జరుగుతున్నది. ఈ సంబురాల్లో సూఫీతోపాటు ప్రపంచ ప్రసిద్ధ సంప్రదాయ సంగీతాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ సంబురాల్లో అంతర్జాతీయ కళాకారులతో కలిసి బెంగాల్ జానపద కళాకారులు వేదికను పంచుకుంటారు. ఇప్పటికే 27 దేశాలు ఈ సంబురాల్లో పాల్గొన్ని దీన్ని నిజమైన ప్రపంచ సంగీత కచేరిగా మార్చారు’ అని భట్టాచార్య వివరించారు.

గ్రామీణ ప్రాంత కళాకారుల జీవితాల్లో ఏఎఫ్ఎల్ అద్భుతమైన ప్రభావం చూపింది. ఈ కళాకారులు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గొప్ప ఆర్టిస్టులుగా గుర్తింపు పొందారు.

‘‘గ్రామీణ కళాకారుల సగటు నెల ఆదాయం 8 అమెరికన్ డాలర్ల నుంచి 60 అమెరికన్ డాలర్లకు పెరిగింది. 40% ప్రజలకు ఇదే ప్రాథమిక జీవనోపాధి, మరో 40% ప్రజలకు ఇది ముఖ్యమైన ద్వితీయ జీవనోపాధి. 10% మంది ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా 250 డాలర్ల వరకూ సంపాదిస్తున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు పల్లెల్లో పారిశుద్ధ్యం పది శాతం కంటే తక్కువగా ఉంటే, ఇప్పుడది 80% మెరుగుపడింది. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. చాలా వరకు వలసలు తగ్గిపోయాయి. ఇప్పుడు యువకులు సైతం ఈ జానపద కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు’’ అని భట్టాచార్య వివరించారు.

సంప్రదాయ కళలకు ప్రోత్సాహం..

‘‘పశ్చిమ బెంగాల్ లో ఘనమైన కళా వారసత్వంఉంది. ఈ రంగంలో 5,50,000 మంది ప్రజలు తమ జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందేటటువంటి ఉత్పత్తులను వీరు తయారు చేస్తున్నప్పటికీ, ఉపాధి, సంస్థలు, ఎగుమతి, అభివృద్ధి రంగాల్లో కావాల్సినంత మార్పు కనిపించడంలేదు.

‘‘మా ప్రత్యేక కార్యక్రమం cam era: our city, our angle’’ ద్వారా కోల్ కతా, భువనేశ్వర్, గోవా యువకులకు ఫొటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నాం. తద్వారా వారి ఫొటోగ్రఫీ లెన్స్ లతో గొప్ప వారసత్వ సంపదను కాపాడుకోగలుగుతాం. వారు తీసిన ఫొటోలను ప్రజలు సందర్శించే ప్రదేశాల్లో ప్రదర్శనకు పెట్టాం. ఇంతటి అద్భుతమైన వారసత్వ చరిత్రతో కూడిన ఈ ఫొటోలను చూసి వేలాదిమంది ఆశ్చర్యానికి గురయ్యారు’’ అని అమితవ భార్య, బంగ్లానాటక్ డాట్ కామ్ కో డైరెక్టర్ అనన్య భట్టాచార్య చెప్పారు.

పల్లె పాటలంటే అంటే అమితవ చెవి కోసుకుంటారు. కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంత కళాకారులతో కలిసి జానపద గేయాలను కూడా ఆలపిస్తారు. ఏఏఫ్ఎల్ మోడల్ గురించి యూరొప్, ఆసియా ఖండాల్లోని ఎన్నో దేశాల్లో జరిగిన సెమీనార్లలో అమితవ పాల్గొన్నారు. ఆయన చేసిన సూచనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. మరింతమంది జానపద కళాకారులను చేరుకోవలన్న లక్ష్యంతో అమితవ ఉన్నారు. ప్రస్తుతానికైతే జానపదాన్నే జీవనోపాధిగా చేసుకున్నవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుందాం.