ఇతను ప్రపంచంలోనే మొట్టమొదటి నీళ్లలో తేలియాడే ఫోన్ కనిపెట్టాడు..!!

ఆశ్చర్యంగా వుందా?! అదే మరి.. ఇక్కడ అసలు మేటర్...!!

ఇతను ప్రపంచంలోనే మొట్టమొదటి నీళ్లలో తేలియాడే ఫోన్ కనిపెట్టాడు..!!

Saturday October 22, 2016,

2 min Read

డబ్బా ఫోన్ పట్టుకుంటే ఎగాదిగా చూసే రోజులొచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ హస్తభూషణమైంది. పొరపాటున కిందపడిపోతే ప్రాణం పోయినంత పనవుతుంది. అందుకే దానికి రకరకాల కవర్లు తొడుగుతూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక కర్మకాలి నీళ్లలో పడిందంటే స్మార్ట్ ఫోన్ మీద ఆశలు గల్లంతే. కానీ బెంగళూరు ఆంట్రప్రెన్యూర్ ప్రశాంత్ రాజ్ కనిపెట్టిన ఫోన్ అలాంటి టైప్ కాదు. నీళ్లలో పడ్డా ఎంచక్కా తేలియాడుతుంది. తీసి తుడుచుకుని హలో అనుకుంటూ వెళ్లిపోవచ్చు. ఆశ్చర్యంగా వుందా? అదే మరి.. ఇక్కడ అసలు మేటర్.

కామెట్ కోర్, పాలో ఆల్టో బేస్డ్ కంపెనీ పరిచయం చేస్తోంది ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్. కామెట్ పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఓఎస్.. ఆండ్రాయిడ్. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ రాజ్ డివైస్ ను డిజైన్ చేశాడు. 4.7 అంగుళాల స్క్రీన్. 16 మెగాపిక్సెల్ కెమెరా. రామ్ 4జీబీ. 2GHZ ఆక్టా కోర్ ప్రాసెసర్. 2800 mAh బ్యాటరీ.

image


దీని ఇంకో విశిష్టత ఏంటంటే.. మన మూడ్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఎలా అంటే, ఫోన్ లోని బయోమెట్రిక్ సెన్సార్లతో బాడీ టెంపరేచర్ పసిగడుతుంది. దాంతో మనం ఒత్తిడిలో ఉన్నామా.. కూల్ గా ఉన్నామా అని డిసైడ్ చేస్తుంది. దానికి సంబంధించిన కలర్స్ డిస్ ప్లే చేస్తుంది. అలా మన మూడ్ ఎలా వుందో ఇట్టే తెలిసిపోతుంది.

క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ఇండిగోగో చెప్పేదేంటంటే.. ఏటా 82 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు నిష్కరణంగా నీళ్లలో పడే పాడైపోతున్నాయట. దీంతో చాలా కంపెనీలు వాటర్ రెసిస్టెంట్ ఫోన్లనే తయారు చేస్తున్నాయి. కానీ కామెట్ ఫోన్ ను మాత్రం ఇంకాస్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇది నీళ్లలో పడ్డా మునగదు సరికదా.. ఎంచక్కా నీళ్లలో తేలియాడుతూ ఈత కొడుతుంది. అలా డిజైన్ చేశారు దీన్ని.

క్రౌడ్ ఫండింగ్ ద్వారానే ప్రశాంత్ ఈ ఫోన్లను మానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే 2లక్షల 50వేల డాలర్లను రెయిజ్ చేశాడు. 32 జీబీ హాండ్ సెట్ స్టార్టింగ్ ప్రైస్ 249 డార్లు. 64జీబీ మోడల్ 289 డాలర్లకు దొరుకుంతుంది.