దళారీల దగాను ఆపే 'ఓరిగో'

దళారీ వ్యవస్ధను తొలగిస్తూ రైతుకు లాభపరిచే విధానం ‘ఓరిగో’.ఇద్దరు మిత్రులు కలిసి చేసిన ప్రయత్నం ఈ రోజు రైతుకు అండగా నిలిస్తుంది.దేశ వ్యాప్తంగా తమ సేవలను విస్ధరించాలనే ప్రయత్నం

0

వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశంలో రైతు పడే కష్టాలు తెలిసిందే ! నానా ఇబ్బందులు పడి వ్యవసాయం చేసినా.. దళారుల కారణంగా ఎంతో నష్టపోతుంటారు. ఇలాంటి దళారీ వ్యవస్ధను తొలగించి నేరుగా రైతును లాభపరిచే వ్యవస్థే ‘ఓరిగో’.

మయాంక్ ధనుక - 'ఓరిగో ' డైరెక్టర్
మయాంక్ ధనుక - 'ఓరిగో ' డైరెక్టర్

2010లో ప్రారంభమైన ‘ఓరిగో కమాడిటీస్’ను సనూర్ కౌల్, మయాంక్ ధనుకా స్ధాపించారు. చిన్నప్పటి నుండే పరిచయం ఉన్న ఆ ఇద్దరు ఐఐటీ (ఢిల్లీ) వరకు కలిసే చదువుకున్నారు. ఇక ఐఐటీ తరువాతే ఇద్దరు వేరే వృత్తులను ఎంచుకున్నారు. ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టిన మయాంక్, బ్యాంకింగ్ రంగంలో ఎనిమిదేళ్లు పనిచేసారు. ఇండియాలో తన కెరీర్‌ను ప్రారంభించి, సంవత్సరం తరువాత, హాంగ్‌కాంగ్ వెళ్లారు. అనంతరం కొలంబియాలోని బిజినెస్ స్కూల్‌లో చేరారు, న్యూయార్క్‌లో కొంత కాలం ఉద్యొగం చేసి, 2009లో తిరిగి ఇండియా వచ్చేసారు.

ఇక సనూర్ మాత్రం తన ఐఐటి పూర్తవ్వగానే, జెనరల్ ఎలక్ట్రిక్ (జీ.ఈ) లో చేరారు. అనంతరం మిషిగాన్ యునివర్సిటీ నుండి ఎంబిఏ చేసి తను కూడా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా మారారు.

అమెరికాలో మంచి కెరీర్ ఉన్నప్పటికీ ఇద్దరు మిత్రులకు కూడా ఇండియాలో తమ సొంత వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. మనసుకు నచ్చింది, సమాజంపై ప్రభావం చూపే పని చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఏం చేయాలో మాత్రం ఇద్దరికి తొచలేదంటారు మయాంక్. ఏం చేసినా , లాభాలతో పాటు ప్రభావం ఉండాలనేది ఇద్దరి ఆలోచన.

2009 లో ఇండియా చేరుకున్న ఇద్దరు కూడా ఆలోచనతో పాటు రిసర్చ్ చేయడం ప్రారంభించారు. తమ ఆలోచనలకు అనుకూలంగా ఉండే వ్యాపారం కోసం వేట మొదలు పెట్టారు. 

“5 నుండి 10 సంవత్సరాలు విదేశాల్లో ఉన్న మేము, ఇక్కడి మార్కెట్ అవసరాలతో పాటు లాభదాయకం ఏ రంగంలో ఎక్కువగా ఉందనే అంశాలపై పరిశోధన చేశాం. విద్యా, వైద్య రంగాలతో పాటు ఇతర చాలా రంగాలపై ఐడియా వచ్చినప్పటికీ, ఆయా రంగాల్లో ఇప్పటికే చాలా మంది ఉండడంతో వాటిపై మాకు ఆసక్తి కలగలేదు”- మయాంక్.

రోటీన్‌గా కాకుండా విభిన్నంగా ఉండాలని ఆలోచిస్తున్న ఈ ఇద్దరికి వ్యవసాయ రంగంలోని వేర్‌ హౌస్ ఫైనాన్స్‌ పై దృష్టి పడింది. తమ ఆలోచనలకు సానుకూలంగా ఉండటంతో పాటు, లాభదాయకం, అభివృధ్ధి, ప్రభావం ఉండే రంగంగా దీన్ని భావించారు.

వేర్ హౌజింగ్ రంగంలోని వివిధ క్లైంట్స్‌తో వ్యాపారం మొదలుపెట్టి, అనంతరం వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారుల తరుపున సమీకరించడం ప్రారంభించారు. జాతీయ వ్యవసాయ బ్యాంక్ మరియు, గ్రామీణాభివృద్ది సంస్ధ (NABARD)తో పొత్తు పెట్టుకోవడం ఎంతొ విజవంతమైంది. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తుల పట్ల రైతులకు అవగాహన కల్పించడంలో ఎంతో సహకారం దొరికిందని అంటారు మోహిత్.

సనూర్ కౌల్ 'ఓరిగో ' డైరెక్టర్
సనూర్ కౌల్ 'ఓరిగో ' డైరెక్టర్

ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, రాజస్దాన్ రైతులను వారి పనితీరు పై అవగాహన కల్పించిన ‘ఓరిగో’, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీగా ఎదిగింది. దళారీ వ్యవస్దను తొలగించి, రైతుని కొనుగోలుదారులతో కలపే ముఖ్య ఉద్దేశంతో ముందుకు సాగింది ‘ఓరిగో’. “మన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి కనీసం ఆరుగురు నుండి ఏడుగురు దళారుల మీదుగా వ్యాపారం జరుగుతోంది. అయితే ఇదంతా అంత సులువైన పని కాదు, చాలా మంది మధ్యవర్తులు, స్వార్ధపరులను ఎదురుకొని ఈ వ్యవస్ధని మార్చాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే ప్రతీ ఒక్కరూ లాభపడుతారంటున్నారు మయాంక్.”

350 వేర్ హౌస్‌లకు పైగా నడుపుతున్న ‘ఓరిగో కమాడిటీస్’ 16 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎన్నో సవాళ్లతో కూడిన ఈ రంగం కూడా లాజిస్టిక్స్‌తో కూడింది. ఈ రంగంలో ఓ బలమైన వ్యవస్ధను పటిష్టం చేయడం పెద్ద సవాలే అంటున్నారు ‘ఓరిగో’ వ్యవస్దాపకులు.


“నలుగురు చేయాల్సిన పనిని మేం ఒక్కరే చేస్తూ వ్యవస్ధను పటిష్టం చేస్తున్నాం. ఈ రంగంలో ఉన్న స్వార్ధపరులను ఎదురుకుంటూ... పని చేయడం కష్టమై పనే.” – మయాంక్.

ఇక భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న మయాంక్, “కొనుగోలుదారులు, రైతుల మధ్య సరైన సప్లై చైన్‌ని తయారు చేసే ఓ పఠిష్టమైన వ్యవస్ధను ఏర్పాటు చేయాలి. స్టోరేజ్‌తో పాటు ఫైనాన్స్ లేదా ఇతర సేవలు కూడా ఉంటాయంటున్నారు. ఇదంతా సరిగ్గా జరిగితే దళారి వ్యవస్ధ చాలా మేరకు తగ్గుతుందనేది వీళ్ల బలమైన నమ్మకం.

Sr. Correspondent @ yourstory.com

Related Stories