ఫండ్ సేక‌రించ‌డానికి పండంటి పన్నెండు సూత్రాలు

ఫండ్ సేక‌రించ‌డానికి పండంటి పన్నెండు సూత్రాలు

Sunday February 28, 2016,

6 min Read

ఏ సంస్థ విజయవంతంగా నడవాలన్నా ఆర్థికంగా పటిష్ఠంగా ఉండాలి. సంస్థ నిర్వహణలో అన్నిటికంటే కష్టమైన అంశం నిధుల సమీకరణ. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీల్లో నిధుల సమీకరణ చాలా కష్టం. స్టార్టప్ సంస్థ నిర్వాహకులు కూడా నిధుల సమీకరణ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఇన్వెస్టర్లను ఎలా ఆకర్షించాలా ఆలోచిస్తారు. తమ సంస్థను ప్రమోట్ చేసుకునేందుకు కాన్ఫరెన్స్‌లకు కూడా హాజరవుతుంటారు. ఎంతోకొంత నిధులు సమీకరించేందుకు గంటల తరబడి కృషి చేస్తుంటారు. అయితే ఈ విధానం సరైనది కాదంటారు ఉదయ్ రాజన్ గ్రూప్ వ్యవస్థాపకులు, ఏంజెల్ ఇన్వెస్టర్ ఉదయ్ నాయర్..

image


మరి, నిధులు ఎలా సమీకరించాలి, సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపై స్టార్టప్ నిర్వాహకులు తమ గేమ్ ప్లాన్‌ను డెవలప్ స్ట్రేటజీలను మార్చుకోవాల్సిన అవసరముంది. మార్కెట్‌లోకి సరైన దృక్పథం, మంచి నిర్మాణంతో వెళ్లాలి. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకోగలుగుతారు. ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న యువ ఎంటర్‌ప్రెన్యూర్స్ నిధుల సమీకరణకు 12 సూత్రాలను పాటించాలి. ఈ పన్నెండు సూత్రాలే సరిపోతాయని నేను అనడంలేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒకే కొలమానం సరిపోదు. ప్రతీ గేమ్ డిఫరంటే. మైదానంలో ప్రతి ఆటగాడు సందర్భాన్ని బట్టే మసులకోవాల్సి ఉంటుంది. కానీ ఈ పన్నెండు సూత్రాలు మాత్రం స్టార్టప్ నిర్వాహకులకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి.

స్టెప్1: యూనిక్ ఐడియా: 

ఒక్క ఐడియాతోనే నిధులు సమకూరవు. ఆ ఐడియాపై మరింత లోతుగా ఆలోచించాలి. ఆ ఆలోచనను పార్టులు పార్టులుగా విభజించాలి. అందులో అన్నిటికంటే విభిన్నమైనదేంటో గుర్తించాలి. ఎలాంటి సమస్యకు మీరు ఎలాంటి పరిష్కారం అందిస్తున్నారో గుర్తించాలి. మీ సంస్థ అందిస్తున్న అత్యంత విభిన్న ఫీచరేంటో మొదటగా గుర్తించాలి. ఇతరులను ఆకర్షించేందుకు ఆ యూనిక్ ఫీచరే (యూఎస్‌పీ) మీకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను మీ డెవలప్‌మెంట్ టూల్‌గా ఉపయోగించాలి. సమస్యేంటి? దానికి మీ పరిష్కారమేంటి? మిగతావాటికి లేని ప్రత్యేకత మీకేముంది? ఒక్క నిమిషంలో చెప్పగలగాలి.

స్టెప్2: నమూనాలుగా మార్చడం

మీరు గుర్తించిన యూఎస్పీని మీరు నిర్వచించగలగాలి. దాన్ని ఓ ప్రొటోటైప్‌ (నమూనా)గా అభివృద్ధి చేయాలి. ప్రొటోటైప్ అంటే పూర్తిగా శాంపిల్ ప్రాడక్ట్ అని అర్థం కాదు. మీ ప్రత్యేకమైన ఫీచర్‌ను పవర్ పాయింట్, ఫొటోషాప్ లేదా ఓ పేపర్‌పై తీసుకురావాలి. అప్పుడే ఇన్వెస్టర్లకు చూపించగలుగుతారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నదాన్ని ఇన్వెస్టర్లు ఇష్టపడతారు. దాంతోపాటు చిన్నపాటి యానిమేటెడ్ వీడియోను కూడా రూపొందించాలి. మీ ప్రాడక్ట్ ఏంటి? దాన్ని ఎలా వర్కౌట్ చేస్తారు ఇలాంటి వివరాలు అందులో ఉండాలి. సింపుల్ ఫ్లో చార్ట్ వీడియోలో చూపించాలి.

స్టెప్ 3: విభిన్నంగా ఆలోచించాలి: 

మీ నమూనాను రూపొందించిన తర్వాత దాన్ని బయటవ్యక్తుల దృష్టితో పరిశీలించాలి. ఈ నమూనా గురించి ఇతరులు ఏమనుకుంటారో తెలుసుకోవాలి. వారి అభిప్రాయాన్ని సేకరించాలి. ఆ అభిప్రాయాల్లో అత్యుత్తమంగా ఉన్నదాన్ని రికార్డు చేసి, శాంపిల్‌గా భద్రపర్చుకోవాలి. మార్కెట్ రిసెర్చ్ రిపోర్టును తయారు చేయడంలో భవిష్యత్‌లో ఇదెంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రాస్పెక్టివ్ కస్టమర్ మీ ప్రాడక్ట్‌ను ఎందుకు ఇష్టపడుతున్నాడు/ఇష్టపడటం లేదో తెలుసుకోవాలి. ఈ స్టెప్‌లో కస్టమర్ల ఆలోచనేంటో మీకు తెలుస్తుంది.

స్టెప్ 4: ఫంక్షనల్ నమూనా డెవలప్ చేయాలి:

నిధుల సమీకరణకు వెళ్లే చాలామందికి ఇది చాలా కష్టమైన, సవాలుతో కూడుకున్న స్టెప్. చిత్రాలతో కూడుకున్న నమూనాను ఫంక్షనల్ నమూనాగా మార్చడం అంత సులభం కాదు. దీన్ని చాలామంది అంగీకరిస్తారు. అంటే మీ ప్రాడక్ట్‌ను పూర్తిగా చూపించమని అర్థం కాదు. మీ ఐడియాలోని ప్రత్యేకమైనదాన్ని మీరు డెవలప్ చేయాలి. స్నేహితులు, వారి స్నేహితులు, మీ శ్రేయోభిలాషులు, ఇతరుల సాయంతో మీరు దీన్ని అభివృద్ధి పరచాలి. మీ ఆలోచనను భాగాలుగా చేసి, ఒక్కో భాగాన్ని ఒక్కో వర్గం ప్రజల సహకారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఐడియాకు రక్షణ ఉంటుంది. మీ ఐడియా బయటకు వెళ్లకుండా నిరోధించగలుగుతారు. ఆలోచనలు ఏ ఒక్కరి సొంతం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే మీ ఐడియాను డెవలప్ చేసుకునేందుకు డెవలపర్స్‌తో ‘నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్’ చేసుకోవాలి. ఫంక్షనల్ నమూనాను మీరే సొంతంగా డెవలప్‌ చేసుకోగలిగితే అంతకంటే మంచి విషయం మరోటి ఉండదు. అయితే ఇది చాలా ఉపయోగకరమైన అంశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

స్టెప్ 5: కస్టమర్‌ను సొంతం చేసుకోవడం: 

ఇది మరో సవాలు. మీ ప్రాడక్ట్‌ను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టమైన అంశం. ఇందుకోసం మీ దగ్గరున్న అన్ని అస్త్రాలను సంధించాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ నుంచి ట్విట్టర్, యూట్యూబ్, ఈమెయిల్స్ పంపడం, బ్లాగులలో రాయడం, న్యూస్ పేపర్స్‌లో ఆర్టికల్స్ రాయడం, టీవీల్లో వచ్చేలా చూసుకోవడం, ఇతర స్టార్టప్ యజమానులతో కలిసిమెలిసి వ్యవహరించడం, లాంచ్ పార్టీలు ఏర్పాటు చేయడం వంటివి చేపట్టాల్సి ఉంటుంది. మీ గురించి ఇతరులకు వీలైనంత ఎక్కువగా తెలిసేలా ప్రచారం చేయాలి. వీలైనంత ఎక్కువమంది కస్టమర్లు మీ గురించి తెలుసుకునేలా చేయడమే ఈ స్టెప్ ఉద్దేశం. ఇన్నీ చేసినా కస్టమర్లను ఆకర్షించలేకపోతే ఆందోళన చెందొద్దు. మళ్లీ బోర్డుపై స్టెప్ 1 నుంచి రాసుకోవాలి. తిరిగి పరిశీలించుకోవాలి. మళ్లీ డిఫైన్ చేసుకోవాలి. తిరిగి రూపొందించి, ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలి. తొలి దశలోనే అన్ని అనుకున్నట్టుగా జరగడం చాలా అరుదు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా ఈ స్టెప్ మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

స్టెప్ 6: వ్యూహాలను ద్రవ్యపర్చడం: 

ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసేందుకు మీ యూనిక్ ఐడియా ఎంత భారం మోస్తుందో మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. మీ యూనిక్ ఐడియా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ స్టేజ్‌లో మీరు బిజినెస్ మోడల్‌ను డెవలప్ చేయడంపై ఆలోచన చేయాలి. మీ నమూనా గురించి, అది ఆదాయాన్ని ఎలా సమకూరుస్తుంది అన్న అంశంపై మీరు దృష్టిసారించాలి. ఈ స్టేజ్‌లోనే మీ ఐడియాను బిజినెస్‌గా ఎలా మార్చాలో ఆలోచించాలి. ఇక్కడే మీ ప్రైమరీ, సెకండరీ, తాత్కాలిక స్టేక్‌ హోల్డర్స్‌ను గుర్తించగలగాలి. అప్పుడే స్టేక్ హోల్డర్స్ మీ బిజినెస్‌ను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లగలుగుతారు. ద్రవ్యవిధానం, ఫిస్కల్ పాలసీ, నిబంధనలు, ఎక్సైజ్, హెచ్‌ఆర్ రూల్స్ వంటివాటిపై స్టేక్ హోల్డర్స్ ప్రభావం ఎంతో ఉంటుంది. ద్రవ్యపరమైన వ్యూహాల్లో స్టేక్ హోల్డర్లను భాగస్వాములు చేయాల్సిన తరుణమిదే. ఈ స్టెప్‌లో మీరు మీ కాన్సెప్ట్‌ను భిన్న పారామీటర్లలో చూస్తూ, మీ పనులను ద్రవ్యపరం చేయాల్సిన అవసరముంది. మీ ఆధీనంలో లేని అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఈ దశలోనే లాభాలు ఆర్జించాలి. (లాభాలు కాకపోయినా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించగలగాలి). ఈ వ్యూహాలన్నీ అమలుపరిస్తే.. మరో దశకు చేరేందుకు కొంత నిధులను సమీకరించుకోవచ్చు.

స్టెప్ 7: మీ ప్రాడక్ట్‌ను అంచనా వేయండి: 

ఇక నుంచి మీ ప్రాడక్ట్‌ను ముందుకు తీసుకెళ్లగలుగుతారు. గత దశలను అనుసరించిన కారణంగా మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు వచ్చి చేరడం ప్రారంభమవుతుంది. మీ అవకాశాలను మరింత పెంచుకుని సరిహద్దులు దాటి వెళ్లేందుకు ఇదే సరైన సమయం. ఇవన్నీ అమలు చేయాలంటే ముందుగా మీ ప్రాడక్ట్‌ గురించి సరిగ్గా అంచనా వేసుకోవాలి. అంతేకాదు అవసరమైతే విస్తరించేందుకు వీలు చేసుకోవాలి. ఎన్ని నిధులు కావాలి? నిధుల సమీకరణ ఎందుకు, నిధులను ఎక్కడ పెడ్తారు? మరి ఆర్వోఐ ఎంత? ఇలాంటి వివరాలతో ఇన్వెస్టర్లను సంప్రదించే స్టేజ్ ఇదే. అలాగే ఊహాత్మక ప్రశ్నలకు కూడా జవాబులు సిద్ధంగా ఉంచుకోవాలి. అభివృద్ధి చెందేందుకు మీ గ్రౌండ్‌ను సిద్ధం చేసుకోవాలి.

స్టెప్ 8: క్రియేట్ పిచ్:

స్టెప్ వన్‌లో మీరు అభివృద్ధి చేసిన వ్యూహాన్ని బయటకు వివరించే దశ ఇదే. మీ ప్రాడక్ట్/ఫీచర్‌కు సంబంధించి మార్కెట్ రీసెర్చ్ ఆధారంగా సింపుల్ ప్రజంటేషన్ రూపొందించాలి. మీకు అనుకూలంగా ఉన్న అంశాలను హైలైట్ చేయాలి. ట్రాక్షన్ లెవల్స్, మార్కెట్ సైజ్, మార్కెట్‌లో మీ స్థానం గురించి ఎక్కువగా వివరించాలి. పెట్టుబడిదారులే కాదు.. వారి వెనుక ఉండి నడిపించేవారు సైతం మీ టీమ్‌ను నమ్మాలి. మీ సంస్థలో పెట్టుబడి పెడితే ఏంటి ఉపయోగం అన్న దాన్ని గుర్తించాలి. మీ బిజినెస్ మోడల్ లేదా ద్రవ్యపర వ్యూహాలపై విశ్వాసం పొందాలి. ఇవి చాలా ముఖ్యం.

స్టెప్ 9: డబ్బును వెతకాలి: 

అన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకున్న తర్వాత స్థానిక ఏంజెల్ నెట్‌వర్క్స్, లింక్డిన్, ‘యూనివర్సిటీ ఇంక్యూబేషన్ సెంటర్’ సహకారంతో యాక్సిలేటర్ ప్రోగ్రామ్‌లో చేరి, వ్యక్తిగత పరిచయాలు, ఎక్సోపోలలో పాల్గొనడం ద్వారా ఇన్వెస్టర్లను గుర్తించాలి. వివిధ రకాల సాధనాల ద్వారా కూడా మీ ప్రాడక్ట్‌ను ప్రచారం చేసి ఇన్వెస్టర్లను ఆకర్షించాలి.

స్టెప్ 10: డెలివరింగ్ ద పిచ్: 

వ్యాపారంలో నమ్మకమే అన్నిటికంటే ముఖ్యం. డబ్బు మీ చేతికి రావాలంటే నమ్మకమే కీలకం. ఈ దశలో మీకు కావాల్సింది ఇన్వెస్టర్లు మిమ్మల్ని నమ్మడం. ఇన్వెస్టర్ల వద్దకు వెళ్లినప్పుడు మీ షార్ప్‌నెస్, ప్రాడక్ట్‌పై మీకున్న అవగాహన, శ్రద్ధ, నాలెడ్జ్‌ను ప్రదర్శించాలి. నమ్మాల్సిన వ్యక్తులలో మీరు కూడా ఒకరని వారిని ఒప్పించాలి. అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని వారనుకోవాలి. మీ ప్రాడక్ట్ గురించి వివరించేందుకు సిద్ధమయ్యే ముందు మాక్ ఇంటర్వ్యూ నిర్వహించుకోవడం మంచి పద్ధతి. ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉండాలి. మీకు తపన ఉంటే సరైన వ్యక్తి వద్దకు సరైన సమయంలో చేరుకుంటారు. ఈ స్టేజ్‌లో మీకు ఒకే లక్ష్యం. అదే ఇన్వెస్టర్‌ను ఇంప్రెస్ చేయడం. అయితే తిరస్కరణలకు కూడా సిద్ధంగా ఉండాలి. పెట్టుబడులు రాబట్టాలంటే ఎంతోమంది ఇన్వెస్టర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. మీ సంస్థలు వారు పెట్టుబడులు పెడితే.. అదే ‘యురేకా మూమెంట్’.

స్టెప్ 11: లోపాలను సవరించడం: 

పెట్టుబడిని సమకూర్చుకునే ప్రయత్నంలో అన్ని రకాల ఎఫర్ట్స్‌ను పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఒక్కో లోపం బయటపడుతుంది. అంతర్గతంగా, బహిర్గతంగా మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను, ఇన్వెస్టర్లను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డెవలప్‌మెంట్‌కు, మార్కెటింగ్‌ కోసం నిధులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించరు. అంచనా దశలోనే వెంచర్‌లో పెట్టుబడి చేసేందుకే మొగ్గుచూపుతారు. లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకోవడం ద్వారా లేటెస్ట్ ట్రెండ్స్, మార్కెట్‌కు ట్యూన్ కాగలుగుతారు.

స్టెప్ 12: లయన్‌ హార్ట్: 

స్టార్టప్ నిర్వాహకులకు మంచి గుండె ధైర్యం ఉండాలి. అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు, పెట్టుబడిదారుల తిరస్కరణకు గురైనప్పుడు, మీమీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. మళ్లీ ప్రారంభించగలగాలి. ప్రతి తిరస్కరణా ఓ పాఠమే. ప్రతి వ్యాపారవేత్తా తిరస్కరణలకు గురైనవాడే. ‘‘ఎంత బలంగా మోదామన్నది కాదు.. ఎంత బలంగా కొట్టగలమన్నదే ముఖ్యం’’ అన్న రాకీ బల్బా కోట్‌ను గుర్తు చేసుకోవాలి. పడిపోతే తిరిగి లేవగలగాలి.

ఈ పన్నెండు స్టెప్స్ కేవలం మార్గదర్శకం మాత్రమే. ప్రతి సమయంలో, ప్రతి దశలో ఈ మార్గాలు సక్సెసవుతాయని కాదు. ఒక చోట పనిచేసిన సూత్రం మరోచోట పనిచేయకపోవచ్చు. ఈ సలహాలతో బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్లు భవిష్యత్ లీడర్లుగా ఎదగాలన్నదే నా ఉద్దేశం.

ఏంజెల్ ఇన్వెస్టర్‌ ఉదయ్ చెప్పిన సలహాలతో యువ పారిశ్రామికవేత్తలు గెలుపుబాటలో పయనించాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది.