నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్టార్టప్ ఇండియా ఆవిష్కారం

స్టార్టప్ ల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం-

స్టార్టప్ ల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, పథకాల ప్రకటన

0

స్టార్టప్... ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే మాట. చదువు ఆ తర్వాత ఉద్యోగం. ఇది గతం. సరికొత్త ఐడియా, చిన్నస్థాయి కంపెనీ.. ఇదీ నేటి యువతరం ఆలోచన. మెరుపు లాంటి ఆలోచనలకు రూపమిచ్చి కాలేజీ క్యాంపస్ దాటక ముందే ఎంట్రప్రెన్యూర్ గా మారుతున్నారు. కోరుకున్న రంగంలో దూసుకుపోతూ... మరికొందరికీ కొలువులిస్తున్నారు.

 భారతీయుల్లో ఉన్నంత క్రియేటివిటీ, స్కిల్స్ ప్రపంచంలో మరే దేశంలోనూ లేవేమో. అందుకే బడా బడా కంపెనీలన్నీ తమ వ్యాపారాలను మనవారికే అప్పజెప్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని యువతరం స్టార్టప్ ల వైపు అడుగులేస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10వేల వరకు స్టార్టప్స్ ఉండగా... 2020 నాటికి ఆ సంఖ్య లక్షకు చేరుతుందని అంచనా. అయితే సరైన గైడెన్స్, ప్రోత్సహం లేక చాలా స్టార్టప్స్ మూతపడుతున్నాయి. అంతేకాదు టాలెంట్ ఉన్నా నిధులు లేక ఆలోచనలు పక్కన పెట్టి ఏదో ఒక జాబ్ లో అడ్జస్ట్ అయిపోతున్నవారూ లేకపోలేదు. ఇలాంటి వారికి చేయూత ఇవ్వడంతో పాటు యువతలో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదమే స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా.

జనవరి 16న ప్రధాని నరేంద్రమోడీ స్టార్టప్ ఇండియాను ఆవిష్కరించనున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉదయం 9.30 కు ప్రారంభించనున్నారు. నిర్మలా సీతారామన్ గౌరవ అతిధిగా హాజరుకానున్నారు. యువర్ స్టోరీ తో పాటు దేశంలోని దాదాపు 1500 టాప్ స్టార్టప్స్ ఫౌండర్లు, సీఈఓలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. కార్యక్రమం ముగింపులో మోడీ స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ ను ప్రకటించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ “మన్ కీ బాత్” రేడియో ప్రోగ్రాంలో ప్రకటించినట్లుగా స్టార్టప్ ఇండియాకు సంబంధించి సమగ్ర కార్యచరణ ప్రణాళికను జనవరి 16వ ఆవిష్కరించనున్నారు. దేశంలో స్టార్టప్ ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలుచేయనున్నపథకాల గురించి అందులో ప్రస్తావించబోతున్నారు.

రోజంతా కొనసాగే ఈ ప్రోగ్రాంలో స్టార్టప్ ఏర్పాటుకు సంబంధించి గ్లోబల్ వర్క్ షాప్ తో పాటు పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్ అభివృద్ధి, విజయవంతంగా నడిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథలు, భారత్ భవిష్యత్తుపై డిజిటలైజేషన్ ప్రభావం, ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్ డెవలప్ మెంట్, ఆర్థిక చేయూత తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి.

“షో మీ ద మనీ: హౌ డు వి క్యాపిటలైజ్ ఎంట్రప్రెన్యూర్ షిప్” అనే అంశంపై జరగనున్న ప్యానెల్ డిస్కషన్ కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అధ్యక్షత వహించనున్నారు. “ఫేస్ టు ఫేస్ విత్ పాలసీ మేకర్స్” పేరుతో నిర్వహించనున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు రూపొందిస్తున్న వ్యవస్థకు సంబంధించి అడిగే ప్రశ్నలకు ప్రభుత్వంలోని కీలక శాఖలు, విభాగాలకు చెందిన ముఖ్యకార్యదర్శులు సమాధానాలిస్తారు.

స్టార్టప్స్ ల ప్రోత్సహించేందుకు, వాటి అభివృద్ధికి సహకరించే విషయంలో ప్రభుత్వ సంకల్పం, అందుకోసం ఏర్పాటు చేసే వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వానికున్న నిబద్ధతను పారిశ్రామికవేత్తలకు తెలియజేయడమే స్టార్టప్ ఇండియా కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. రెవెన్యూ, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్ మెంట్, కార్పొరేట్ అఫైర్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనమిక్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్స్ కు చెందిన సెక్రటరీలు ప్యానెల్ డిస్కషన్స్ లో పాల్గొననున్నారు. వీరితో పాటు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా... సెబీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..సిడ్బీ ప్రతినిధులు కూడా ప్రోగ్రాంకి అటెండ్ కానున్నారు.

స్టార్టప్ ఇండియాలో భాగంగా గ్లోబల్ లీడర్స్, వెంచర్ క్యాపిటలిస్టులు అయిన మసయోషి సన్ (సాఫ్ట్ బ్యాంక్ ఫౌండర్, సీఈఓ), ట్రావిస్ కలనిక్ (ఉబర్ ఫౌండర్), ఆడం న్యూమన్ (వి వర్క్ ఫౌండర్)తో ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక స్పెషల్ గెస్ట్ లుగా హాజరుకానున్న టాప్ 40 స్టార్టప్ సీఈఓలు, ఫౌండర్ల బృందం, వెంచర్ క్యాపిటలిస్టులు, సిలికాన్ వ్యాలీకి చెందిన ఏంజిల్స్ ఇన్వెస్టర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ డౌట్స్ క్లారిఫై చేయనున్నారు.

స్టార్టప్ ఇండియాలో భాగంగా గూగుల్ “లాంఛ్ ప్యాడ్ యాక్సెలేటర్” పేరుతో నిర్వహించనున్న సెషన్ యంగ్ ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టర్లను కలిపే వేదికలా పనిచేయనుంది. ఇక సాఫ్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్, సీఓఓ నికేష్ అరోరా స్టార్టప్ ఫండింగ్ కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయనున్నారు. కొన్ని స్టార్టప్స్ చేసిన వినూత్న, సరికొత్త ఆవిష్కరణలను వర్చువల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు.

స్టార్టప్ సంస్కృతిని పెంపొందించే ఈ కార్యక్రమానికున్న ప్రాధాన్యం దృష్ట్యా ఐఐటీలు, ఐఐఎంలు, నిట్, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 350 జిల్లాల్లోని యూత్ గ్రూప్స్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో భాగస్వాముల్ని చేయనున్నారు.

ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిపార్ట్ మెంట్... స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్న ఐ స్పిరిట్, యువర్ స్టోరీ, నాస్ కాం, షీ ది పీపుల్ డాట్ టీవీ, కైరోస్ సొసైటీ, ఫిక్కీ, సీఐఐ యూత్ వింగ్ తో కలిసి ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేస్తోంది.

Related Stories