స‌క్సెస్‌ఫుల్‌గా ‘స్టార్టప్-అ-థాన్’ టాలెంట్ హంట్

స‌క్సెస్‌ఫుల్‌గా ‘స్టార్టప్-అ-థాన్’ టాలెంట్ హంట్

Sunday January 31, 2016,

2 min Read

స్టార్టప్ ప్రారంభించి దానికి కో ఫౌండర్ గా ఎవర్ని పెట్టుకోవాలి. సిటీఓనే కో ఫౌండర్ గా మారిస్తే ఉపయోగం ఏంటి? ఫండింగ్ ఎలా సాధించాలి? స్టార్టప్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందా? ప్రాడక్ట్ మేనేజ్మెంట్ ఏరకంగా చేయాలి? లాంటి ఎన్నో విషయాలకు వన్ స్టాప్ సొల్యూషన్ నిలుస్తామంటున్నారు స్టార్టప్ అ థాన్ నిర్వాహకులు.

టాలెంట్ హంట్

సాధారణంగా స్టార్టప్ ప్రారంభం ఒకరితో లేదా ఇద్దరితో ప్రారంభమవుతుంది. కానీ అది సక్సెస్ కావాలంటే మరికొంతమంది అవసరం ఉంటుంది. కానీ ఆ మరికొంత మందిని గుర్తించడం ఈరోజుల్లో చాలా కష్టంతో కూడుకున్న పని. స్టార్టప్ లకు ప్రధాన సవాలు కూడా ఇదే. టీం బిల్డింగ్ చేయడాన్నివిజయవంతంగా పూర్తి చేస్తే కచ్చితంగా స్టార్టప్ ని జెట్ స్పీడ్ తో ముందుకు తీసుకెళ్లొచ్చు.

“సాధారణంగా స్టార్టప్ విస్తరణకు ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది, కానీ మేం తొందరగా చేయగలం,” రాజీవ్ లుల్లా

ఆస్క్ ఫండింగ్ డాట్ ఇన్ డైరెక్టర్ అయిన రాజీవ్ లుల్లా స్టార్టప్ లను తొందరగా ముందుకు తీసుకెళ్లే స్ట్రాటజీలు తమ దగ్గరున్నాయన్నారు. దీనికి సరైన టీం ఫాం చేయడం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. తాము చేపట్టిన స్టార్టప్ అ థాన్ కూడా ఇదే నన్నారు.

image


ఐడియాలు బోలెడు

బండిల్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనే స్టార్టప్ సక్సెస్ ఆధారపడి ఉంది. దానికోసం ప్రత్యేకమైన ఫార్ములా ఉంటుంది. దీంతో పాటు స్టార్టప్ మార్కెట్ వాల్యూమ్ తెలుసుకొని అడుగేయాలని క్వికర్ డాట్ కామ్ సిటీవో మనోజ్ శర్మ అన్నారు.

“స్టార్టప్ లకోసం మేం ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించాం,” మనోజ్

తాము ప్రారంభించిన వెబ్ సైట్ లో 500లకు పైగా సభ్యులున్నారని అన్నారాయన. ఆలోచనల్ని పూర్తి స్థాయి సంస్థలుగా మారడానికి కావల్సిన సంకేతిక సహకారం తామిస్తామన్నారు.

image


కొత్త ఆలోచనలు

ఇటీవల ప్రారంభమైన జిల్ మోర్ స్టార్టప్ ఫౌండర్ సారధి బాబు మాట్లాడుతూ ఆర్టిస్టులకు తమ ప్లాట్ ఫాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీన్ని వినియోగించుకోవాలని కోరారు.

“వేయి మంది లాగిన్ అయ్యారు, వేల సంఖ్యలో డౌన్ లోడ్స్ అవుతున్నాయి,” సారథి

యాప్ మొదలు పెట్టిన రెండు నెలల్లోనే ఎంతో బాగా ఆదరణ పొందిందని సారథి చెప్పుకొచ్చారు. తెలుగు తో పాటు కొన్ని భాషల్లోనే అందుబాటులో ఉన్న దీన్న దేశంలో ఉన్న అన్ని భాషల్లోకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్టార్టప్ ల మధ్య పోటీ ఏర్పాటు చేసి, అందులో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. స్టార్టప్ అ థాన్ 1.0 గా దీన్ని చెప్పుకొచ్చిన నిర్వహాకులు -భవిష్యత్ లో మరిన్ని చేపడతామన్నారు.