ప్రతిరోజూ డ్రైవింగ్ చేసే భారాన్ని తగ్గించే పూల్ సర్కిల్

రేడియోక్యాబ్ సర్వీసులో ఫ్యూయెల్ షేర్ వినియోగదారులకు కొత్త ఆప్షన్లుపూల్ సర్కిల్ తో కలర్ ఫూల్ డ్రైవ్కార్ పూల్ తో కార్పోరేట్ సెక్టార్ లో కొత్త ఉత్సాహం

ప్రతిరోజూ డ్రైవింగ్ చేసే భారాన్ని తగ్గించే పూల్ సర్కిల్

Friday May 08, 2015,

3 min Read

ఒంటరిగా కార్ లో ఆఫీసులకు వెళ్లే కార్పోరేట్లు, ఐటి నిపుణులకు జీవితాలకు పూల్ సర్కిల్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. వారితో ఇంకొందరిని కలసి ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ప్రత్యక్ష నరకం లాంటి ట్రాఫిక్ లో రోజు డ్రైవ్ చేసే బాధను తప్పించింది. అదెలాగంటే ఈ స్టోరీ చదవాల్సిందే. బెంగుళూరు ట్రాఫిక్ కి మించిన నరకం వేరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. కానీ ప్రతి రోజూ నరకంలో డ్రైవింగ్ ను తప్పించే ప్రయత్నం చేస్తోంది పూల్ సర్కిల్. వేలు లక్షలు దాటుతోన్న కార్ల సంఖ్యను తగ్గించే ఓ సదుద్దేశం దాగి ఉంది ఇందులో. రైడ్ షేరింగ్ నెట్ వర్క్ ద్వారా మన కలిగ్స్ , నైబర్స్, ఇతర ప్రొఫెషనల్స్ తో కలసి ఆఫీసుకు వెళ్లే అవకాశం కలుగుతుంది. నిరుడు యువర్ స్టోరీతో మాట్లాడిన పూల్ సర్కిల్ ఇప్పుటికి ఎంతగానో పెద్దదైంది. అంతకు మించి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ నెట్ వర్క్ లో 17వేల మంది యూజర్లు ఉన్నారు. వీరంతా వారం పొడవునా యాక్టివ్ గా ఉంటున్నారు. కార్ పూల్(carpool) లో నమోదు చేసుకున్న వారి ఆధారంగా పై లెక్కలు తేల్చారు.గడిచిన తొమ్మిది నెలల్లో పూల్ సర్కిల్ యూజర్ బేస్ దాదాపు ఆరురెట్లైంది. టెక్ పార్క్ లకు సంబంధించి కార్ పూలింగ్ కోసం బెంగుళూరు ట్రాఫిక్ పోలీస్ , ఎంబసీ గ్రూప్ లతో కలసి పనిచేస్తోందీ సంస్థ. పూల్ సర్కిల్ సైతం ఎర్నస్ట్ అండ్ యాంగ్ తో చేతులు కలిపింది. సురక్షిత విషయంలో పూల్ సర్కిల్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ట్రస్ట్ పాయింట్ పేరుతో రేటింగ్స్ సిస్టమ్ ని తయారు చేసి దాన్ని యూజర్లకు ఇస్తోంది. దీంతో వారికి కూడా గుర్తింపు వచ్చినట్లవుతోంది.

image


కస్టమర్ సేటిస్ఫేక్షనే ప్రధాన లక్ష్యంగా మేం ముందుకు పోతున్నాం. కస్టమర్ అవసరం మా ప్రాడక్ట్ కు ఓ షేప్ లోనికి తీసుకొస్తుంది. కస్టమర్లతో మాట్లాడుతుంటే దాదాపు 20శాతం మంది కొత్త అంశాన్ని ప్రస్తావిస్తారు. మేం బిటుసి ప్లాట్ఫామ్ లో ఉన్నప్పటికీ ఇది తప్పడం లేదనేది ఫౌండర్ లో ఒకరైన రఘు అభిప్రాయం.

కస్టమర్ల తో సంప్రదింపులు జరిపినప్పుడు తాజాగా ఓ కొత్త విషయం అందరి నోటా విన్నా. ఫ్యూయల్ షేర్ విషయంలో మరింత స్థిరమైన నిబంధన ఉండాలంటారు. కార్ ఓనర్ కు ఫ్యూయల్ డబ్బులు రిపీటెడ్ గా ఇస్తుండటంతో స్టాండర్డ్ ఫ్యూయల్ షేర్ తెరపైకి వచ్చింది. కిలోమీటర్ కు 5రూపాయిలు చొప్పున్న కార్ ఓనర్ వసూల్ చేయొచ్చు. ఈ విషయంలో పూల్ సర్కిల్ ఎలాంటి ఫీజు కానీ, ఎలాంటి కమిషన్ కానీ వసూల్ చేయదు. కార్ ఓనర్ విషయానికొస్తే నెలసరి ఫ్యూయల్ కాస్ట్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పాసింజర్ విషయంలో అయితే సేఫ్ అండ్ కంఫర్టబుల్ ట్రావెల్ ఆఫ్షన్ పొందుతున్న దాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. క్యాబ్ చార్జీలో సగంకంటే తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యం పొందుతున్నారన్న మాట. “ స్ట్రాంగ్ బేస్ తో మేం నిర్మించిన సురక్షిత, నమ్మదగిన మరో విషయం ఏంటంటే.. ఇది ఒక ఆర్థిక విజయం(ఎకనామిక్ విన్). కార్ ఓనర్ తోపాటు పాసింజర్లు ఇద్దరూ ఇక్కడ విజేతలే కదా,” అన్నారు రఘు.

image


కొన్నేళ్లుగా రేడియో క్యాబ్ ఇండస్ట్రీ ఆశించిన స్థాయిలో దూసుకు పోతోంది. పూల్ సర్కిల్ కి నమ్మదగిన కస్టమర్లు ఉన్నప్పటికీ కొన్ని అసమర్థతను మనం గుర్తించొచ్చు. కొన్ని కార్లు ఒక్క పాసింజర్ తోనే నడుస్తున్న విషయం కలవర పెట్టేదే. మేం ఇంకా మాస్ వ్యాల్యూని తీసుకు రాలేదనే చెప్పొచ్చు. ఇప్పటికీ ఒక్కరే కార్ లో ఆఫీసుకు వెళ్లాలనుకుంటున్నారు. నలుగు కలిగ్స్ లేదా కొంతమందితో ప్రయాణం చేయాలని తమంతట తాముగా ఆలోచించనంత వరకూ దీన్ని అధిగమించలేమనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు రఘు.

దేశం మొత్తం మీద దాదాపు 35మిలియన్ల వ్యక్తిగత కార్లున్నాయి. వీరంతా ఇనిషియేట్ తీసుకొని దీన్ని పరిష్కరించాలని. 200 మిలియన్ భారతీయులు ప్రతిరోజు వేరు వేరు పనుతో ప్రయాణం చేస్తున్న విషయం మనం గుర్తించాలి. ఈ డిమండ్ కు పరిష్కారం వ్యక్తిగత కార్ల ఓనర్ల చేతిలోనే ఉంది.ఇటీవల సింగపూర్ లో కొత్త చట్టం వచ్చింది. కార్ ఓనర్లు కార్ పూలింగ్ చేయడం తప్పని సరి. లేదంటే వారు అదనపు రుసుం కట్టాల్సిదే. భారత్ లో కూడా ఈ రకమైన మార్పు రావాలని కార్ పూల్ సర్కిల్ ఆశిస్తోంది. “ ఇలాంటి, దీనికి దగ్గరగా ఉండే కొన్ని న్యాయసూత్రాలను ఇండియాలో తీసుకువచ్చే దిశగా తాము కూడా సంప్రదింపులు జరుపుతన్నాం,” అని రఘు వివరించారు.

“ జనంలో చైతన్యం వస్తుందని మేం నమ్ముతున్నాం. ఎకానమి షేరింగ్ చేసుకొనే విధంగా జనం ఆలోచన దోరణిలో మార్పు రావాలి. ఫ్యూయల్ ఫాస్ట్ గ్రోత్ పై ఫండింగ్ కోసం తాము ఒకరిద్దరి వెంచర్ క్యాపిటలిస్టులతో సంప్రదించి నట్లు ఆయన చెప్పుకొచ్చారు.