రూ.5000 కోట్ల స్టార్టప్ విజేత ప్రేమ్ జైన్

ఇన్సీమ్ నెట్వర్క్ విజయగాధకోట్లు కుమ్మరించి స్టార్టప్ కొన్న సిస్కోఫండింగ్ చేసిన కంపెనీకే సిఈఓగా ఎదిగిన వైనంస్టార్టప్స్ కు ఇస్తున్న అద్భుతమైన సలహాలు

0

సిస్కో 2012 ఏప్రిల్ నెలలో తమ ఇంజినీర్లు సొంతంగా రూపొందించిన స్టేల్దీ మోడ్ స్టార్ట్ అప్ ఇన్సీమ్ నెట్వర్క్స్ లో 100 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.600 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఇన్సీమ్ నెట్వర్క్స్ కంపెనీని 2013 నవంబర్ 6 వతేదీన ప్రారంభించారు. ఆ వెంటనే ఆ కంపెనీని 863 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 5,200 కోట్లు) సిస్కో కొనేసింది. ఇది సాఫ్ట్ వేర్ నిర్వచిత నెట్వర్కింగ్ (ఎస్ డీ ఎన్) విస్తరించేందుకు సిస్కో తీసుకున్న నిర్ణయంగా అందరూ భావించారు. అయితే, ఇన్సీమ్ నెట్వర్క్స్ వ్యవస్థాపకులు ప్రేమ జైన్, మారియో మొజల్లా, లూకా కాఫిఎరో ఈ విజయం గతానికి ప్రతిబింబం మాత్రమే. 2008 వారు స్థాపించిన డేటా సెంటర్ నువోవా సిస్టమ్స్ ను కూడా సిస్కో ఇలానే అక్వైర్ చేసింది.

ఇటీవల ఇన్సీమ్ నెట్వర్క్స్ వ్యవస్థాపకులు ముగ్గురిలో ఒకరైన ప్రేమ జైన్ తో యువర్ స్టొరీ మాట్లాడింది. జైన్ బిట్స్ పిలాని పూర్వ(1968 బ్యాచ్) విద్యార్ధి. సిస్కోలో జైన్ కెరీర్ 1993 లో డైరెక్టర్ ఇంజనీర్ గా ప్రారంభ మైంది. అప్పుడే, సిస్కో , క్రీసెండో కమ్యూనికేషన్స్ ను అక్వైర్ చేసింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా రిటైర్ అయిన తర్వాత జైన్ సిస్కో సీఈఓ జాన్ చాంబర్స్ కు సలహాదారుగా ఉన్నారు. ప్రేమ్ జైన్ పెద్దగా మాటల మనిషి కాదు. అయితే అయన మాట్లాడే ప్రతి మాట యువ పారిశ్రామిక వేత్తలకు మంత్రోపదేశం లాంటిదే . అయన జీవిత విశేషాలు, అయన జీవితంలో ఆచరించిన విలువలు, నేర్చుకున్న పాఠాలు, ఎదురుకున్న సవాళ్ళపై సంక్షిప్త సమాచారం.

జైన్ సిస్కో సీఈఓ
జైన్ సిస్కో సీఈఓ

కుటుంబ నాలుగు గోడలు దాటి.. యూరప్ పయనం

ప్రేమ్ జైన్ తల్లి తండ్రులు ఆయన్ని గౌరవ - మర్యాదలు, వినయ- విధేయతలు, నీతి - నిజాయతి గల వ్యక్తిగా పెంచారు. ఆయనకు అయన శక్తి సామర్ధ్యాలు చాలా చక్కగా తెలుసు. తనలోని బలహీనతలు ఆయనకు బాగా తెలసు. బిట్స్ పిలానిలో చదువుతున్న సమయంలోనే తొలిసారిగా ఆయనకు ప్రపంచం పరిచయమయింది లేదా ప్రపంచానికి ఆయన పరిచయం అయ్యారు. బిట్స్ పిలానిలో చదువుకోవడం ఆయనకు గొప్ప అనుభవంగా మిగిలిపోయింది. వివిధ నేపధ్యాల నుంచి వచ్చినవారితో కలిసి మెలిసి జీవించడం ఇక్కడే నేర్చుకున్నారు. బిట్స్ పిలానిలో, డాక్టర్ మిత్రా, డాక్టర్ హాండమ, డాక్టర్ నాగరత్ ల సారధ్యంలో చదువుతో పాటుగా నాయకత్వ లక్షణాలు, వ్యాపార గుణగణాలు నేర్చుకునే అవకాశం లభించింది. బిట్స్ పిలానిలో అనేక ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నాప్రేమ జైన్ జీవితంలో మరిచి పోలేని మధుర ఘట్టం మాత్రం యూరప్ టూర్. అంతేకాదు ఈ అద్భుత అనుభవాన్ని జైన్ ఐదేళ్ళలో నాలుగు మార్లు అనుభవించారు. ఆయన కేవలం వివిధ సంప్రదాయాలను తెలుసుకుని వదిలేయలేదు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎలా బతకాలో నేర్చుకున్నారు. ఇంతకు ముందు చేయని అనేక పనులు చేసే ధైర్యం ఆయనకు ఈ పర్యటనలలో లభించాయి.

అక్కడి నుంచి జీవిత పాఠాలు

అక్కడి నుంచి ప్రేమ్ జైన్ యు. డవిస్ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్ళాడు. ఆతర్వాత అక్కడే బీఎన్నార్ లో మెంబర్ అఫ్ సైంటిఫిక్ స్టాఫ్ గా ఆ తర్వాత డేవిడ్ సిస్టమ్స్ లో డైరెక్టర్ అఫ్ ఇంజనీరింగ్ గా పనిచేసారు. సిస్కో సంస్థ క్రేస్సెందోను అక్వైర్ చేసిన సమయంలో ప్రేమ్ జైన్ అందులో ఉన్నారు. అలా టెక్నాలజీ జైంట్ సిస్కో తో ఆయనకు అనుబంధం ఏర్పడి , కాల గమనంలో అది ఫలప్రదమయింది. ఇంత వరకు అయన నేర్చుకున్న వృత్తి పరమైన అనుభవాలను అయన ఇలా పంచుకుంటున్నారు.

* నువ్వు ఏది చేసినా, దాని ప్రభావం పరిశ్రమపై ఉండేలా ముందుగానే నిర్దేశించుకో ..
*తప్పులను ఒప్పుకో.. వాటిని దిద్దుకుని ముందుకు సాగు.. ఈ సర్కిల్ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పూర్తి చేసుకో..
*ఎప్పుడు నేల మీదనే నిలబడు ... ఆకాశంలో నక్షత్రం కావాలని అనుకోకు.. అలాంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. రాలిపోయే ప్రమాదం ఎప్పుడు పొంచే ఉంటుంది.

యువ పారిశ్రామిక వేత్తలు ఏమి చేయాలి ? ఏమి చేయకూడదు ?

ప్రేమ్ జైన్ తన జీవితంలో నేర్చుకున్న పాఠాల సారాన్నిరంగరించి యువపారిశ్రామిక వేత్తలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలను పొందు పరిచారు. ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే తను పరిశ్రమలో ప్రవేశించిన దానికంటే ముందుగానే అడుగు ముందుకు వెయవలసింది అని ప్రేమ్ జైన్ అంటారు. ఎందుకంటే, తాను ఎప్పుడు రెడ్ టేపిజంలేని వాతావరణంలో పని చేయాలని కోరుకుంటారు.

తొలి సారిగా పరిశ్రమలో కాలుపెట్టే వారు

  • మీకు ఒక ఆలోచన ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకునేందుకు తిగా అలోచించొద్దు. ముందు ఆలోచను ఆచరణలో పెట్టి .. పని ప్రారంభించు.
  • మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు .
  • కాపీ చేసే ప్రయత్నం ఎన్నటీకీ వద్దు. ఓడి పోతే బాధ పడకు, మేము అద్భుతమైన తొలి టెక్నాలజీ ప్రోడక్ట్ ను మార్కెట్ లో కి విడుదల చేసినప్పడు తొలిప్రయత్నం లో ఫెయిల్ అయ్యాం.
  • నిజాయితీగా ఉండు, నీ తప్పులను నువ్వు తెలుసుకో ..తప్పని తెలిసిన వెంటనే చేసిన తప్పును దిద్దుకో. టీం మేట్స్ ఒకరినొకరు అభినందించుకుంటూ ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం పెంచుకోవాలి. అహంకారాన్ని ఆమడ దూరంలో ఉంచి ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్నామని మరిచి పోవద్దు.

మన దేశంలో తొలి అడుగులో తడబాట్లు
అవగాహన.. ముందుగా మీరు పరిష్కరిస్తున్న సమస్యను, మీ వినియోగదారుడు ఎవరో తెలుసు కోవాలి. ఈ విషయంలో మీరు వాస్తవాలకు దగ్గరగా ఉండాలే గానీ అత్యాశకు పోరాదు. నాకే అన్ని తెలుసు అన్న భావన అసలే మంచిది కాదు.

అలల మీద కాదు .. ముందుగా ..

  1. అలల కంటే ముందుగా అడుగు వేయాలంటే మీరు ప్రతిక్షణం క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉండాలి . కొత్త విధాలను ఎప్పటి కప్పుడు మీలో మిళితం చేసుకుని ముందుకు సాగండి. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టండి, ఇతరులను అనుసరించకండి.
  2. ఒకమంచి గురువును ఎంచుకుని వారి సూచనలు పాటించండి. మీపై మీకు సంపూర్ణ విశ్వాసం ఉండేలా చూసుకోండి.
  3. డబ్బు సంపాదనకే కాకుండా ప్రభావాన్ని చూపేందుకు పరిశ్రమల స్థాపించండి. వృత్తిని మనం గౌరవిస్తేనే ఇతరులు మనల్ని గౌరవిస్తారు.

తుది పలుకులు ...

భారతీయ యువతకు ప్రేమ్ సందేశం ...మీరు చేసే పని ఏదైనా ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేయండి. ఒకసారి పని ప్రారంభించాక వెనక్కి తిరిగి చూడొద్దు. విజయం తధ్యమన్న విశ్వాసంతో ముందుకు సాగండి. పరిశ్రమలో కాలు పెట్టేందుకు ఎప్పుడూ సమయం మించి పోదు .

మీరు కూడా మీ ప్రయాణంలో ఏం నేర్చుకున్నారో మాతో పంచుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం...!