ఆన్ లైన్ డీల్‌లో అద‌ర‌గొడుతున్న‌ ఫ్రీకామాల్

నాలుగున్నర నెలల్లోనే 2లక్షల యూజర్లు

ఆన్ లైన్ డీల్‌లో అద‌ర‌గొడుతున్న‌ ఫ్రీకామాల్

Tuesday July 21, 2015,

2 min Read

2010. ఈ కామ‌ర్స్ గాలి వీస్తున్న రోజులు. అంద‌రి నోటా అదే మాట‌. అంద‌రి కామ‌న్ ఇంట్ర‌స్టింగ్ టాపిక్ కూడా అదే. ట‌న్నుల కొద్దీ ప్రాడ‌క్ట్స్. కోట్ల కొద్దీ బిజినెస్. రోజువారీ డీల్స్. ఇవే చ‌ర్చ‌లు. అంద‌రికంటే ర‌వి కుమార్ ఈ విష‌యం గురించి ఇంకా ఎక్కువ ఆలోచించాడు. డీల్స్, కూప‌న్ల‌తో బిజినెస్ చేస్తే ఎలా వుంటుంది? మైండ్ లో ర‌ఫ్ ఐడియా! వ‌ర్క‌వుట్ చేస్తే -ఫ్రీ కా మాల్ డాట్ కాం పిక్సెల్ క్లియ‌ర్‌గా వ‌చ్చింది. అయితే క్యాష్ క‌రో, కూప‌న్ రాణి లాంటి కాంపిటీట‌ర్ల‌ను త‌ట్టుకుని ర‌వికుమార్ ఎలా విజ‌యం సాధించాడో తెలుసుకోవాలంటే అత‌ని క‌థ చ‌ద‌వాల్సిందే!!

ఇది మొదలు

ర‌వికుమార్‌ది సాధార‌ణ‌ మధ్యతరగతి కుటుంబం. నోయిడా జేఎస్ఎస్ అకాడెమీ నుంచి ఇంజినీరింగ్ పూర్త‌యింది. త‌ర్వాత ముంబైలో ఎంబీయే. అప్పుడే గాటీ లిమిటెడ్ లో జాబ్ ఆఫ‌ర్ వచ్చింది. కానీ అందులో జాయిన్ అవ‌డం ఇష్టం లేదు. ఎందుకంటే ఉద్యోగం చేయ‌డంకంటే సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాల‌న్న‌దే మ‌నోడి లక్ష్యం. ఆ రోజుల్లో అంతా ఈకామర్స్ గురించే మాట్లుడుకునేవారు. ప్రాడక్టుల గురించీ, డీల్స్ గురించి చర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతుండేవి. అప్పుడే వ‌చ్చింది ఫ్రీకామాల్ డాట్ కామ్ ఐడియా. ఏమాత్రం ఆలోచించ‌లేదు. రూ. 1500 ప్రారంభ పెట్టుబడితో అడుగు ముందుకు వేశాడు. ఏడాదిలో సైట్ బాగా పాపుల‌ర్ అయింది. మే2, 2012 లో గ్రాటికల్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాడు.

రవి కుమార్ , ఫౌండర్

రవి కుమార్ , ఫౌండర్


ఫ్రీకా మాల్ టీం

టీంలో చాకుల్లాంటి కుర్రాళ్లు 17మంది ఉన్నారు. ఆపరేషన్ నుంచి మార్కెటింగ్ దాకా ప్రతీది హ్యాండిల్ చేస్తారు. వారంతా గతంలో ఐడియా, మోన్ స్టర్ లాంటి ఎమ్మెన్సీ కంపెనీల నుంచి వచ్చిన వారే. దేశంలోని ఈ కామర్స్ గురించి మాట్లాడితే కచ్చితంగా ఫ్రీకా మాల్ డాట్ కామ్ గురించి ప్రస్తావించాల్సిందే. డీల్స్ అండ్ కూపన్స్ కు ఇది సెకండ్ ఐడియా లాంటిది. మొదట్లో ఫ్రీ కామాల్ ప్రాడక్టుల్లో ఉండే డీల్స్ కు సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చింది. ఇప్పటికీ ఈ మోడ్ ని మార్చకుండా మరికొన్ని ఫీచర్స్ ను యాడ్ చేశారు. షాపర్స్ వారి డీల్స్ గురించి వివరిస్తే దాన్నుంచి బెస్ట్ డీల్ సెలెక్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. అలా ప్రారంభమైన సంస్థ‌ మూడున్నరేళ్ల ప్రయాణం తర్వాత నెలకు 4.5 మిలియన్ విజిటర్లు కలిగిన కంపెనీ స్థాయికి చేరింది. 

భారతీయ ఈ కామర్స్

భారతీయ ఈ కామర్స్ మార్కెట్ అనుకున్న దానికంటే ఎక్కువే పెరిగింది. ఇంటర్నెట్ వాడకందార్లు పెరిగారు. దాంతో పాటే ఈ కామర్స్ యూజర్ల సంఖ్య కూడా పెరిగింది. వచ్చే మూడేళ్లలో 8 బిలియన్ల మార్కెట్ గా భారతీయ ఈ కామర్స్ బిజినెస్ ఉంటుందని అంచనా. మా వ్యాపారం కూడా ఈ కామర్స్ తోపాటు పెరుగుదంటాడు ర‌వి కుమార్‌. ఇదిలా ఉంటే భారతీయ కంపెనీలకు పోటీగా ఇతర అంతర్జాతీయ కంపెనీలు ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నాయి. గతేడాది అమెజాన్ డాట్ ఇన్ . ఈ ప్రపంచ స్థాయి కంపెనీలు అఫ్లియేషన్ వైపు చూస్తున్నాయి. ఫ్రీ కా మాల్ ఈ అఫ్లియేషన్ తో 20 శాతం లాభాలను గడించింది. ఇలా గ్లోబల్ కంపెనీల అఫ్లియేషన్ తో మాలాంటి భారతీయ కంపెనీల‌కు లాభం బాగానే ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు రవికుమార్.

image


ప్రత్యేకంగా ఇన్వెస్టర్ అక్కర్లేదు

ఫ్రీకామాల్ అనేది బూట్ స్ట్రాపెడ్ కంపెనీ. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కానీ, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ ఫండ్స్ ఎప్పుడూ రెయిజ్ చేయలేదు. రోజుకి 1500 లకు పైగా ట్రాన్సాక్ష‌న్లు జరుపుతున్నారు. మొదటి రోజు నుంచే మేం లాభాలను ఆర్జిస్తున్నాం. నెలకి నాలుగున్నర మిలియన్ల హిట్స్ ని సాధిస్తున్నాం. ప్రస్తుతం మేం 450కి పైగా మర్చంట్ లతో కలసి పనిచేస్తున్నాం. కాబ‌ట్టి మాకు ప్రత్యేకంగా ఇన్వెస్టర్ అక్కర్లేదని ముగించారు రవికుమార్.