టెక్నాల‌జీ, మాన‌వ‌సంబంధాలు కలగలిసిన సూప‌ర్‌సూట్!

టెక్నాల‌జీ, మాన‌వ‌సంబంధాలు కలగలిసిన సూప‌ర్‌సూట్!

Tuesday January 12, 2016,

2 min Read

ఆధునిక‌త‌, అభివృద్ధి, నాగ‌రిక‌త‌. వీట‌న్నిటితో పాటు పెరుగుతున్న‌ది, మాన‌వ‌జాతిని త‌రుముకొస్తున్న స‌మ‌స్య‌ ఒక‌టుంది. అదే త‌రిగిపోతున్న మాన‌వ‌సంబంధాలు. నిద్ర‌లేస్తే ఉరుకుల ప‌రుగుల జీవితంలో బిజీ అయిపోతున్న నేటిత‌రం కంప్యూట‌ర్ల ధ్యాస‌లో ప‌డి మ‌నిషితో మాట్లాడాల‌న్న విచ‌క్ష‌ణ‌ను కోల్పోతోంది. పిల్ల‌లూ అదే ఫాలో అవుతున్నారు. కంప్యూట‌ర్ వీడియోగేమ్స్ మాయ‌లో ప‌డి బాహ్య‌ప్ర‌ప‌పంచంతో.. చుట్టుప‌క్క‌ల జ‌నంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోలేక‌పోతున్నారు. ఫ‌లితంగా పిల్ల‌ల్లో మాన‌సిక వికాసం లోపిస్తోంది.

image


పిల్ల‌ల‌కు ఆట‌లు ముఖ్య‌మే. మాన‌సిక ఎదుగుద‌ల‌కు అవి ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి. కానీ.. పాత‌కాలంలోలా తోటిపిల్ల‌ల‌తో గ‌డ‌ప‌దాటి ఆడుకుంటేనే అది సాధ్య‌మ‌వుతుంది. దీన్ని గుర్తించిన ఓ కంపెనీ.. టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటూనే.. పిల్ల‌ల్లో మాన‌సిక చైత‌న్యాన్ని అల‌వ‌ర్చే డివైజ్‌ల‌ను త‌యారుచేస్తోంది.

మ్యాడ్‌ర్యాట్ గేమ్స్ తాజాగా ఓ సూప‌ర్‌సూట్‌ను త‌యారుచేసింది. కేవ‌లం పిల్ల‌లే కాదు. పెద్ద‌వాళ్లూ ఈ సూట్ త‌గిలించుకుని పాత‌కాలంలోలా ఇంటిబ‌య‌ట స‌ర‌దాగా ఆడుకోవ‌చ్చు. ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోవ‌చ్చు, అన్ని గాడ్జెట్స్‌తో క‌నెక్ట్ అయి ఆడుకోవ‌చ్చు. ఫిజిక‌ల్ యాక్టివిటీస్‌లో పాల్గొన‌చ్చు. అయితే, ఇందులో టెక్నాల‌జీ పాత్ర ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కంప్యూట‌ర్ ముందు కూర్చుని ఆట‌లాడాల్సిన ద‌రిద్ర‌మైన అల‌వాటును ఈ సూప‌ర్‌సూట్ దూరం చేస్తుంది.

త‌రిగిపోతున్న మాన‌వ‌సంబంధాల‌ను పున‌ర‌ద్ధ‌రిస్తూ.. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేలా దీన్ని డిజైన్ చేసింది కంపెనీ. రాబోయే రోజుల్లో ఈ సూప‌ర్‌సూట్‌కి పిల్ల‌లు ఖ‌చ్చితంగా అడిక్ట్ అవుతార‌ని అంటున్నారు దీన్ని త‌యారుచేసిన కంపెనీ ఫౌండ‌ర్ ర‌జాత్ ధారివాల్‌. ఇళ్ల‌మ‌ధ్య త‌రిగిపోతున్న దూరం, పిల్ల‌ల‌కు ఆడుకోవ‌డానికి దొర‌క‌ని స్ధ‌లం.. ఇలా ఎన్నో అంశాలు వారిని ఇంటికే ప‌రిమితం చేస్తున్నాయి. ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ సూప‌ర్‌సూట్‌తో తొల‌గిపోతాయ‌ని చెబుతున్నారు. గ‌తంలోలా ఆనందంగా పిల్ల‌లంతా కలిసి ఆడుకునే రోజులు రాబోతున్నాయ‌ని అంటున్నారు.

ర‌జాత్ ధారివాల్‌.

ర‌జాత్ ధారివాల్‌.


సూప‌ర్‌సూట్ ఎలా ప‌నిచేస్తుంది?

సూప‌ర్‌ సూట్‌ లో రెండు యూనిట్స్ ఉంటాయి. ఒక‌టి చొక్కా(వెస్ట్‌), ఒక‌టి తొడుగు(గ్లోవ్‌). చేతుల‌కు వేసుకున్న తొడుగు నుంచి వ‌చ్చే లేజ‌ర్ కిర‌ణాల‌ను చొక్కాలో ఉన్న సెన్సార్ రికార్డ్ చేసి డిస్‌ ప్లే చేస్తుంది. అలాగే మ‌రికొన్ని ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్స్‌తో దీన్ని అనుసంధానం చేసుకునే వీలు కూడా క‌ల్పించారు. ఆర్‌సీ కార్ల‌ను కూడా ఈ సూట్‌తో కంట్రోల్ చేయ‌వ‌చ్చు. యాండ్రాయిడ్ ఫోన్ల‌కు క‌నెక్ట్ అయి.. ఈ సూట్ వేసుకుని ఆడుకుంటున్న పిల్ల‌ల ఫిట్‌నెస్ డేటా, ఎక్క‌డ ఆడుతున్నారు అనే అంశాల‌ను త‌ల్లిదండ్రులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించే వీలు కూడా ఉంది. జీపీఎస్ అనుసంధానంతో ఇది ప‌నిచేస్తుంది. బ్లూటూత్‌తో క‌నెక్ట్ అయి.. సూప‌ర్‌సూట్ ఫ‌ర్మ్‌వేర్‌ని కూడా అప్‌డేట్ చేసుకోవ‌చ్చు