ఫార్మా, ఏరోస్పేస్, విత్తన రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు జరగాలి

రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభోత్సవం

ఫార్మా, ఏరోస్పేస్, విత్తన రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు జరగాలి

Friday February 24, 2017,

2 min Read

హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయని.. 50కి పైగా ఇనిస్టిట్యూట్స్ సైన్స్ అండ్ డిఫెన్స్, అగ్రికల్చర్ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా భాగ్యనగరంలో 20కి పైగా ఇంక్యూబేషన్ సెంటర్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ను కేంద్రమంత్రి సుజనాచౌదరితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

image


హైదరాబాద్ తార్నాక ఐఐసీటీ ఆడిటోరియంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఫార్మా, ఏరోస్పేస్, సీడ్ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఐ హబ్ ను ప్రారంభించింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రి కేటీఆర్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ను ప్రారంభించారు. ఇన్షియేట్, ఇన్నోవేట్, ఇంప్లిమెంట్ అనే ట్యాగ్ లైన్ తో రీచ్ ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ఫార్మా, ఏరోస్పేస్, సీడ్ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో 50కి పైగా ఇనిస్టిట్యూట్స్ సైన్స్ అండ్ డిఫెన్స్, అగ్రికల్చర్ రంగాల్లో రీసెర్చ్ చేస్తున్నాయన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో తమ హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రయాణించే హెలికాప్టర్ క్యాబిన్ కూడా హైదరాబాదులో తయారయిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా.. రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ అన్నింటిని ఒకే తాటిపైకి తీసుకొస్తామన్నారు.

కేంద్రం ఏ పథకం చేపట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరమని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీని సేవలు దేశవ్యాప్తంగా ఉండాలని ఆయన అకాంక్షించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ లో రీసెర్చ్ కి కేంద్రం అవసరమైన అన్ని నిధులు కేటాయిస్తుందని సుజనా తెలిపారు.

అనంతరం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వెబ్ సైట్, లోగోను కేంద్రమంత్రి సుజనాతో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. బషీర్బాగ్ లోని పరిశ్రమ భవన్ నుంచి.. ప్రభుత్వం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ కార్యకలాపాలు నిర్వహించనుంది.