ఏ సంస్థకైనా బిజినెస్ ప్లాన్ అవసరం ఎంత ?

నిజంగా సేవాభావం ఒక్కటే సరిపోదా..?ఆలోచన ఒక్కటే సరిపోదు..ప్లానింగ్..అవసరమేసోషల్ ఆంట్రప్రెన్యూర్లకు డూస్ అండ్ డోంట్స్ చెప్తున్న జాకబ్ మాథ్యూస్బెంగళూరు ఇడియమ్ డిజైన్ అండ్ కన్సల్టింగ్ నుంచి బైటికి వచ్చి మాథ్యూస్ చెప్పేదేంటి

ఏ సంస్థకైనా బిజినెస్ ప్లాన్ అవసరం ఎంత ?

Thursday August 27, 2015,

5 min Read

ప్రొఫైల్

జాకబ్ మాథ్యూస్ మొదట్లో వివిధరకాల సంస్థలకు జస్ట్ డిజైన్లు ఇచ్చేవారు. దీనికోసం 2005లో ఇడియమ్ డిజైన్ అండ్ కన్సల్టింగ్ అనే బిజినెస్ ఫర్మ్ స్థాపించారు. అలా ఆయన సర్వీస్ ఇచ్చిన సంస్థల్లో మదర్ ఎర్త్ కూడా ఒకటి. ఈ మదర్ ఎర్త్‌ను ప్రారంభించింది ఆయన భార్య నీలమ్ ఛిబ్బరే కావడం విశేషం. మదర్ ఎర్త్ ఓ సోషల్ ఎంట్రప్రెన్యూరింగ్ ప్రాజెక్టు కావడంతో వారికి ఇడియమ్ తరపున సలహాలు ఇస్తూనే.. తానూ తెలియకుండానే ఎంట్రప్రెన్యూరింగ్‌లో ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. చివరికా ఆసక్తి ఎక్కడ దాకా తీసుకెళ్లిందంటే ఇడియన్ కన్సల్టింగ్ నుంచి బైటికి వచ్చేంతవరకూ. 2009లో జాకబ్ పూర్తిగా సోషల్ ఎంట్రప్రెన్యూరింగ్ వైపు వచ్చేశారు.. అంతకు ముందు తనకున్న కన్సల్టింగ్ అనుభవాన్నిరంగరిస్తూ..మొదలుపెట్టిన మొదటి ప్రాజెక్టు స్ప్రింగ్ హెల్త్.

మొదట్లో క్రాస్ సబ్సిడైజేషన్ పై ఆసక్తి చూపిన జాకబ్ ఆ తర్వాత తన పంథా మార్చుకున్నారు. క్రాస్ సబ్సిడైజేషన్( ఇక్కడ ఈ పదం గురించి తెలుసుకోవాలి..ఆర్ధిక స్థోమత బాగా ఉన్నవారి దగ్గర ఎక్కువ ధర, లేదంటే ఫీజు వసూలు చేసి...మధ్యతరగతి,పేదలకు అదే సేవలను తక్కువ ధరకు ఇవ్వడమే క్రాస్ సబ్సిడైజేషన్) సోషల్ ఎంట్రప్రెజైస్‌కు ఇది ఒకప్పుడు ఆదాయ మార్గంగా ... అనుసరించదగినదిగా కన్పించేదని చెప్తారు జాకబ్. కానీ ఎప్పుడైతే 2008లో యూరప్‌లోని ఆర్ధిక సంక్షోభం ..2010నాటికి ఇండియాను కూడా తాకిందో...ఆ మోడల్ ప్రయోజనకరంగా కన్పించలేదంటారు. " అప్పట్లో ఇంకుబేషన్ యూనిట్లకు ఫండింగ్ కూడా దొరకకపోవడం గమనించాను. బిజినెస్ అంటే ఆదాయం వస్తుందంటేనే ఫండింగ్ దొరికేది.. " చెప్పారు జాకబ్. అదే ఆయన్ని సోషల్ ఎంట్రప్రైజెస్ ప్రాజెక్టులు ఎలా నడవాలి..నడపాలి అనే అంశాలతో డిజైన్ తయారు చేసేలా చేసింది.." జాకబ్ మాటల్లోనే చెప్పాలంటే బిజినెస్ పెరిగేందుకు ఓ ఏక్సిలేటర్ లేదంటే కెటలిస్ట్‌లా పని చేసేదే డిజైన్.

స్ప్రింగ్ హెల్త్ వాటర్ టెస్టింగ్ మేళా

స్ప్రింగ్ హెల్త్ వాటర్ టెస్టింగ్ మేళా


నాలుగంచెల వ్యవస్థ అవసరం

ఓసారి సోషల్ ఎంట్రప్రెన్యూర్ రంగంలోకి దిగిన తర్వాత ఆ మార్గంలో అనేక సమస్యలు వస్తాయి. సరైన, స్థిరమైన (సంస్థాగత,పర్యావరణ,అనూహ్య పరిస్థితులతో పాటు ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అడ్జస్ట్ అవగలిగిన ఓ సిస్టమ్) బిజినెస్ ప్లాన్ లేకపోతే..వాటిని తట్టుకోవడం అధిగమించడం కష్టమని చెప్తారు జాకబ్. అప్పటిదాకా ఉన్న లేదంటే ట్రెడిషనల్ వ్యాపారాలకు సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో పాటు..వాతావరణ అనుకూల, ప్రతికూల పరిస్థితులతో ఎలా డీల్ చేయాలనేది తెలుసుకుని ఉండాలి. కానీ సోషల్ ఎంట్రప్రెన్యూర్ రంగానికి వచ్చేసరికి నాలుగంచెల రక్షణ వ్యవస్థ కావాల్సిందే. ఫైనాన్షియల్, పర్యావరణ,సామాజిక, సాంస్కృతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓ మంచి వ్యాపార ప్రణాళిక ఉండాలి. సామాజిక అభివృధ్ధి గురించి ఆలోచిస్తే..అందుబాటులో ఉన్న వనరులను అందరికీ సమానంగా పంచగలగడం... సమాజంపై ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించడంతో సాధ్యపడుతుంది. మరి ఓ మతమో..ఓ కమ్యూనిటీనో..వారి వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మన బిజినెస్ ప్లాన్లలో మార్పులు లేకపోతే.. లక్ష్యాలు సాధించలేం కదా అంటారు. 

దానికి ఉదాహరణగా.. బెంగళూరు సిటీలోని ట్రాఫిక్‌ను చూపిస్తారు జాకబ్. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించని డ్రైవర్లు, సిటిజన్లతో సిటీలో ప్లానింగ్ మెయింటెనెన్స్ అనేది కష్టసాధ్యమైన పని అని వివరిస్తారు. ఇరుకు రోడ్లు..ఎక్కడ బడితే అక్కడ చెత్త వేయడం అలవాటైన నగరాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ చేయడం కష్టమని ఆయన భావన. అక్కడ నివసించే వారి సామూహిక ప్రవర్తనను బట్టే బిజినెస్ ప్లాన్ ఉండాలని ఆయన అభిప్రాయం. ఎవరినైతే మనం టార్గెట్ చేసుకుని పని చేయబోతున్నామో వారి అలవాట్లను క్షుణ్ణంగా గమనించి ముందుకు వెళ్లినప్పుడే ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. అదే విధంగా సోషల్ ఎంటర్‌ప్రెజెస్ కంపెనీకి కూడా డిజైనింగ్ ముఖ్యం. అది వాణిజ్య అవసరం కావొచ్చు.. లేక సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఏ సంస్థకైనా...అందులో పని చేయబోయే వ్యక్తుల అలవాట్లను బట్టి కూడా ఓ కంపెనీ ఎలా ఉండాలనేది డిజైన్ చేయాలి. ఆర్గనైజేషన్ సెట్ అప్ బావున్నప్పుడే అది టార్గెట్‌ను రీచ్ అవుతాం. సాధారణంగా ఆర్గనైజేషన్ అనగానే..వర్క్ ఫ్లో కి సంబంధించిన డిజైన్ చేస్తే సరిపోదు.. అందులో పనిచేయబోయే ఉద్యోగుల మైండ్ సెట్(ఆలోచనా ధోరణి) కూడా సంస్థ లక్ష్యాలకు తగ్గట్లుగా రూపొందించాలి. లేదంటే అందుకు తగ్గట్లుగా ట్రైనింగ్ ఇవ్వాలి.

ప్రయోగాలు..సిమ్యులేషన్-కీ రోల్

ఒకసారి బిజినెస్ మోడల్ తయారు చేసుకున్నంత మాత్రాన అదే శాశ్వతం కాదు. అందులో మనం విధించుకున్న మార్గాలు శిలాశాసనాలు కాదు. ఓ దశలో అప్లై చేసినవి..తర్వాతి దశకు వచ్చిన తర్వాత ఉపయోగపడకపోవచ్చు. భౌగోళిక పరిస్థితులు మారితే..ఫీల్డ్ లో చేపట్టే పనుల పధ్దతి కూడా మార్చుకోవాల్సి రావచ్చు. అంతెందుకు అంతా మారవచ్చు. ఎంటర్‌ప్రెజెస్ కంపెనీ తన ఉద్యోగులకు మార్పులను తెలియజెప్పడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఐతే అంతటితో తన పని అయిపోయిందనుకోకుండా... వారికి కొత్త మార్పును ఆహ్వానించే విధంగా సిధ్దం చేయాలి.." మనం చేసే డిజైనే ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. రకరకాల వాతావరణాల్లో అనేక ప్రదేశాల్లో అనేక వ్యక్తులతో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్లుగానే ప్లాన్ డిజైన్ ఉండాలి. అలానే కొన్ని చేదు అనుభవాలు ఎదురుకావచ్చు. దానికి సిధ్దపడుతూనే త్వరగా వాటి నుంచి పాఠాలు నేర్చుకోగలిగి ఉండాలి. సోషల్ ఎంట్రప్రెన్యూర్లకు ఇది చాలా ముఖ్యమని జాకబ్ సలహా ఇస్తారు.

పరిశుభ్రమైన మంచి నీటి ఆవశ్యకతను వివరిస్తూ జాకబ్

పరిశుభ్రమైన మంచి నీటి ఆవశ్యకతను వివరిస్తూ జాకబ్


ఆర్గనైజేషన్లు... క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్, రీసైక్లింగ్ అనే నాలుగు దశల్లో నడుస్తుంటాయని జాకబ్ చెప్తారు. స్టార్టప్ దశను ఒక్కసారి దాటిందంటే ఆ తర్వాత దానంతట అదే తను అనుసరించిన పధ్దతులు, విధానాలతో నిలదొక్కుకుంటుంది. మూడోదైన డిస్ట్రక్షన్ స్టేజే ప్రమాదకరమైంది. " ఈ దశలోనే పాత ఆలోచనలను పక్కనబెట్టి..కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలంటారు. మొదట్లో స్టార్టప్ ప్రారంభంలో గొప్పవి చేసి ఉన్నా...ఆ తర్వాత దశల్లో చేయాల్సినవే ఎక్కువ ఉంటాయి కాబట్టి..ఒకదానికి పట్టుకుని వేలాడటం సరికాదు..అలానే వాతావరణానికి ( పని చేసే చోటు, ప్రదేశం ఇలా ఏదైనా) మార్పులు..సరిగ్గా గమనించినట్లైతే.. ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది అంచనా వేయగలుగుతారు. లేదంటే కనీసం వాటిని ఎదుర్కొనేందుకు ఓ ప్రణాళిక అయినా రచించుకుంటారు కదా.. "

పైన అంశానికి ఉదాహరణగా..అమెజాన్ బుక్స్ ,నాప్‌స్టర్ మ్యూజిక్ సంస్థల ముందుచూపు గురించి చెప్తారు. ఒకప్పుడవి మామూలు పబ్లిషింగ్‌లో ఉండగా..ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్..ఆన్‌లైన్ మ్యూజిక్ తో అలరిస్తున్నాయ్. ఐతే ఒక్కరాత్రిలో వీరు తమ పంథా మార్చుకోలేదు. ట్రెండ్‌కు అనుగుణంగా మార్పును ఆహ్వానించి నిలబడగలిగారు.. 

"మార్పు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. కొత్తను ఆహ్వానించే ప్రతీ రంగంలోనూ అది అనివార్యంగా వస్తుంది. అదే పధ్దతిలో సోషల్ ఎంట్రప్రెన్యూరింగ్ కూడా ఎక్స్‌పెరిమెంట్లు చేస్తూ పోవాలి. అవసరమైతే అడాప్ట్ చేసుకోగలగి ఉండాలి" చెప్పారు జాకబ్..

" సోషల్ ఎంటర్‌ప్రెజెస్ డిజైన్ కూడా తన పొటెన్షియల్‌ను పెంచుకోగలిగేలా..దానికి అనువుగా డిజైన్ చేయాలి. భవిష్యత్తులో తన బిజినెస్, రేంజ్ పెరిగినా ..దాన్ని వినియోగించుకునే సామర్ధ్యం లేకపోతే.. ఫెయిల్ అవడం ఖాయం. డిజైన్డ్ టూ స్కేల్ అనేది కేవలం ఓ ట్రెండ్ మాత్రమే కొంతమంది విమర్శిస్తున్నారు. వారితో ఏకీభవించను. ఎక్కడైనా బిజినెస్ పెరిగినా వాడుకోలేకపోవడమనేది అసమర్థతే అవుతుంది తప్ప...అసలు బిజినెస్ (ఇక్కడ బిజినెస్ అనే పదం..కేవలం వ్యాపారం మాత్రమే కాదు..సేవలు..కస్టమర్లు..యూజర్లు అనే విస్తృత అర్ధంలో వాడుతున్నాం) పెరగకపోవడం డెడ్ బిజినెస్‌తో సమానమని అభిప్రాయపడ్డారు జాకబ్.

లక్షలాది ప్రజలను ప్రభావితం చేసే సమస్యలను కేవలం గ్రాంట్లు ఇవ్వడం ద్వారానో..లేదంటే ఛారిటీలతోనే తీర్చలేం. వేగంగా వీరి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా బిజినెస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ నే ఆశ్రయించాలి. మనం అనుసరించే పధ్దతినే వేరొకరు అనుకరించే అవకాశం ఇక్కడ ఖచ్చితంగా ఉంది.. "ఉదాహరణకు అమూల్ పాల వ్యాపారాన్నే చూసుకుంటే.. మిగిలిన డైరీ బిజినెస్‌ను అది ప్రభావితం చేస్తుంది. అమూల్ కాకుండా మిగిలిన చాలా కంపెనీలూ పాల వ్యాపారం చేస్తున్నాయి...ఐతే ఇవన్నీ కూడా అమూల్ మోడల్‌నే అనుకరించడం గమనించాలి"

చివరగా..బిజినెస్ ప్లాన్లు తయారుచేసుకునే ముందు జాకబ్ మూడు ప్రధాన సూత్రాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్తారు..

  • సస్టెయినబిలిటీ- స్థిరత్వం

సంస్థభవిష్యత్తులో వచ్చే సాంకేతిక,సాంస్కృతిక, సామాజిక మార్పులను తట్టుకునే విధంగా రూపకల్పన చేసుకోవాలి. సమస్యను తీర్చడం కోసమే మనం బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవడం ఒక్కటే కాకుండా.. చుట్టుపక్కల ఉన్నవారి బేసిక్ కల్చర్‌లో కూడా ఏదైనా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటే అది కూడా టార్గెట్ లో పెట్టుకోవాలి. ఉదాహరణకు తక్కువ రేటులో కొన్ని వందలమందికి ఫ్యూరి ఫైయర్స్ తయారు చేసే కంపెనీ మీదైతే....లక్షలాదిమందికి అంతకన్నా తక్కువలో పరిశుభ్రమైన తాగు నీరు అందించగలిగిన పరిస్థితి ఏర్పడితే..? అప్పుడెలా? వీటిని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ ప్లాన్ రూపకల్పన జరగాలి.

  • విస్త్రత ప్రయోజనాలు..పరిధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్త్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ను ఎక్కువమందికి మీ సేవలు అందించగలిగేలా రూపొందించుకోవాలి..

అలానే రకరకాల ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు, అభిరుచులకు తగ్గట్లుగా మీ బిజినెస్ ను ఆయా ప్రాంతాల్లో నెలకొల్పుకోగలిగేలా ఉండాలి. భాష, సంస్కృతి , చట్టాలు ఎక్కడిక్కడ మారుతుంటాయి. వాటికి అనుగుణంగా బిజినెస్ ప్లాన్ అక్కడ కూడా అమలు చేయగలిగే రీతిలో బిజినెస్ ప్లాన్ ఉండాలని జాకబ్ మాథ్యూస్ చెప్తారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఓ బిజినెస్ ప్లాన్‌కు అందునా సోషల్ ఎంటప్రైజెస్‌కు తప్పకుండా కోర్ బిజినెస్ ప్లాన్‌లో అడాప్టబులిటీ..సస్టెయినబిలిటీ, ముఖ్యమని అర్ధమవుతుంది.

జాకబ్ చెప్పే విలువైన పాఠం సోషల్ ఎంట్రప్రెన్యూర్లకే కాకుండా ప్రతీ పారిశ్రామికవేత్తకూ ఉపయోగపడుతుందని యువర్ స్టోరీ ఆశిస్తోంది.