జైపూర్ లో సరకులందించే పింక్ సిటీ కిరాణా

-గ్రాసరీ టార్గెట్ గా దూసుకు పోతున్న స్టార్టప్-5000లకు దాటిన ఆర్డర్లు -పింక్ సిటీలో మెరుస్తున్నదుకాణం

జైపూర్ లో సరకులందించే పింక్ సిటీ కిరాణా

Tuesday May 19, 2015,

3 min Read

ఈమధ్యకాలంలో స్టార్టప్ వ్యవస్థలో ప్రధానంగా వినబడుతున్న పేర్లలో ఒకటి కిరాణా సరకులు. అమెజాన్, పేటీఎం లాంటి చాలా పెద్ద పెద్ద సంస్థలను కూడా ఆకర్షించింది కిరాణ స్టోర్. ఆన్ లైన్ కిరాణా స్టార్టప్స్ లో ఎక్కువభాగం మెట్రో నగరాల మీద దృష్టి సారించగా ఈ విభాగంలో ఒక మోస్తరు పెద్ద పట్టణాల నుంచి కూడా ఇన్వెస్టర్లు తయారయ్యారు. అలాంటి వాళ్ళలో పింక్ సిటీ కిరాణా ఒకటి. పింక్ సిటీ గా పేరున్న జైపూర్ లో ఎఫ్ఎంసిజి ఉత్పత్తులను, తాజా కూరగాయలను, పళ్ళను అందించే ఆన్ లైన్ కిరాణా స్టోర్ ఇది. దానికి వెయ్యిమందికి పైగా కస్టమర్లున్నారు. ఇప్పటికే 5,000 కు పైగా ఆర్డర్లని విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి తనదైన ప్రత్యేకత ఉంది. దానికి పింక్ డిలైట్ అని పేరు పెట్టుకున్నారు

పీసీకే కో-ఫౌండర్ సందీప్ అగర్వాల్ మాటల్లో చెప్పాలంటే “హడావిడి జీవితాన్ని హాయిగా మార్చుదాం” అనే ఒక చిన్నపాటి ఆలోచనతో మేం పీసీకే ప్రారంభించాం. ఆర్డర్ చేసి ఇంటికే తెప్పించుకోవటం ద్వారా టైం సేవ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అలా ఆదా చేసుకోవాల్సిన వాటిలో కిరాణా సరకులు, ఎఫ్ఎంసిజి ప్రాడక్ట్స్ చాలా ముఖ్యమైనవి. తరచుగా అవసరమయ్యేవి కూడా . ఈ కంపెనీ ప్రధానంగా సరకు నిల్వ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. విస్తరణ తరువాత కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. “ మాకు సొంతగా కిరాణా సరకుల కొనుగోలు, పాకేజింగ్, పంపిణి విధానం ఉంది. ప్రస్తుతం సరకుల నిల్వకు 2,000 చదరపు అడుగుల విస్తీర్ణానికి పైగా చోటుంది” అన్నారు సందీప్

image


పింక్ సిటీ కిరాణా త్రిమూర్తులు

పింక్ సిటీ కిరాణా వ్యవస్థాపకులు సందీప్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్, సుదేశ్ పటోడియా. సందీప్ ఒక ఎమ్మెన్సీ లో పనిచేస్తుండగా ఈ ఆలోచన తట్టింది. ఆఫీస్ అవర్స్ భిన్నంగా ఉండటంతో సమస్య మరీ జటిలంగా తయారైంది. కిరాణా వస్తువులు కొనాలంటే ప్రాణం మీదకి వచ్చేది. ఈ సమస్య గురించి సందీప్ కలిగ్స్ తో చర్చించినప్పుడు వాళ్లలో సుదేశ్ కూడా ఉన్నాడు. ఆ సమస్య తనది కూడా అన్నాడు సుదేశ్. ఆమాటకొస్తే ఆఫీసులకెళ్ళే చాలామంది పరిస్థితి అదే. సందీప్ ఈ విషయాన్ని జైపూర్ లో హోల్ సేల్ కిరాణా వ్యాపారం నడుపుతున్న తన సోదరుడు రాహుల్ దగ్గర ప్రస్తావించాడు. “ ఈ వ్యాపారంలో లాభనష్టాలను మేం బేరీజు వేశాం. పరిశ్రమను, దాని సామర్థ్యాన్ని పూర్తిగా అధ్యయనం చేశాక 2014 ఏప్రిల్ లో జైపూర్ లో పింక్ సిటీ కిరాణా ప్రారంభించాం” అన్నారు సందీప్. టీం సిద్ధపడటానికి కంపెనీకి పెద్దగా సమస్యలేమీ రాలేదు. కాకపోతే నిధులు సమకూర్చుకోవటమే ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతానికి అది కొద్దిపాటు నిధులతో మొదలై నిధులకోసం ఎదురుచూస్తూ ఉంది.

ఫౌండర్లు: సందీప్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్,  సుదేశ్ పటోడియా

ఫౌండర్లు: సందీప్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్, సుదేశ్ పటోడియా


చిన్న నగరాల్లో ఆన్ లైన్ లావాదేవీలు కష్టమే

“ మొదట్లో పీకేసీ ప్రారంభించినప్పుడు జనం ఆన్ లైన్ లావాదేవీలకు కాస్త వెనుకాడారు. అప్పట్లో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకునేవాళ్లం . పైగా 800 రూపాయల పరిమితి పెట్టాం. అందుకే అంతవరకే ఆర్డర్ చేసేవాళ్ళు. కానీ మేం కొంత మంది కస్టమర్లకు ఆన్ లైన్ గురించి చెప్పి ఒప్పించాల్సి వచ్చింది”-రాహుల్

రిపీట్ కస్టమర్లు బాగా పెరిగారు. సగటున ఒక్కో ఆర్డర్ రూ.1500 నుంచి రూ.2,000 వరకూ ఉంది. కొన్ని సందర్భాలలో కస్టమర్లకు కొద్ది గంటల్లోనే సరకులు అవసరమవుతాయి. అందువల్ల ఆ అత్యవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సరకులు అదేరోజు అందించటంలో రెండు రకాల పద్ధతులు పాటించటం మొదలు పెట్టారు. ఖాతాదారులు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. అలా కాకుండా డెలివరీ బై క్యాష్ వెసులుబాటు ఉంది. నగదు లేదనుకుంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఇంటిదగ్గర కూడా ఇవ్వవచ్చు, అయితే, కనీసం 800 రూపాయలకు ఆర్డర్ చేయాలన్నది ప్రస్తుత నియమం. మొత్తం జైపూర్ నగరమంతటికీ ఇది వర్తిస్తుంది. భవిష్యత్తులో ఈ కంపెనీ బాగా విస్తరించాలనుకుంటోంది. పెట్టుబడి పెట్టేవాళ్లకోసం ఎదురుచూస్తోంది. సిబ్బందిని కూడా పెంచుకునే పనిలో ఉంది. నిధులు అందగానే అన్నీ చకచకా జరిగిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నామంటున్నారు సందీప్.

కిరాణా సరకుల స్టార్టప్స్ పనితీరు ఎలా ఉంది ?

ఆర్నెల్లుగా కిరాణా, స్థానిక వ్యాపారాలు ఈ-కామర్స్ జాబితాలో చాలా చురుగ్గా కనిపిస్తున్నాయి. మిగిలిన వాటిలాగా ఆన్ లైన్ కిరాణా వ్యాపారంలో పెట్టుబడి పెట్టటానికి మొదట్లో వెంచర్ కాపిటలిస్టులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ బిగ్ బాస్కెట్, లోకల్ బన్యా, జాప్ నౌ లాంటివి వెంచర్ కాపిటల్ సాయంతో చాలా వేగంగా దూసుకుపోతుండటంతో పరిస్థితుల్లో మార్పు కనబడింది. అదే క్రమంలో గుర్ గావ్ కి చెందిన గ్రోఫర్స్, పెప్పర్ టాగ్ గత కొద్ది నెలల్లో దాదాపు 350 కోట్ల రూపాయల వెంచర్ కాపిటల్ రూపంలో సంపాదించగలిగాయి. మొబైల్ మార్కెట్ లో ముందున్న పేటీఎం కూడా కిరాణా సరకుల పంపిణీలో దిగింది. దీనికి అలీబాబా సంస్థ అండదండలున్నాయి. దీనికి కూడా అమెజానే స్ఫూర్తినిచ్చింది. పేటీెం మొదట్లో బెంగళూరులో మొదలైనా మే నెలలో ఢిల్లీలోనూ ప్రారంభమయింది. గుర్ గావ్ లో కిరాణా, తాజా కూరగాయలతో కొత్త స్టార్టప్ కంపెనీలు మొదలవటం చూశాం. కానీ నిధుల కొరతతో మూలనపడ్డాయి. అనితా కశ్యప్ స్థాపించిన ఫుడ్ మండీ కూడా మొదలైన ఆర్నెల్లలోనే మూతబడింది. గో ఆనియన్స్ కూడ వెబ్ లో దాని ఉనికి కోల్పోయింది. ఢిల్లీ కేంద్రంగా మొదలైన మరో ఆన్ లైన్ కిరాణా వ్యాపారం ఫామిలీ కార్ట్ మొదలైన కొద్ది నెలల్లోనే తన కార్యకలాపాలు నిలిపేసింది