బ్యాంకింగ్ రంగానికే దిక్సూచిలా మారిన ఒకప్పటి చిన్న స్టార్టప్

ఈనాటి స్టార్టప్ కంపెనీలకు ఆనాటి స్ఫూర్తిదాతలు పాతికేళ్ళ ప్రస్ధానంలో ఎన్నో ఒడిదుడుకులుమరెన్నో మైలురాళ్ళు దాటిన PAMAC అన్నీ విజయ గాథలేనా ? పరాజితులు లేరా ?ఎన్ని ఏళ్లయినా పట్టువదలని విక్రమార్కులెందరో ?10, 15, 25 ఏళ్ళ తర్వాతయినా చరిత్ర సృష్టించింది ఎందరో...అంతులేని విజయాలకు పట్టుదలకు మించిన నిచ్చెన లేదు -ప్రశాంత్, ప్రవీణ్

0

ఒక్క అడుగు పడితే చాలు... ఒక ఛాన్స్ దొరికితే అదే పదివేలు అనుకునేవారు ఎందరో. స్టార్టప్ కంపెనీలు మొదలైన కాలంలో ఎంతోమంది నిలదొక్కుకునేందుకు చాలా శ్రమపడ్డారు. కానీ నడిచే దారులన్నీ ఒకేలా ఉంటాయని అనుకోకూడదు. కొన్ని దార్లు వేరే వాళ్ళు వేసినవి ఉంటాయి. మరికొన్ని మనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. మల్టీ మిలియన్ డాలర్ ఫండింగ్ సాధించాలంటే ఎంతో కృషి చేయాలి. విజయానికి ఎన్నో మెట్లు ఉంటాయి. అయితే తమ చేతిలో ఉన్న ఆయుధాలన్నీ జారిపోయాక చివరికి మిగిలిన గడ్డిపరకే మనకెంతో ధైర్యాన్నిస్తుంది. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగారు ఎంతోమంది నవ యువ పారిశ్రామికవేత్తలు. వాళ్ళు స్థాపించిన స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితి రావడానికి వాళ్ళు పడ్డ శ్రమ అంతా ఇంతా ఉండదు.

ఇటు నుంచి కుదరకపోతే... అటునుంచి నరుక్కురమ్మంటారు మన పెద్దలు. పడేసిన చోట వెతుక్కోవడం అనే మాట మనం అనేక సార్లు విని ఉంటాం. అలాంటి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు అడుగులు వేసిన ప్రశాంత్ అసహర్ కథ ఇది. ఛార్టెర్డ్ అకౌంటెంట్ కోర్సు చేస్తూ ఉద్యోగం చేయడం చాలా కష్టం అని చాలాకాలం తర్వాత గానీ ప్రశాంత్‌కి తెలియలేదు. మొదట్లో చాలా అడ్జస్ట్ అయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేస్తూ CA Practice చేయడం తలకు మించిన భారంగా మారింది. కెరీర్‌లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కొత్త అవకాశాలను వెతుక్కోవడం ప్రారంభంలో ప్రశాంత్‌కి కష్టంగా అనిపించేది. అలాంటి టైంలో సిటీ బ్యాంక్ ఓ అవకాశాన్ని ఇచ్చింది. కొన్ని పైలట్ ప్రాజెక్టులను ప్రశాంత్ అండ్ టీంకి అప్పగించింది. ప్రశాంత్ టీం అంతా ఇలాంటి ప్రాజెక్టులపై తమ దృష్టిని పెట్టాయి.

Financial Analysis and Risk Mitigation services ప్రారంభించారు. 25 ఏళ్ళ క్రితం ప్రారంభమయిన PAMAC ప్రస్థానం ఇప్పుడు 1800 ఉద్యోగుల ప్రత్యక్షంగా, మరో 7500 మంది ఉద్యోగులు పరోక్షంగా ఉపాధిని పొందే అవకాశం కలిగిందంటారు ప్రశాంత్. దేశంలోని ప్రతి బ్యాంకు ఇప్పుడు PAMAC కస్టమరే అంటే అతిశయోక్తి లేదు. PAMAC తన సేవలను మలేషియా, యుఏఈ లకూ విస్తరించగలిగింది. అది కూడా నార్మల్ ఫండింగ్ లేకుండా కేవలం నామమాత్రపు వర్కింగ్ క్యాపిటల్ తోనే PAMACని ముందుకు నడిపించారు.

ఎలాంటి అనుభవం లేకుండానే PAMAC సిటీబ్యాంకుని ఎలా సంతృప్తి పరచగలిగింది అని ప్రశాంత్‌ని అడిగితే ‘‘బ్యాంకు వినియోగదారులు రుణాల కోసం అందించే వివిధ పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లను ఒక క్రమ పద్ధతిలో ఉంచడం చాలా కష్టమయిన పని. ఒక స్టాండర్డ్ టెంప్లేట్ ద్వారా ఇవన్నీ మేం సాధించగలిగాం. అప్పట్లో మేం ప్రవేశపెట్టిన టెంప్లేట్ ఇప్పుడు అన్ని బ్యాంకులకు వర్తింపచేస్తున్నాం’’ అంటారు.

చాలా కంపెనీలు ఛార్టెర్డ్ అకౌంటెంట్‌లపై ఎంతో నమ్మకం ఉంచుతాయి. వారిని నమ్మి భద్రతాపరమయిన పత్రాలను కూడా మాకు అందిస్తూ ఉంటాయి. వినియోగదారుల లోన్ అప్లికేషన్లకు సంబంధించి నెలకు 1500 కోట్ల విలువైన రుణాలకు గాను లక్ష పత్రాలను ప్రాసెస్ చేస్తుంటారు. అలాగే నెలకు వివిధ బ్యాంకులకు చెందిన 3.5 లక్షల చెక్కులను క్లియరెన్స్‌కు పంపిస్తూ ఉంటారు.

PAMAC ఇప్పుడు 33 నగరాల్లో, 170 పట్టణాలలో తన కార్యకలాపాలను విస్తరించింది. ఇంతటి విజయానికి స్ఫూర్తినిచ్చింది ఎవరని అడిగితే ‘‘ఇంకెవరు.. మా నాన్నగారే నాకు గురువు, మార్గదర్శి అన్నీ. నా ప్రతి అడుగుని తీర్చిదిద్దింది మా నాన్నగారే. నేను ఏదైనా సమస్యతో సతమతం అవుతుంటే.. ముందు సమస్యను అర్థం చేసుకోమనేవారు మా నాన్నగారు. నేను సీఏ చదివేటప్పుడు కూడా మా క్లాస్ టీచర్ ఆ మాటే చెప్పేవారు. ప్రశ్నను బాగా అర్థం చేసుకుంటే సగం జవాబు దొరికినట్టే అంటారు.

‘‘Banking, Financial services and Insurance (BFSI) క్లయింట్లకు సంబంధించి వివిధ పుస్తకాలు, పత్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించగలగాలి. మనదేశంలో వివిధ కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన విలువయిన పత్రాలను భద్రంగా దాచిపెట్టగలగాలి. న్యాయపరమయిన చిక్కులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా కంపెనీలు అడిగినప్పుడు సాక్ష్యాలను వారికి అందచేయగలగాలి. అందుకే మేం మా కంపెనీ తరఫున లేటెస్ట్ అప్‌డేట్ ఐటీ సాప్ట్‌వేర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, డేటా ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యమయిన అంశం అని నా అభిప్రాయం’’ అంటారు ప్రశాంత్.

‘‘Banking, Financial services and Insurance (BFSI) కంపెనీలకు పనిచేయడం మాకు ఎప్పటినుంచో అలవాటయిపోయింది. ఈనాడు మా క్లయింట్లలో సగం మంది BFSIలే. మనదేశ వాతావరణ పరిస్థితులను బట్టి వ్యవహరించగలగాలి. కస్టమర్లను సంతృప్తి పరచడం, డాక్యుమెంటేషన్ ప్రాసెసిగ్, ఆడిటింగ్ వంటి అంశాలపై సరైన దృష్టి పెట్టాలి. ప్రతి కంపెనీకి నిరంతర అన్వేషణ, అంకితభావం ముఖ్యం’’ అంటారు PAMAC CEO ప్రశాంత్ అసహర్.

25 ఏళ్ళ ప్రస్ధానంలో ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాం. PAMCAL Middle East పేరుతో యూఏ ఈ లో 2006లో ప్రవేశించాం. Dubai Outsource Zone (DOZ) పేరుతో బ్యాంకులకు వివిధ సర్వీసులు ప్రారంభించగలిగాం. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఇక్కడ అమలులో పెట్టగలిగాం. తర్వాత మలేషియాలోని కౌలాలంపూర్‌లో 2011 లో PAMACని ప్రారంభించి ఆగ్నేయాషియా దేశాల్లోకి ప్రవేశించగలిగాం. ఇప్పటికీ మనం అందిస్తున్న సర్వీసులే అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధలు అనుసరిస్తున్నాయి. ప్రతి దశలోనూ మాకున్న లోటుపాట్లను మేం అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నాం అంటారు ప్రశాంత్,

ప్రశాంత్ అషర్ , సీఈఓ
ప్రశాంత్ అషర్ , సీఈఓ

‘‘1995 - 2003 మధ్య కాలాన్ని కీలకమయినది చెప్పుకోవచ్చు. ప్రధాన నగరాల్లో క్లయింట్లను వెదుక్కోవడం, వారికి సంతృప్తి నిచ్చేలా సేవలు అందించడం కత్తిమీద సాములా మారింది. అసలు ఒక నగరానికి వేరే ప్రాంతానికి సంబంధం లేకుండా 30 ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ప్రారంభించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆయా పరిస్థితులను తట్టుకుంటూ ఈ ఏర్పాట్లు చేసుకోగలిగాం. మొదట్లో నెట్‌వర్క్ ప్రాబ్లం వచ్చేది. తర్వాత తర్వాత దాన్ని అధిగమించగలిగాం’’ అని చెప్పుకొచ్చారు ప్రశాంత్.

‘‘దుబాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన దాదాపు ఐదేళ్ళకు గానీ ఇతర ప్రాంతాలకు విస్తరించలేకపోయాం. మలేషియా లోని కౌలాలంపూర్‌లో ఆగ్నేయాషియా హబ్ ప్రారంభించగలిగాం. 2008- 2010 మధ్య కాలంలో వచ్చిన ఆర్థిక ఒడిదుడుకులు మాకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ పరిస్థితుల్లో మా ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటూ, నైపుణ్యాన్ని పెంచుకునే పనిలో పడ్డాం. మాకున్నసర్వీసులను మెరుగుపరుచుకోగలిగాం’’ అన్నారు ప్రశాంత్.

ప్రవీణ్ షిండే, సీఓఓ
ప్రవీణ్ షిండే, సీఓఓ

‘‘మా కంపెనీ ఒకేసారి 30 బ్రాంచ్‌లను ప్రారంభించాలనుకున్నప్పుడు చాలామంది మమ్మల్ని విమర్శించారు. ఒకేసారి ఇలా చేయడం కష్టమే అయినా.. చాలా ఓపికగా వాటిని ప్రారంభించగలిగాం. కష్టమర్లు పెరగడం, వారినుంచి వచ్చే ప్రశంసలతో మా కష్టం దూదిపింజలా మారిపోయింది. మా పోటీదారుల కంటే తక్కువ ధరకు, నాణ్యమయిన సేవలు అందించడం మాకు ప్లస్ పాయింట్ అయింది’’ అంటారు PAMAC COO Pravin Shinde.

బాబర్ మియా, హెడ్ హెచ్ ఆర్
బాబర్ మియా, హెడ్ హెచ్ ఆర్

PAMAC ప్లస్ పాయింట్ ఏంటని అడిగితే మా HR పాలసీయే మా ప్లస్ అంటారు HR హెడ్ Babar Mian. వివిధ కంపెనీలకు అవసరాలను సరిగా గుర్తించడం, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా సర్వీసులు అందించడమే’’ అంటారు బాబర్. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు, సమూహాల అభిప్రాయాలు, భాష, సంస్కృతులను మేం బాగా అర్థం చేసుకోగలిగాం అంటారు బాబర్.

వచ్చే ఐదేళ్లలో మీ లక్ష్యాలేంటని అడిగితే ?... BFSIతో పాటు ఇతర సంస్థల అవసరాలను తీర్చగలిగేలా మా కంపెనీ విస్తరించాలని భావిస్తున్నాం. టెక్నాలజీ పరంగా వస్తున్న వివిధ మార్పులను ఆకళింపుచేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నాం. క్లయింట్లను పెంచుకోవడం, విశ్వసనీయత కలిగించడం’’ మా ముందున్న సవాళ్ళు, కర్తవ్యాలు అంటున్నారు ప్రశాంత్. ప్రవీణ్. అంతర్జాతీయ స్థాయిలో మన సత్తా ఏంటో తెలియచేయాలనుకుంటున్నాం. ఆయా దేశాల్లో మనతో కలిసి పనిచేసేందుకు వచ్చే వివిధ భావసారూప్య కంపెనీలతో చేతులు కలుపుతాం అంటున్నారు.

దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించాలంటే పట్టుదలకు మించిన ఆయుధం లేదంటారు ప్రశాంత్. మన ప్రయాణంలో ఎదురయ్యే చిన్నచిన్న సవాళ్ళను ఎదుర్కోవాలంటే మనమీద మనకు నమ్మకం ఉండాలంటారు. దైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది లేదంటారు ప్రవీణ్.

కోటక్ మహీంద్రా బ్యాంకు, టాటా మోటార్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు PAMAC సర్వీసులను మెచ్చుకున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. జీరో ఎర్రర్ ప్రోగ్రాంలు అందించడంలో PAMAC కి మించింది లేదంటున్నాయి సదరు కంపెనీలు.

ఇప్పటికే ISO 9001:2008 & IEC 27001:2005 సర్టిఫికెట్‌లు, NSIC-D&B-SMERA లు బెస్ట్‌పెర్‌ఫార్మెన్స్ కంపెనీగా PAMACని గుర్తించాయి. అంతర్జాతీయంగా మరెన్నో సర్టిఫికెట్‌లు పొందాలనుకుంటున్న PAMAC నిర్వాహకులు వినియోగదారుల సంతృప్తికి మించిన సర్టిఫికెట్ లేదంటారు. నిజమే కదా?