స్టార్టప్ మొబైల్ యాప్స్‌లో దిట్ట ఈ క్లిక్ ల్యాబ్స్

ఐదుగురు ఐఐటి పూర్వవిద్యార్థుల వినూత్న ఆలోచనస్టార్టప్స్ కు మొబైల్ సర్వీస్ సొల్యూషన్స్ వంద సంస్థలకు ఒకేసారి సేవలు అందించేంత సామర్ధ్యంమూడేళ్లలోనే సత్తా చాటిన క్లిక్ ల్యాబ్స్చిన్న, స్టార్టప్ సంస్థలకు ఉపయుక్తం

స్టార్టప్ మొబైల్ యాప్స్‌లో దిట్ట ఈ క్లిక్ ల్యాబ్స్

Tuesday March 31, 2015,

3 min Read

దేశ పరిస్థితులు సరికొత్త సంస్థల స్థాపనకు, అనువుగా మారుతున్నాయి. అయితే.. కొత్త సంస్థల వ్యవస్థాపకులకు పెట్టుబడి సమకూర్చుకోవడం పెను భారంగా మారుతోంది. ఇప్పటికే నెలకొల్పిన సంస్థలకు.. అదనపు పెట్టుబడులను సమకూర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే.. సరికొత్త ఆలోచనలతో.. నూతన ఆవిష్కరణలతో సంస్థలు స్థాపించాలని, మార్కెట్ ను ఓ కుదుపు కుదిపేయాలని భావించే వారికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు.

image


దుమ్మురేపే ఆలోచనలతో వచ్చే వారికి మూలధన కొరతను దృష్టిలో ఉంచుకొని.. వారికి ప్రధాన అవరోధంగా మారుతున్న సాంకేతికత సమస్యను తీర్చడమే ధ్యేయంగా... క్లిక్ ల్యాబ్స్ ఏర్పాటైంది. సమర్ శింగ్లా, “క్లిక్ ల్యాబ్స్” సంస్థను స్థాపించారు. ప్రారంభించింది మొదలు.. వినియోగదారుడి మొబైల్ నే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది.

ప్రస్తుతం ఈ సంస్థ, స్టార్టప్స్/ఎంవిపి సొల్యూషన్స్, మొబైల్ గేమ్స్, ఎంటర్ ప్రైస్ మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే నాలుగు విభాగాల్లో పనిచేస్తోంది. చండీగఢ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యాపార విస్తరణ బృందం శాన్ ఫ్రాన్సిస్కో లో పనిచేస్తోంది. “ క్లిక్ ల్యాబ్స్” అత్యంత నిష్ణాతులైన 150 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న సంస్థ. వీరంతా కేవలం మూడేళ్ళలో.. మొబైల్స్ కోసం వందకు పైగా విజయవంతమైన సరికొత్త అప్లికేషన్స్, ఆటలు సృష్టించిన ఘనాపాఠీలు.

క్లిక్ ల్యాబ్ సంస్థ భారతీయ ఆర్థిక రంగంలో తనవంతు భాగస్వామ్యాన్ని కలిగి ఉండడాన్ని నేను పరిశీలస్తున్నాను. వంద సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక మౌలికాంశాలు ఈ కంపెనీ వద్ద ఉన్నాయి. అని సమర్ తెలిపారు. ఢిల్లీ ఐఐటీలో సమర్ తో కలిసి చదువుకున్న చిన్మయ్ అగర్వాల్, పరాగ్ జైన్, రోహిత్ గోయల్, సంజయ్ థాకర్ లు కలిసి క్లిక్ ల్యాబ్స్ ను నెలకొల్పారు.

ఢిల్లీ ఐఐటీ, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ లలో చదువుకున్న సమర్, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. దేశంలోని కోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి సరికొత్త సాంకేతికతను అందించేందుకు సమర్ భారత్ తిరిగొచ్చాడు. పౌల్ట్రీ రంగానికి ఉపకరించే ప్రాడిజీ ఫుడ్స్ ను ఆవిష్కరించాడు. ఇవాళ కోళ్ల పెంపకం దారులు, సంప్రదాయ దాణా స్థానంలో సోయాను వినియోగించడం వెనుక సమర్ కృషి ఉందనడంలో సందేహం లేదు. ఏడాది తర్వాత, ప్రాడిజీ ఫుడ్స్ లోని ఎక్కువ షేర్లను అమ్మేసి.. వచ్చిన మొత్తంతో క్లిక్ ల్యాబ్స్ ను ప్రారంభించాడు.

పీటర్ థీల్ వ్యక్తీకరించిన ప్రపంచీకరణ సిద్ధాంతమంటే సమర్ కు ఎంతో ఇష్టం. ఫ్లిప్ కార్ట్ గానీ, జోమాటో గానీ, లేదూ.. ఓలా క్యాబ్స్ కానీ.. ఏదైనా భారతీయ మార్కెట్లను ఒక ఊపు ఊపాయి అంటే... ప్రాశ్చ దేశాల్లో విజయవంతమైన థీల్ ప్రపంచీకరణ సిద్ధాంతపు ప్రాథమిక సూత్రమే కారణమని సమర్ నమ్ముతారు. ఏదైనా సరికొత్త ఆలోచనను వాణిజ్య పరంగా, సమర్థతతో ఒక దేశంలో అమలు చేస్తే.. దాన్ని ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లోనూ అమలు చేయడం అనివార్యమని సమర్ విశ్వాసం.

భారతదేశం మిశ్రమ విపణి. ఏదైనా కొత్తదనాన్ని ఆహ్వానించి ఆదరించాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే.. వ్యాపార విధానాలను కూడా ఇక్కడి వారికి అనువుగా మలచాల్సిన అవసరం ఉంటుంది.

క్లిక్ ల్యాబ్స్ మిగిలిన సంస్థల కన్నా ఎలా భిన్నమైంది..?

అసలు మేము అనుసరిస్తున్న విధానమే మమ్మల్ని ఇతరులకన్నా భిన్నంగా నిలుపుతోంది. మేము దృష్టి కేంద్రీకరిస్తున్న అంశాలు.. మాకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను, ఉత్పత్తి బృందాన్ని ఏర్పాటు చేశాయి. మేము, మా ప్రత్యేకతను ఉపయోగించి.. బి2బి కి భిన్నంగా.. బి2సిలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ఐపిని ఆవిష్కరించాము. అని సమర్ చెప్పారు.

జగ్నూ ను ఇదే సాంకేతిక ఆధారంగా రూపొందించాము. ఇది ట్యాక్సీ హాక్ సొల్యూషన్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది. క్లిక్ ల్యాబ్స్ రూపొందించిన ఈ సాఫ్టువేర్ సొల్యూషన్... ట్యాక్సీ సంస్థలకు, నగర పాలక సంస్థలకు, ఉబర్ తదితర కొత్త సంస్థల పోటీని తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగ పడింది.

సబ్సిడీ విధానంలో... వైఫై, 3జి, 4జి లేదా ఎల్టీఈ లాంటి మొబైల్ నెట్ వర్క్ ద్వారా సంగీతాన్ని అందించే పేటెంట్ ను సొంతం చేసుకున్న బూంబాటిక్స్ సింక్ సంస్థ.. తాజాగా ఎస్4ఎం సిరీస్ ను వెలువరించింది. వోట్ ఛాట్ కూడా ఇదే బాటలో ఆవిష్కృతమైంది. ఇది బ్రెజిల్ కు చెందిన పెట్టుబడి దారుల నుంచి దాదాపు రెండున్నర లక్షల అమెరికన్ డాలర్లను సమీకరించింది.

సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు :

image


రాకర్ ఇంటర్నెట్ విధానంలో.. వంద కొత్త సంస్థలను ప్రోత్సహించాలన్న ఆలోచన ఉంది. అయితే గతానుభవాల రీత్యా రిస్క్ ని దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగేస్తున్నారు. “ చైనాలోని థెన్సెంట్, లేదూ దక్షిణాఫ్రికాలోని నాస్పర్స్ తరహాలో, దేశంలో సమాచార సమ్మేళనాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నాము. ప్రతి ఇంటా ఒకరైనా వ్యాపారి ఉండేలా.. కనీసం బిలియన్ జీవితాలను స్పృశించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాము.” అని సమర్ తెలిపారు.

http://click-labs.com/