మనవాళ్లు తరచుగా క్యాబ్ లో ఏం మరిచిపోతున్నారో తెలుసా?  

1

మరిచిపోవడం అన్నది మనిషి సహజ లక్షణం. కాకపోతే మనవాళ్లకు అది కాస్త ఎక్కువ. అందుకే తరచుగా ఆటోలో హాండ్ బ్యాగు, రైల్లో చార్జరు, బస్సులో కళ్లజోడు వదిలేస్తుంటారు. చిన్నచిన్న వస్తువుల వరకు ఓకే. ఎటొచ్చీ ఖరీదైనవి పోతేనే టెన్షన్. అయితే ఈ మధ్య మనవాళ్లు క్యాబ్స్ బుక్ చేసుకుని కుక్కపిల్లలతో సహా ప్రయాణిస్తున్నారు. డెస్టినేషన్ రాగానే దాన్ని సీట్లో వదిలేసి దిగిపోతున్నారు. ఇది ఎవరో చెప్పిన ముచ్చట కాదు. క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ ఇచ్చిన నివేదిక. మనవాళ్లు ఇంకేం మరిచిపోతున్నారో పెద్ద లిస్టే విడుదల చేసింది. చదివితే ఆశ్చర్యపోతారు.

ఉబర్ విడుదల చేసిన లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్ ప్రకారం ఫోన్లు, రింగులు తరచుగా వదిలేసే వస్తువులు. వాటితోపాటు చార్జర్లు, సన్ గ్లాసెస్ కూడా. విచిత్రంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా మరిచిపోతున్నారట. క్రికెట్ బ్యాట్లు, మొక్కలు, లిక్కర్ బాటిళ్లు, పూల్ స్టిక్స్, కైట్స్ మొదలైనవి ఆ లిస్టులో ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే వెంట తెచ్చుకున్న కుక్క పిల్లలను కూడా వదిలేసి పోతున్నారు.

మచిరిపోయే జాబితాలో బెంగళూరు ముందుంది. ఆ వరుసలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్ కతా ఉన్నాయి. ఎక్కువగా శుక్ర, శని, ఆదివారాల్లో వస్తువులు క్యాబ్ లో మరిచిపోతున్నారట. గత ఏడాది పోగొట్టుకున్న వస్తువుల సంఖ్య అధికంగా వుందని ఉబర్ తెలిపింది. అందునా డిసెంబర్ నెలలో జనం విచ్చలవిడిగా వస్తువులను వదిలేసి పోయారట. ఇంకా ఘోరం ఏంటంటే ఎవరో ఒకాయన 15లక్షల విలువ చేసే చెక్, ఖరీదైన వాచీ క్యాబ్ లో మరిచిపోయాడట.

ఖరీదైన వస్తువుని పోగొట్టుకోవడం ఎవరికైనా బాధాకరమే. అది మళ్లీ దొరకదని తెలిసినప్పుడు నిట్టూర్పు తప్ప ఏం చేయలేం. అలాంటి పానిక్ మూమెంట్ నుంచి రిలీఫ్ అందించడానికి ఉబర్ ఒక ప్లాట్ ఫాం క్రియేట్ చేసింది. దానిపేరే ఉబర్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్. ప్రయాణికుడు ఏదైనా మరిచిపోయిన వెంటనే, దాని గురించి టెన్షన్ పడకుండా, వదిలేసిన వస్తువుని తాపీగా తీసుకోవచ్చు. ఉదాహరణకు ఫోన్ మరిచిపోయాడనుకుందాం. ఫ్రెండ్ ఫోన్ ద్వారా సదరు డ్రైవర్ ని కాంటాక్ట్ అవ్వొచ్చు. ఇద్దరూ కోఆర్డినేట్ చేసుకుని వస్తువుని పొందవచ్చు. ఒకవేళ డ్రైవర్ అందుబాటులోకి రాలేదంటే, యాప్ లో ఇన్ యాప్ సపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పొయిన వస్తువుని తిరిగి సంపాదించుకోవచ్చు. 

Related Stories

Stories by team ys telugu