తెలుగు రాష్ట్రాల్లో వెల్ నెస్ సెక్టార్ మార్కెట్ 500కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో వెల్ నెస్ సెక్టార్ మార్కెట్ 500కోట్లు

Monday November 30, 2015,

3 min Read

భారత్ దేశంలో వెల్ నెస్ ఇండస్ట్రీ మార్కెట్ 90వేల కోట్లు ఉంటుందని జావెద్ హబీబ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా జావెద్ బ్రాండ్ నుంచి చిన్న తరహా సెలూన్ లను లాంచ్ చేశారు. జావెద్ హబీబ్ అంటే 50ఏళ్ల బ్రాండ్ అంటున్న ఆయన సెలూన్, ఇతర వెల్ నెస్ సేవలను వ్యవస్థీకరించిన ఘనత తమదేనని ప్రకటించారు.

“మా బ్రాండ్ తో కలసి పనిచేయడానికి వ్యాపార భాగస్వాములు కావాలి.” జావెద్

సెలూన్ స్టుడియో పేరుతో జావెద్ బ్రాండ్ నుంచి సరికొత్త ప్రాడక్ట్ జనం ముందుకు తెచ్చిన సంస్థ, ఆంధ్రా,తెలంగాణల్లో ఆసక్తి గల ఆంత్రప్రెన్యూర్లను కలుపుకొని పోవాలని చూస్తోంది.

image


మగువలకోసం ప్రత్యేక ఆఫర్

ఫీమేల్ ఆంత్రప్రెన్యూర్లకు 30శాతం డిస్కౌంట్ ఇస్తామని జావెద్ సంస్థ ప్రకటించింది. 15లక్షల ప్రారంభ పెట్టుబడితో తమదగ్గరకి వస్తే ఏడాదిలో 40శాతం వెనక్కి వచ్చే ప్రణాళిక తమ దగ్గరుందని జావెద్ చెప్పుకొచ్చారు. విమన్ ఆంత్రపెన్యూర్ షిప్ పెరుగుతోందని.. వెల్ నెస్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ప్రత్యేక ఆఫరిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

“తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు సువర్ణ అవకాశం. వినియోగించుకోండి.” జావెడ్ హబిబ్ సిఎఫ్ఓ

వెల్ నెస్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న మగువలను తాము అన్ని రకాలుగా సాయం అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

image


రెండు రకాల సేవలు

జావెద్ హబీబ్ సంస్థ లో భాగస్వామ్యం కావాలను వారికి రెండు రాకాల సేవలను అందిస్తామని సంస్థ చెబుతోంది. 

1. ప్రొఫెషనలిజం, ఇందులో ప్రధానంగా బ్యుటిషియన్ ట్రెయినింగ్, హెయిర్ స్టైలింగ్ లాంటి వాటిపై తర్ఫీదు ఇస్తారు. ఇండస్ట్రీలో ప్రొఫెషలిజం పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సేవలను అందిస్తారు. జావెద్ హబీబ్ లో ట్రెయినింగ్ తీసుకుంటే వారిని ప్రొఫెషనల్ గానే కాకుండా వారు వ్యాపారంలో నిలదొక్కుకోడానికి అన్ని రకాల సహయ సహకారాలందిస్తారు.

2. ఆంథ్రప్రెన్యువర్షిప్, ఇందులో ప్రధానంగా ప్రొఫెషల్ గా ఏవిషయం తెలియకపోయినా సరే వెల్ నెస్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గైడ్ లైన్స్ అందిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 10వేల కోట్ల మార్కెట్ ఉన్న వెల్ నెస్ ఇండస్ట్రీ భవిష్యత్ లో మరింత మెరుగైన మార్కెట్ గా మారనుంది. పెట్టుబడులు ఆహ్వానించిన సంస్థ ఆసక్తి గలవారు తమతో సంప్రదించాలని కోరుతోంది.

టైర్ టూ సిటీలే టార్గెట్

భారతదేశంలో టైర్ టూ సిటీలే తమ సంస్థ టార్గెట్ అంటున్నారు జావెద్ హబీబ్. వెల్ నెస్ సెక్టార్ అంటే భారీ హంగులూ ఆర్భాటాలు అవసరమే అయినప్పటికీ మెట్రో నగరాల్లో అద్దెలతో పోలిస్తే చిన్న పట్టణాల్లో చాలా తక్కువ ధరలకు వ్యాపార ప్రాంగణాలు దొరుకుతాయి. పెట్టుబడికి తగిన ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకొచ్చారాయన. మెట్రోనగరాల్లో ఇప్పటికే చాలామంది ఈ రంగంలో ఉన్నారు. తాము కూడా ఓ పెద్ద బ్రాండ్ గా ఉన్నామని.. తమ తర్వాతి డెస్టినేషన్ చిన్న నగరాలే అని జావెద్ చెప్పుకొచ్చారు.

మూడేళ్లలో25వేల సెలూన్లు

వచ్చే మూడేళ్లలో 25వేల సెలూన్లను ఏర్పాటు చేస్తామని జావెద్ ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్ మెంట్, ఎన్ఎస్ డిసి సంస్థలతో కలసి పనిచేస్తున్నామని అన్నారు.

“సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంపాదనతో సమానంగా సెలూన్ రన్ చేసే వారు సంపాదించొచ్చు.” జావెద్

దీనికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కావల్సిన క్వాలిఫికేషన్ అవసరం లేదన్నారాయన. తామే తగిన తర్ఫీదు ఇస్తామన్నారు. ఆసక్తి గల వ్యక్తులు తమతో కలసివస్తే ఆంత్రప్రెన్యూర్లుగా మారడానికి అవకాశం ఉంటుందన్నారు జావెద్.

image


స్టార్టప్ లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

వెల్ నెస్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే స్టార్టప్ లను ఆహ్వానం పలుకుతున్నారు జావెద్. తక్కువ మొత్తంలో ప్రారంభ పెట్టుబడి కలిగిన సంస్థలు కలసి రావాలని అన్నారు. తమ సంస్థ బ్రాండ్ తో వ్యాపారం చేసి ఆంత్రప్రెన్యూర్లుగా ఎదగడానికి ఇది మంచి అవకాశం అని జావెద్ చెప్పుకొచ్చారు. స్టార్టప్ కంపెనీలకు తాము కొత్త ప్రమోషన్, సరికొత్త బ్రాండింగ్ అందిస్తామని చెప్పుకొచ్చారాయన.

సూచనలు,సలహాలు

  1. వెల్ నెస్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే పెద్దగా క్వాలిఫికేషన్ అక్కర్లేదని. ప్యాషన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
  2. స్టైలింగ్ అనేది ఓ ఇన్నో వేషన్. మీలో ఇన్నోవేషన్ వుంటే ఈ రంగంలో రాణించగలరు. దానికోసం ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ థాట్స్ రావాలి
  3. ఈ ప్రొఫెషన్ లేదా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకొండి. మీలాగ మీరుండటానిక ప్రయత్నించండి.
  4. హార్డ్ వర్క్ ని నమ్ముకుంటే ఎవరెస్టే మీ డెస్టినే