ఏమాటకామాటే.. లోకల్ ఫుడ్డులో ఉండే కిక్కే వేరప్పా..!!

Sunday February 28, 2016,

3 min Read

వీధి చివర బండిమీద పొట్టపగిలిన వేడివేడి మిరపకాయ బజ్జీ..

పార్కు దగ్గర సాయంత్రం కమ్మటి పానీపురీ.. 

ఇంకో నాలుగడుగులు వేస్తే వేడివేడి పాకంలో మునకలు వేస్తున్న జిలేబీలు..

వాహ్! రుచి అంటే అదీ! లోకల్ ఫుడ్ ని మించిన రుచి, తృప్తి ఎక్కడుంటాయి చెప్పండి?

మహిమాకి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం. సాయంత్రమైతే ఏదో ఒకటి తినాల్సిందే. ఎంత తొందరపెట్టినా విసుక్కోకుండా..నవ్వుతూ ప్లేట్లో వేడివేడి ఫుడ్ సెర్వ్ చేసే వెండర్స్ అంటే ఇంకా అభిమానం. వారి కథలు విని డాక్యుమెంట్ చేయడం ఆమె అత్యంత ఇష్టమైన హాబీ. అందుకే వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. బెంగళూరులోని బెస్ట్ లోకల్-స్ట్రీట్ ఫుడ్ లొకేట్ చేయడానికి సహకరిస్తూ.. 2004 జులైలో "టాకింగ్ స్ట్రీట్" ప్రారంభించారు. అదే ఏడాది అక్టోబర్లో అది లైవ్ లోకి వెళ్లింది. లోకల్ ఫుడీస్ తోపాటు విదేశీ టూరిస్టులు బెంగళూరులోని బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ని ఎంజాయ్ చేసేలా "టాకింగ్ స్ట్రీట్" మంచి వేదికయింది. 

undefined

undefined


టాకింగ్ స్ట్రీట్

నాస్కామ్ 10కే ఇకో సిస్టంలో భాగంగా ఇంతవరకు 325 ఔట్ లెట్స్ కవర్ చేసింది టాకింగ్ స్ట్రీట్. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ సెంటర్లు, వాటిని చేరడానికి జియో లొకేషన్ సహకారం, ఫుడీల అభిప్రాయాలు ఇలా కంప్లీట్ గైడెన్స్ అందిస్తోంది టాకింగ్ స్ట్రీట్! గత ఏడాది డిసెంబరులో తన కంటెంట్ తో అందరిదృష్టినీ ఆకర్షించడమేకాదు..గోవాకి కూడా విస్తరించింది "టాకింగ్ స్ట్రీట్". 

"గోవాలో ఫుడ్ కల్చర్ ఉంది. భిన్న రుచులను ఆస్వాదించే టూరిస్టులుంటారు. ఎక్కువమంది యూజర్లను ఆకర్షించడానికి గోవా సరైన నగరమనిపించింది. అందుకే బెంగళూరుతోబాటు గోవాపై కూడా టాకింగ్ స్ట్రీట్ దృష్టిసారించింది" అని వివరిస్తారు మహిమ కపూర్.

కేవలం లోకల్ ఫుడ్ ను లొకేట్ చేయడమేకాదు.. ఆన్ లైన్ లో నచ్చిన స్ట్రీట్ ఫుడ్ ని బల్క్ ఆర్డర్ చేయడానికి కూడా వేదికయింది టాకింగ్ స్ట్రీట్. పార్టీలు, ఈవెంట్లకు.. వ్యక్తులు సంస్థలు ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తోంది. లోకల్ ఫుడ్ ప్యాక్ చేసి, డెలివరీ చేయడానికి స్ట్రీట్ వెండర్లకు ట్రైనింగ్ కూడా అందిస్తోంది. ఈ సేవలకుగాను మొత్తం అమౌంటులో కమీషన్ తీసుకుంటోంది. దీనివల్ల ఫుడీస్ కు బెస్ట్ లోకల్ ఫుడ్ ఇంటికి చేరుతోంది. అటు వ్యాపారులకు కూడా ఆదాయం పెరుగుతుందంటున్నారు మహిమ.

అనుభవమే ఆలంబన

మహిమా కపూర్ కోల్కతాలో పుట్టారు. స్కూలింగ్ అంతా ఢిల్లీలో జరిగింది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ నుంచి 2002లో ఫిజిక్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత 2005లో బెంగళూరు ఐఐఎంలో ఎంబిఎ పూర్తిచేశారు. ఎఫ్ఎంసిజి సంస్థల్లో 9ఏళ్లపాటు సేల్స్ మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశారు. వినియోగదారులను అర్థం చేసుకున్నారు. వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో కస్టమర్ల సమస్యలకు పరిష్కారం చూపించారు. తన దగ్గరకు వచ్చినవారికి మంచి చేశాననే సంతృప్తితో జీవిస్తున్నారు 34 ఏళ్ల మహిమ.

సవాళ్లను చిరునవ్వుతో ఎదుర్కొని..పారిశ్రామికవేత్తగా మారడం మహిమా కపూర్ కు అంత సులభంగా సాధ్యం కాలేదు. ఎన్నో సవాళ్లను తన టీమ్ సహకారంతో చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. 

"వనరులను సద్వినియోగం చేసుకుంటున్నానా? అన్న ప్రశ్న నన్ను ప్రతి నెలా వెంటాడేది. వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? పెట్టిన డబ్బు తిరిగి ఎలా సంపాదించాలి? ఇలా ఎన్నో సవాళ్లు! ఈ నేపథ్యంలో నా టీమ్ ఎంతో కష్టపడి పనిచేసింది. నా మెంటర్ అండగా నిలిచారు" అంటారు మహీమా కపూర్

కొన్నిసార్లు నిరాశ ఆవరించిన రోజులు కూడా ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అన్న సందేహాలు కలిగేవి. కానీ సానుకూల దృక్పథంతో సవాళ్లు అధిగమించారు మహీమా కపూర్. ఈ క్రమంలో తన టీమ్, మెంటర్ సహకారం మరువలేనివంటారు మహీమా కపూర్.

రానున్న కాలంలో యూజర్లకు సంతృప్తికరమైన సేవలందించడంలో రాజీ పడకుండా.. స్థిరంగా అభివృద్ధి చెందే కంపెనీగా టాకింగ్ స్ట్రీట్ ను నిలపడమే తనధ్యేయమంటున్నారు మహిమ.

undefined

undefined


బెంగళూరులో బహురుచులు

బెంగళూరులో భిన్నరాష్ట్రాలు, దేశాలవారు జీవిస్తున్నారు. సహజంగానే ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ కల్చర్ కనిపిస్తుంది. ఉదాహరణకు వివి పురం ఫుడ్ స్ట్రీట్ లో అక్కిరోటీ, రాగి రోటీ, పడ్డూస్, హోళిగ్స్ వంటి లోకల్ ఫుడ్ దొరుకుతుంది. ఇంకా 99 వెరైటీ దోశలు జాయింట్స్ లో చైనీస్ దోశె చాలా బాగుంటుందంటారు. మహిమ. 80 ఫీట్స్ ఇందిరా నగర్ రోడ్డులోని షరోన్ టీ స్టాల్లో హైబిస్కస్ టీ అదుర్స్! ఇక వసంత్ నగర్ ఆర్ఆర్ బ్లూమౌంట్ మెక్సికన్ చాట్ మిస్సవ్వకూడదంటారు మహీమా కపూర్! 

ఇలా డిస్కవరీ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ అంటూ.. భిన్నరుచులను కోరుకునే ఫుడ్ లవర్స్ కు దారి చూపించమేకాదు. చక్కని ఫీడ్ బ్యాక్ కూడా అందిస్తోంది టాకింగ్ స్ట్రీట్.