డిజిటల్ మార్కెటింగ్ లో వీళ్లు దుమ్ము రేపుతున్నారు..

Wednesday March 23, 2016,

3 min Read


ఉత్పత్తులు, సేవల గురించి.. వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు తెలియజేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మార్కెటింగ్ పై దృష్టిపెట్టారు సాహిల్ జోప్రా, జాకబ్ జార్జ్. డిజిటల్ మార్కెటింగ్ ను అవకాశాల వేదికగా మార్చుకున్నారు. ఏటా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.

బ్యాక్ గ్రౌండ్

2010లో సాహిల్ చోప్రా, జాకబ్ జార్జ్ చోప్రాకు వచ్చిన ఐడియాకు ప్రతి రూపమే ఐక్యూబ్స్. అప్పట్లో సాహిల్… హాంకాంగ్ టూరిజయం బోర్డులోని డిజిటల్ మార్కెటింగ్ డివిజన్ లో పనిచేసేవారు. అప్పట్లో భారత్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కు అనువుగా లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ ఇంకా ఈ స్థాయిలో విస్తరించలేదు.

ఐ క్యూబ్స్ ఒక డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ. వెబ్, మొబైల్, ఈమెయిల్, వీడియోస్, రిచ్ వీడియోస్, రిచ్ మీడియా సాయంతో కస్టమర్స్ తో కంపెనీని టచ్ లో ఉంచడమే ఐ క్యూబ్స్ కంపెనీ పని. ఇదో ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ. కంపెనీల సేల్స్ పెంచడం … కస్టమర్ల అభిరుచులు, విశ్లేషణలను ఎప్పటికప్పుడు తమకు చందాలు చెల్లించే కంపెనీలకు చేరవేయడమే ఐక్యూబ్స్ పని. ఔట్ సోర్సింగ్ ఈమెయిల్ సర్వీసులను పూర్తి స్థాయిలో అందిస్తోంది. క్యాంపైన్ కన్సల్టింగ్, కాన్సెప్ట్, డిజైన్, ఇంప్లిమెటేషన్ ఇందులో బాగం, సెల్ఫ్ సర్వీస్ సొల్యూషన్… ఇమెయిల్ ద్వారా ప్రచారం చేస్తోంది.

ఐక్యూబ్ ఆపరేషన్స్ ముఖ్యంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఐక్యూబ్స్ ఈమెయిల్ మార్కెటింగ్ (ఉన్న కస్టమర్ల కొనసాగింపు), రెండు ఐక్యూబ్స్ వైర్… ఐక్యూబ్ యాడ్ నెట్ వర్క్ (కొత్త కస్టమర్ల వేట). ఐక్యూబ్స్ సంస్థ 2011లో ఈమెయిల్ విద్య సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా ఈమెయిల్ మార్కెటింగ్ లో శిక్షణ అందిస్తోంది. 2012లో సొంతంగా యాడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసింది. డిజిటల్ ఇన్వెంటరీ, వెబ్, మొబైల్, వీడియో అండ్ రిచ్ మీడియాలో అవకాశాలను అందిపుచ్చుకోవడమే దీని లక్ష్యం.

కంపెనీ ఎలా ఏర్పాటయ్యింది

32 ఏళ్ల సాహిల్ 40 ఏళ్ల జాకబ్ ను హాంకాంగ్ లో కలిశారు. HCITEK సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మార్కెటింగ్ మేజనర్ గా పనిచేసేవారు. హాంకాంగ్ టూరిజం బోర్డ్ ప్రమోషన్ లో HCITEK కంపెనీలే కీలక పాత్ర. హాంకాంగ్ టూరిజం బోర్డులో సాహిల్ పనిచేసేవారు. ఇద్దరూ కొన్నేళ్లపాటు టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ గురించి చర్చించుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న లోపాలను అవగతం చేసుకున్నారు. తర్వాత సాహిల్, జాకబ్ ఉద్యోగాలకు రాజీనామా చేసి… సొంతంగా ఐక్యూబ్స్ ను స్థాపించారు.

క్లైంట్స్ ఎలా దొరికారు

2010నాటికి డిజిటల్ మార్కెటింగ్ ఒక కొత్త కాన్సెప్ట్. అందుకే మొదట్లో క్లైంట్లను పొందడం పెద్ద సవాల్ గా మారింది. మింత్రా, స్నాప్ డీల్ అప్పుడప్పుడే బుడి బుడి అడుగులేస్తున్నాయి. మిత్రా అశుతోష్ లవాణి, స్నాప్ డీల్ రోహిత్ బన్సాల్ … సాహిల్ , జాకబ్ లకు బాగా తెలుసు. దీంతో వారికి ఐక్యూబ్స్ కాన్సెప్ట్ ను వివరించగలిగారు. 

ఇప్పుడు ఐక్యూబ్స్ కు 5 వేలకు పైగా కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. తాజ్ హోటల్స్, లలిత్ హోటల్స్, రాడిసన్ బ్లూ, టైటాన్ వాచెస్, అమెరికన్ స్వాన్, ఎంటీఎస్, యూనినార్, ఇండియా మార్ట్, ఫ్యాబ్ ఇండియా, స్నాప్ డీల్, ఫ్రీకల్చర్, మింత్రా, షాప్ క్లూస్, ఫుడ్ పాండా, కూవ్స్ లాంటి బడా కంపెనీలు… ఇప్పుడు ఐక్యూబ్స్ క్లైంట్స్.

“భారత్ మాకు అతిపెద్ద మార్కెట్. చాలా ఆదాయం వస్తోంది. మరో రెండేళ్లపాటు దీనిపైనే ఫోకస్ చేస్తాం. తర్వాతే గ్లోబల్ మార్కెట్ గురించి ఆలోచిస్తాం”-సాహిల్

బిజినెస్ ఆపరేషన్

ఐక్యూబ్స్ లో వంద మంది ఉద్యోగులున్నారు. గుర్గావ్, బెంగళూరు, కోచిలో ఆఫీసులున్నాయి. గుర్గావ్ హెడ్ క్వార్టర్స్ . ఈ కంపెనీ 35కు పైగా ఈమెయిల్ వర్క్ షాపులను నిర్వహించింది. దుబాయిలో భారీ వర్క్ షాపు నిర్వహించి… ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంది. ఈమెయిల్ విద్య డాట్ కాం ద్వారా పలు కోర్సులను అందిస్తున్నారు. ఐక్యూబ్స్ ఇస్తున్న ఈ మెయిల్ మార్కెటింగ్ సర్టిఫికెట్లకు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కూడా ఉంది.

ఈ స్టార్టప్ ఒక్కో కంపెనీకి నుంచి నెలకు 5 వందల నుంచి 20 వేల డాలర్ల వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ సంస్థ ఆదాయం ఏడాదికి 40 నుంచి 60 శాతం వరకు పెరుగుతోంది. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో ఈ కంపెనీ ముందుంది. అందుకే త్వరలో ఐక్యూబ్స్ ప్రో సర్వీసును ప్రారంభించనుంది. ఇందులో భాగంగా క్రాస్ ఛానల్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ మేనేజ్ మెంట్, రీమార్కెటింగ్ లాంటి సేవలను ఇది అందించనుంది. రీ మార్కెటింగ్ అనేది … డిజిటల్ మీడియాకున్న పవర్ ఫుల్ టూల్. దీనిద్వారా టార్గెట్ ఆడియన్స్ కు మాత్రమే యాడ్స్ కనిపిస్తాయి. ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు నెటిజన్ అభిప్రాయాలకు తగ్గట్లు యాడ్స్ పోస్ట్ అవుతాయి.

డిజిటల్ మార్కెటింగ్ ప్రభావం

ఈ మెయిల్ లాంటి మల్టిపుల్ డిజిటల్ ఛానల్స్ ద్వారా … ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయడం, అటు కస్టమర్లకు, ఇటు కంపెనీలకు తోడ్పడటమే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ప్రభావం భారత్ లో విస్తరిస్తోంది. 2011తో పోల్చితే మార్కెట్ 80 శాతం పెరిగింది. 2011లో దీని వృద్ధిరేటు 31 శాతం, 2015లో ఇది 57 శాతమని ఆక్టేన్ అనే రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2014లో వెబ్ సైట్లు మాత్రమే ఈ మార్కెటింగ్ చేసేవి. ఐట్యూబ్స్ లాంటి సంస్థలు కస్టమర్ల ప్రవర్తనపై మంచి ప్రభావం చూపుతున్నాయని తేలింది. ఇప్పుడు మొబైల్స్ లో చాలా మంది మెయిల్స్ చూస్తున్నారు. అందుకే ఐక్యూబ్స్ ముఖ్యంగా మొబైల్ మార్కెటింగ్ పై దృష్టిపెట్టింది. డాటా సేకరణపై భారీగా ఖర్చు చేస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కోటి డాలర్లు అంటే 67 కోట్ల రూపాయల ఆదాయాన్నే టార్గెట్ గా పెట్టుకుంది.

ప్రపంచంలోనే ఇంటర్నెట్ ను అత్యధికంగా వినియోగిస్తున్న రెండో దేశం భారత్. స్మార్ట్ ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వాడకం విజృంభించింది. అందుకే డిజిటల్ మార్కెటింగ్ కు భారత్ లో మంచి భవిష్యత్ ఉందని చెప్పవచ్చు.