ప్రత్యేకమైన పిల్లల పాలిట వరం... 'తమహార్'

ప్రత్యేక అవసరాలున్న పిల్లల్ని సంరక్షణకు ఖర్చుపెట్టడం కంటే... వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి ప్రయత్నించడం ముఖ్యమని తమహార్, వ్యవస్థాపక డైరెక్టర్ వైశాలీ పాయ్ అంటారు. శారీరక, మానసిక సమస్యలున్న పిల్లల కోసం బెంగళూరు లో పాయ్ రెండు తమహార్ కేంద్రాలను నడుపుతున్నారు.

ప్రత్యేకమైన పిల్లల పాలిట వరం... 'తమహార్'

Friday April 24, 2015,

3 min Read

‘‘ ఏ పిల్లలకైనా సొంతంగా ఆలోచించడం, ఆలోచనకు స్పందించడం, ఒకసారి ఆలోచించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవడం నేర్పించాలి.. ప్రత్యేక అవసరాలుండే పిల్లలకి నేర్పించేటప్పుడు కూడా ఇవే సూత్రాలు వర్తిస్తాయి.. ముందు వాళ్ళకు విషయం అర్థమయ్యేలా ప్రశ్నలు వేయాలి.. అర్థం చేసుకునే సమయం ఇవ్వాలి.. అప్పుడు వాటికి స్పందించమని చెప్పాలి..’’ అని తను పాటించే పద్ధతి గురించి వివరించారు... పాయ్.

image


25 ఏళ్ళ క్రితం చేతిలో ఆక్యుపేషనల్ థెరపీ మాస్టర్స్ డిగ్రీతో బెంగళూరులో అడుగుపెట్టారు వైశాలి. అప్పట్లో నేను ది స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ కర్నాటకలో పనిచేసేదాన్ని. ఈ సంస్థ ఇందిరా నగర్‌లో వుంది. నేను 19 కిలోమీటర్ల దూరంలో వుండేదాన్ని. రోజూ ఆఫీసుకు వెళ్ళడానికి మూడు బస్సులు మారాల్సి వచ్చేది. కదల్లేని, నడవలేని పిల్లల్ని పట్టుకుని చాలా దూరాల్నుంచి ఇందిరా నగర్ దాకా రావడానికి అష్టకష్టాలు పడే కుటుంబాల్ని నేను అప్పట్లో చూసాను.’’ అని బెంగళూరులోని తన తొలిరోజుల్ని గుర్తు చేసుకున్నారు వైశాలి.

అప్పుడే బెంగళూరుకు దూరంగా తమహార్ అనే గ్రామీణ ప్రాంతంలో ‘తమహార్’ ను ప్రారంభించాలని నిర్ణయించారు. నగరంలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక సెంటర్ వుండాలి.. గ్రామీణ ప్రాంతాల్లో 20 కిలో మీటర్ల దూరంలో ఒక సెంటర్ వుండాలని అప్పట్లోనే ఆమె నిర్ణయించుకున్నారు.

పిల్లలకు శిక్షణనిస్తున్న వైశాలి

పిల్లలకు శిక్షణనిస్తున్న వైశాలి


ప్రత్యేక పద్ధతులు

‘‘పిల్లలకి ఏదో చేతులు కాళ్ళు కదల్చడం, కొన్ని పదాలు పలకడం లాంటివి నేర్పిస్తే సరిపోదు. మొత్తం మెదడుకి పని చెప్పాలి. ’’ అంటారామె.

రకరకాల థెరపీలతో పాటు, వాళ్ళను ఆటపాటలతో ఉల్లాసవంతంగా వుంచడం కూడా తమహార్ బోధనలో భాగమే. ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ మా కెరికులంలో భాగంగా వుంటాయి. ఎందుకంటే ఆడలేని పిల్లలు కూడా ఆడుతున్న మిగిలిన పిల్లల్ని చూసి.. కొంత అర్ధం చేసుకుంటారు, ఎంతో కొంత ఆనందిస్తారు..‘‘ అన్నారామె.

image


బోధనాంశాలు

కుటుంబంలో, సమాజంలో వారి స్థానమేంటో తెలియకపోవడమే ఈ (వికలాంగ) పిల్లల ప్రధాన సమస్య. అందుకే వారి తల్లులను, తోడబుట్టిన వాళ్ళను, బంధువులను కూడా శిక్షణ లో భాగం చేస్తారు. అవసరమైతే, దూరపు బంధువులతో మాట్లాడి, పిల్లల అవసరాల గురించి చెప్తామని వైశాలి అన్నారు. మానసిక సమస్య వున్నవారిని జనజీవనం నుంచి దూరం పెట్టడం కంటే, కలుపుకుని పోవడమే సమాజానికి మంచిది, అదే తేలిక కూడా అని తమహార్ నమ్ముతుంది.

ఈ పిల్లలు.. అందరి పిల్లల్లా అయిపోవాలని చాలా మంది తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ ఆ అవకాశం లేదు. అందుకే అసలు ఈ తరహా పిల్లలకేం కావాలో అర్ధం చేసుకుంటే, తల్లిదండ్రులే మంచి థెరపిస్టులవుతారు.’’ అని అంటారు వైశాలి..

ప్రత్యేక పద్ధతులు

ఉచిత సేవలకు విలువుండదు.. మా సేవల మీద మాకు నమ్మకం వుంది కనుక వాటికి ప్రతి కుటుంబం నుంచి కనీసమొత్తాన్ని వసూలు చేస్తాం. కుటుంబ ఆర్ధిక పరిస్థితినీ. ఆ కుటుంబం మా కేంద్రానికి ఎంత దూరంలో వుంటోంది అనే విషయాన్ని దృష్టి లోవుంచుకుని ఈ ఫీజును నిర్ణయిస్తాం.’’ అని వైశాలి అంటారు. 

ఈ రెండు కేంద్రాలూ పూర్తిగా దాతల విరాళాలతోనే పనిచేస్తున్నాయి. ఇక్కడ వాడే పరికరాలను మాత్రం వైశాలీ కుటుంబమే సమకూరుస్తుంది.

ఇదంతా కష్టమే అయినా.. అసాధ్యం కాదని వైశాలి విశ్వాసం. ఈ రెండు కేంద్రాలూ ఆర్ధికంగా ఇంకా విరాళాల మీద ఆధారపడుతున్నా.. నిర్వహణ విషయంలో మాత్రం స్వతంత్రంగానే వున్నాయి. ‘‘ రోజు వారి నిర్వహణలో నేను పెద్దగా తలదూర్చను.’’ అంటున్నారు.. వైశాలి. ‘‘మా పని ఇప్పుడే మొదలైంది. మానసిక, శారీరక ఇబ్బందులున్న పిల్లలున్న అనేక కుటుంబాలని ఇంకా ఆదుకోవాల్సి వుంది. వీళ్లంతా నగరాలకు దూరంగా, మురికివాడల్లో, పల్లెల్లో, అభివృద్ధి చెందని పట్టణాల్లో మగ్గిపోతున్నారు. ఈ వైకల్యం వల్లా, ఆదుకునే వారు లేకపోవడం వల్లా... సమాజానికి ఉపయోగ పడాల్సిన ఎందరో పిల్లల్లోని టాలెంట్ వృధాగా పోతోంది.’’ అంటారామె.

తమహార్ టీం

తమహార్ టీం


అంతా ఒక తాను ముక్కలే..

తను, తన టీమ్ చేస్తున్న పనిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదంటారు వైశాలి. పిల్లలంతా ఒకటేనని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్తే అది అబద్ధమే అవుతుంది. అయితే, పిల్లలంటే పిల్లలే. వారు సకలారోగ్యాలతో వున్నా.. ప్రత్యేక అవసరాలు వున్న పిల్లలైనా..వారంతా పిల్లలే.. ’’ అని వైశాలి నమ్ముతారు.