స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి ?

ఓ శుక్రవారం నాడు యువర్ స్టోరీ నిర్వహించిన స్టార్టప్ మీట్ .. ఔత్సాహిక ఆంట్రప్రన్యూర్స్ తో కిక్కిరిసింది. దాదాపు పాతికమంది యువ ఆంట్రప్రన్యూర్స్ చెప్పిన స్టార్టప్ ఆలోచనలను ఆహ్వానించడమే కాక, అప్పటికప్పుడే భాగస్వాములు కావడానికి కూడా ఎంతో మంది ఉత్సాహం చూపించారు.

0

మీ దగ్గరున్న ఖరీదైన బట్టల్ని, వస్తువుల్ని ముక్కుమొహం తెలియని వాళ్ళకి ఇస్తారా..? కాలేజీ క్యాంపస్ లో మ్యాగీ నూడుల్స్ అమ్ముతూ రెండు కోట్లు సంపాదించడం సాధ్యమేనా? నదులు, సముద్రాలు లేని బెంగళూరులో స్క్యూబా డైవింగ్ కోర్స్ నేర్చుకుంటారా? బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్ళి బ్యాక్ పేకింగ్ లో బిజినెస్ మొదలుపెడదామంటే మీరేమంటారు ?

DEE BOWL TEAM
DEE BOWL TEAM

ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్న యాభైమందికీ ఇలాంటి ఆలోచనలే వున్నాయి. ఓ శుక్రవారం నాడు యువర్ స్టోరీ నిర్వహించిన స్టార్టప్ మీట్ .. ఇలాంటి ఔత్సాహిక ఆంట్రప్రన్యూర్స్‌తో కిక్కిరిసింది. దాదాపు పాతికమంది యువ ఆంట్రప్రన్యూర్స్ చెప్పిన స్టార్టప్ ఆలోచనలను ఆహ్వానించడమే కాక, అప్పటికప్పుడే భాగస్వాములు కావడానికి కూడా ఎంతో మంది ఉత్సాహం చూపించారు.

వ్యాపార అవకాశాలు, వినియోగదారులు మెచ్చుకునే అంశాలు, వాటికి పరిష్కారాలు, ధరలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో కష్టసుఖాలమీద జోకులు.. ఇలా సాగింది .. ఆ మూడు గంటల సదస్సు. ఇక వేడి వేడి టీ, సమోసాలు సరేసరి.

తమ అనుమానాలు తీర్చుకుంటున్న ఆడియన్స్
తమ అనుమానాలు తీర్చుకుంటున్న ఆడియన్స్

గుల్షన్‌కి మాట్లాడ్డం అంటే ఇష్టం. బాగా తినడం అంటే ఇష్టం. బాగా వండడం కూడా ఇష్టమే.. వీటన్నిటితో పోలిస్తే, తనకి ఇంజనీరింగ్ మీద పెద్దగా ఇంట్రెటస్ట్ లేదని కాలేజిలో చదివిన మొదటి సంవత్సరమే గుల్షన్‌కి అర్థమయిపోయింది. అందుకే క్యాంపస్ లోనే తన పాకవిద్యని పరీక్షకి పెట్టాడు. తన తొలి వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. ‘‘ మాకు లైసెన్స్ లేదు. ఒక రోజు అధికారులొచ్చి అకౌంట్స్ చూపించమన్నారు. నిజానికి అప్పుడే మాకూ అర్థమయింది... మా వ్యాపారం విలువ రూ. 2 కోట్లకు చేరిందని.. ’’ నవ్వుతూ చెప్పాడు.. గుల్షన్ అయ్యర్.. ఇప్పుడు అతను గుల్లుస్ కిచన్.కామ్(GullusKitchen.com) వ్యవస్థాపకుడు.

అప్పటిదాకా అడ్వర్టయిజెమెంట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న కుర్రాళులు ఓ సారి స్క్యూబా డైవింగ్ కి వెళ్ళారు. ఒకసారి డైవ్ కొట్టారోలేదో.. అందులో తలమునకలుగా మునిగిపోయారు. అంతే, తమ అడ్వర్టయిజ్‌మెంట్ ఉద్యోగాలను వదిలేసి.. ఇటాలియన్ సంస్థతో కలిసి బెంగళూరులో ఆక్వానాట్ సంస్థను నెలకొల్పారు. ఇప్పుడు ఈ సంస్థ స్క్యూబా డైవింగ్‌లో సర్టిఫికేషన్ కోర్స్ ఆఫర్ చేస్తోంది.

ప్రాంతీయ భాషల్లో ఈ-బుక్స్ బిజినెస్‌లో గ్యాప్ వుందని గ్రహించి మొదలైన సంస్థ ప్రతిలిపి.కామ్. అరుదుగా వాడే ఖరీదైన బట్టలు, యాక్ససరీస్ ను అవసరమైన వారికి అరువిచ్చి డబ్బు సంపాదించే అవకాశాన్నిస్తుంది..క్లోజీ.కామ్. తక్కువ ధరకే ఖరీదైన బట్టలు వేసుకోవాలనే సరదా కూడా ఈ సైట్ ద్వారా తీర్చుకోవచ్చు.

ఆసియా ఆన్ లైన్ మార్కెట్లో బ్యాక్ ప్యాకర్స్‌కి, ఫ్లాష్ ప్యాకర్స్‌కి బాగా డిమాండ్ వుందని ఇథాకా ఫౌండర్ గ్రహించారు.

jumkey
jumkey

ఈ సదస్సులో టెక్నాలజీ ప్రధాన స్టార్టప్స్ కూడా వున్నాయి. అలాంటి వాటిలో ఒకటి డేజ్ ఇన్ఫో.

ఇక ఈ కామర్స్ రంగానికి వస్తే, టచ్ పాయింట్ ( షాపర్స్‌కి వోచర్స్ లాంటివి ఇచ్చే సంస్థ), జమ్‌కీ (ఆన్ లైన్ లో జ్యువెలరీ అమ్మే సంస్థ) లాంటివి చెప్పుకోవచ్చు. రైతులకు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా వుండే పోర్టల్ ఆగ్మార్ట్. గృహప్రవేశాల్లాంటి శుభకార్యాలకు పూజాదికాల సేవలు అందించే మరో వెబ్ సైట్ ఈవెంటోసార్.

klozee
klozee

ఇండస్ట్రీ ఈవెంట్స్‌కి కార్పొరేట్ స్పాన్సర్స్‌ను వెతికిపెట్టే స్పాన్సర్ సోర్స్, ఎంటర్‌టైన్ మెంట్ ఆప్షన్స్ అందించే డీబౌల్, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే డ్వెల్ మార్ట్, బ్రాండింగ్ రీసెర్చ్ తదితర సేవలను అందించే సెంటర్ ఫర్ గ్రావిటీ, ఆకర్షణీయమైన వీడియోలను రూపొందించే యోగర్ట్ లాబ్స్ , కార్పొరేట్ కమ్యూనిటీ వేదికగా క్యామ్ బజ్... లాంటి మరికొన్ని స్టార్టప్స్ కూడా ఈ సదస్సులో తమ అనుభవాలను పంచుకున్నాయి.

తమ కార్పొరేట్ జాబ్స్ కి ఎప్పుడు గుడ్ బై చెప్పేసి వ్యాపారంలో దూకుదామా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఆంట్రప్రన్యూర్స్ చాలా మంది ఈ సదస్సుకు ఆడియన్స్ గా వచ్చారు. వీరితో పాటు కొందరు ఇన్వెస్టర్లు కూడా హాజరయ్యారు.

Related Stories